KARTHIKA DEEPAM SERIAL DID NOT UPLOADED ON HOTSTAR AT MORNING 6 AM FANS GOES CRAZY ON LATE NR
Karthika Deepam: ఆగిపోయిన కార్తీకదీపం సీరియల్.. ఏం జరిగిందంటూ అభిమానులు ఆందోళన
Karthika Deepam
Karthika Deepam: స్టార్ మా లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఇప్పటికే ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాలలో మంచి ఫేమ్ ను సాధించుకుంది. ఇక ప్రతిరోజు ఈ సీరియల్ కోసం ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు.
Karthika Deepam: స్టార్ మా లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఇప్పటికే ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాలలో మంచి ఫేమ్ ను సాధించుకుంది. ఇక ప్రతిరోజు ఈ సీరియల్ కోసం ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఒకప్పుడు సీరియల్స్ టీవీలో వచ్చే వరకు ఎదురు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ద్వారా సీరియల్ సమయం కంటే ముందే ఎపిసోడ్ లను చూస్తున్నారు. ఇక ప్రతిరోజూ స్టార్ మా లో రాత్రి 7.30 ఈ సీరియల్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక చాలామంది ఈ సీరియల్ కోసం సాయంత్రం వరకు వేచి చూడలేక ఉదయాన్నే 6 గంటలకు హాట్ స్టార్ లో చూస్తున్నారు. అంతగా అభిమానం చూపిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1131వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. కానీ ఇప్పటివరకు ఈ హాట్ స్టార్ లో సీరియల్ ను అప్ లోడ్ చేయకపోగా.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఉదయం 8:30 అయినా ఈ సీరియల్ ఇంకా అప్ లోడ్ కాకపోవడంతో చాలామంది ఈ సీరియల్ ఎందుకు ప్రసారం కాలేదని తెగ ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సీరియల్ తో పాటు మరో మూడు సీరియల్ గుప్పెడంత మనసు, చెల్లెలి కాపురం, కస్తూరి ల ఎపిసోడ్ లను హాట్ స్టార్ లో కూడా ఇప్పటివరకు అప్ లోడ్ చేయలేదు. ఇక వీటితో పాటు ప్రసారమయ్యే మరిన్ని సీరియల్స్ జానకి కలగనలేదు, వదినమ్మ, గృహలక్ష్మి లను మాత్రం అప్ లోడ్ చేశారు.
హాట్ స్టార్ లో ఇలాంటి పరిస్థితి గతంలో వచ్చినప్పటికీ గంట మాత్రమే లేటు చేసారు.. కానీ ఈసారి ఇప్పటికి ప్రసారం కాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ రాకపోవడంపైఅభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సీరియల్లో కాస్త ఆలస్యంగా కూడా అప్ లోడ్ చేస్తుంటారు. ఇక ఈసారి కూడా అదే జరగనుందా అని సీరియల్ అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఉదయమే ప్రసారం కానీ ఈ సీరియల్.. రాత్రి స్టార్ మా లో కూడా ప్రసారం కావడం అనుమానంగా ఉందని కొందరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.