వంటలక్క దెబ్బకు బుల్లితెర రికార్డులన్నీ బద్దలు...స్వీట్లు పంచుకున్న కార్తీక దీపం యూనిట్..

తాజా రేటింగ్స్‌లో ఈ వారం కూడా కార్తీక దీపమే టాప్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో వదినమ్మ నిలిచింది. బార్క్ ఇండియా విడుదల చేసిన ఈ రేటింగ్స్‌లో వరుసగా కార్తీక దీపం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే కార్తీక దీపం ఆదరణతో అటు స్టార్ మా చానెల్ అయితే తన మాతృసంస్థ అయిన స్టార్ ప్లస్ ను సైతం రేటింగ్స్‌లో దాటేసింది.

Krishna Adithya | news18-telugu
Updated: December 5, 2019, 9:29 PM IST
వంటలక్క దెబ్బకు బుల్లితెర రికార్డులన్నీ బద్దలు...స్వీట్లు పంచుకున్న కార్తీక దీపం యూనిట్..
కార్తీక దీపం యూనిట్ (Image: Youtube)
  • Share this:
కార్తీకదీపం సీరియల్ దెబ్బకు బుల్లితెరపై రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. తెలుగులో టీవీప్రోగ్రామ్స్ కు సంబంధించిన తాజా రేటింగ్స్‌లో ఈ వారం కూడా కార్తీక దీపమే టాప్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో వదినమ్మ నిలిచింది. బార్క్ ఇండియా విడుదల చేసిన ఈ రేటింగ్స్‌లో వరుసగా కార్తీక దీపం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే కార్తీక దీపం ఆదరణతో అటు స్టార్ మా చానెల్ అయితే తన మాతృసంస్థ అయిన స్టార్ ప్లస్ ను సైతం రేటింగ్స్‌లో దాటేసింది. కాగా స్టార్ మా ఈ ఘనత సాధించడం వెనుక బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్ ఉందని అంటున్నప్పటికీ, అదంతా తూచ్ అని స్టార్‌మా టాప్‌లో నిలిచేందుకు వంటలక్క ఆదరణే కారణమని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు సీరియల్స్‌లో విశేష ఆదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం, అయితే ఈ సీరియల్ లో దీప కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు.

కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. అయితే దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించేలా నటించింది.
Published by: Krishna Adithya
First published: December 5, 2019, 9:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading