Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీకదీపం సీరియల్ ఊహించని టర్న్ తీసుకుంది. నువ్వే తన తల్లివని హిమకు తెలిసిపోయిందా..? అన్న తులసి ప్రశ్నకు దీప అవునని సమాధానం ఇచ్చింది. ఆ తరువాత ఈ ఆంటీ ఎవరని హిమ అడగటం.. డెలివరీ సమయం నుంచి ఇప్పటివరకు జరిగినవన్నీ దీప చెప్పేయం, అవన్నీ కార్తీక్ వినడం జరిగిపోయాయి. తనకు కవలలు పుట్టిన విషయం నానమ్మ(సౌందర్య) తరువాత నర్సు తులసికే తెలుసని.. తులసినే నిన్ను నానమ్మ చేతిలో పెట్టిందని హిమతో దీప చెబుతుంది. అంతేకాదు ఆ విషయం ఎనిమిదేళ్ల వరకు తనకు తెలీదని.. జాతర్లోనే మొదటగా నిన్ను చూశానని.. అప్పుడే పేగు మెలిపెట్టినట్లు అనిపించిందని ఇన్ని రోజులు తన మనసులో దాచుకున్న నిజాలను హిమకు చెప్పేసింది. అలాగే ఆ తరువాత జరిగిన సంఘటనలు.. హిమకు నిజం ఎలా తెలిసింది. ఇలా ప్రతి విషయాన్ని దీప చెబుతుంది.
ఇక ఈ విషయాలన్నీ బయట ఉన్న డాక్టర్ బాబు వింటూ జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటాడు. తామిద్దరిని కలిపేందుకు నానమ్మ ఇదంతా చేసిందని.. అలా సౌర్య తన దగ్గర, నువ్వు నాన్న దగ్గర పెరిగావంటూ దీప వెల్లడించింది. దీంతో కార్తీక్ గుండెకు గాయం తగిలినట్లు అయ్యింది. ఇన్ని రోజులుగా తాను భయపడ్డది నిజమేనని తెలిసిన కార్తీక్.. కారులో వెళుతూ సంఘటనలు గుర్తు చేసుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు.
మరోవైపు కార్తీక్ కోసం ఇంట్లో సౌందర్య టెన్షన్ పడుతుంటే.. ఆనందరావు ఆమెకు ధైర్యం చెబుతాడు. ఇక కార్తీక్ ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వడంతో సౌందర్య ఇంటికి వచ్చిన మౌనితను ఆనందరావు, సౌందర్యలు నిలదీస్తారు. అసలు కార్తీక్ గురించి పట్టించుకోవడానికి నువ్వెవరు అంటూ గట్టిగా అడుగుతారు. ఇక బయటకు వెళ్తూ మౌనిత.. అన్నీ తెలుస్తాయి. నేనేం చేస్తానో మీకు తెలీదంటూ సౌందర్య, ఆనందరావులతో అంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.