Karthika Deepam: స్టార్ మా లో ఓ రేంజ్ లో సక్సెస్ అందుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. ఇప్పటికే ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాలలో మంచి ఫేమ్ ను సాధించుకుంది. ఇక ప్రతిరోజు ఈ సీరియల్ కోసం ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఒకప్పుడు సీరియల్స్ టీవీలో వచ్చే వరకు ఎదురు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ద్వారా సీరియల్ సమయం కంటే ముందే ఎపిసోడ్ లను చూస్తున్నారు.
ఇక ప్రతిరోజూ స్టార్ మా లో రాత్రి 7.30 ఈ సీరియల్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక చాలామంది ఈ సీరియల్ కోసం సాయంత్రం వరకు వేచి చూడలేక ఉదయాన్నే 6 గంటలకు హాట్ స్టార్ లో చూస్తున్నారు. అంతగా అభిమానం చూపిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1049 ఎపిసోడ్ కి ప్రసారం కానుంది. కానీ ఇప్పటివరకు ఈ సీరియల్ ను అప్ లోడ్ చేయకపోగా.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఉదయం 9 అయినా ఈ సీరియల్ ఇంకా అప్ లోడ్ కాకపోవడంతో చాలామంది ఈ సీరియల్ ఎందుకు ప్రసారం కాలేదని తెగ ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సీరియల్ తో పాటు మరో మూడు సీరియల్ గుప్పెడంత మనసు, చెల్లెలి కాపురం, కస్తూరి ల ఎపిసోడ్ లను హాట్ స్టార్ లో కూడా ఇప్పటివరకు అప్ లోడ్ చేయలేదు. ఇక వీటితో పాటు ప్రసారమయ్యే మరిన్ని సీరియల్స్ జానకి కలగనలేదు, వదినమ్మ, గృహలక్ష్మి లను మాత్రం అప్ లోడ్ చేశారు.
ఇప్పటి వరకు హాట్ స్టార్ లో ఇలాంటి పరిస్థితి ఎన్నడు రాకపోగా.. ప్రస్తుతం దీని గురించి ప్రేక్షకులు పలు కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సీరియల్లో కాస్త ఆలస్యంగా కూడా అప్ లోడ్ చేస్తుంటారు. ఇక ఈసారి కూడా అదే జరగనుందా అని సీరియల్ అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఉదయమే ప్రసారం కానీ ఈ సీరియల్.. రాత్రి స్టార్ మా లో కూడా ప్రసారం కావడం అనుమానంగా ఉంది.
ఇక ఈ సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారడంతో రెప్పపాటు సమయాన్ని కూడా వదలట్లేదు ప్రేక్షకులు. మొత్తానికి దీప అమ్మ తనం గురించి కార్తీక్ కు నిజం తెలిసింది. దీప కు క్షమాపణలు చెప్పాలని అనుకున్న కార్తీక్.. అంతలోనే దీప అనారోగ్య సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. వెంటనే హాస్పిటల్ కి దీప ని తీసుకెళ్లిన కార్తీక్.. దీప పరిస్థితి చూసి తెగ ఏడుస్తున్నాడు. ఈ సీన్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేయగా.. అంతలోనే మౌనిత హాస్పిటల్ కి రావడంతో మళ్లీ ప్రేక్షకులలో భయాందోళన ఎదురవుతున్నాయి. మళ్లీ దీప ను ఏం చేస్తుందా అని ఆందోళన చెందుతున్నారు ప్రేక్షకులు. ఆ తర్వాత జరగబోయే దాని గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సమయంలో ఇలా కావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anandh rao, Doctor babu, Hima, Hot star, Karthika deepam, Monitha, Premi vishwanth, Soundarya, Sourya, Vantalakka