Home /News /movies /

వంటలక్కకు యాక్సిడెంట్ గతం మర్చిపోయి...షాకింగ్ ట్విస్ట్...ఏం జరిగిందంటే...?

వంటలక్కకు యాక్సిడెంట్ గతం మర్చిపోయి...షాకింగ్ ట్విస్ట్...ఏం జరిగిందంటే...?

కార్తీక దీపం (Image: HOTSTAR)

కార్తీక దీపం (Image: HOTSTAR)

ఇప్పటికే వంటలక్క ఫ్యామిలీ అంతా ఒక్కటవుతోందని ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడే ఒక అనుకోని ట్విస్ట్ ఎదురుకానుందని టాక్ వినిపిస్తోంది.

    కార్తీక దీపం సీరియల్‌లో కొత్త యాంగిల్ బయటపడింది. ఇప్పటికే వంటలక్క ఫ్యామిలీ అంతా ఒక్కటవుతోందని ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడే ఒక అనుకోని ట్విస్ట్ ఎదురుకానుందని టాక్ వినిపిస్తోంది. అందులో ఎవరూ ఊహించని విధంగా వంటలక్క, కార్తీక్ ఒక్కటవుతున్న సమయంలో ఆమెకు యాక్సిడెంట్ అవుతుందని దీంతో ఆమె చనిపోయిందని అంతా అనుకుంటారని, అయితే వంటలక్క మాత్రం గతం మర్చిపోయి, వేరే కుటుంబంలో ఆశ్రయం పొందుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మలయాళంలో కార్తీకదీపం మాతృక కారుముత్తు సీరియల్ పూర్తి అయ్యింది. అందులో ఈ తరహా ట్విస్ట్ తోనే కార్తీక్, దీప మరోసారి విడిపోతారని ఉంది. అయితే పిల్లలు సౌర్య, హిమలను నాయనమ్మ సౌందర్య పెంచుందట. అయితే దీప దూరమైన బాధలో కార్తీక్ అనారోగ్యం పాలవుతాడని, అక్కడి నుంచి చికిత్స కోసం విదేశాలకు వెళ్లతాడని టాక్ వినిపిస్తోంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Karthika deepam, Vantalakka, Vantalakka deepa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు