కార్తీక దీపం సీరియల్‌లో ఇదే అసలైన ట్విస్ట్...డాక్టర్ బాబుతో మోనిత పెళ్లి

ఒక వైపు కార్తీక్ దీపలను కలిపేందుకు కవల పిల్లలు ఇద్దరూ తాపత్రయపడుతుంటే...కార్తీక్ మాత్రం దీప వంటలక్కను క్షమించే పరిస్థతి కనినిపించడం లేదు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందని టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: November 30, 2019, 8:22 PM IST
కార్తీక దీపం సీరియల్‌లో ఇదే అసలైన ట్విస్ట్...డాక్టర్ బాబుతో మోనిత పెళ్లి
కార్తీక దీపం (Image: Hotstar)
  • Share this:
తెలుగు సీరియల్స్‌లో విశేష ఆదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం, అయితే ఈ సీరియల్ లో దీప కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు. కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. అయితే దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించేలా నటించింది. అయితే తాజాగా కార్తీక దీపం సీరియల్ మొదటి సీజన్ పూర్తి కావొచ్చింది. అయితే ప్రస్తుతం కథలో ఒక అనుకోని ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. ఒక వైపు కార్తీక్ దీపలను కలిపేందుకు కవల పిల్లలు ఇద్దరూ తాపత్రయపడుతుంటే...కార్తీక్ మాత్రం దీప వంటలక్కను క్షమించే పరిస్థతి కనినిపించడం లేదు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందని టాక్ వినిపిస్తోంది.

కార్తీక్ పై కన్నేసిన మోనితనే పెళ్లిచేసుకోమని వంటలక్క త్యాగం చేస్తుందని ఇదే కథలో ట్విస్ట్ అని కొన్ని ఫ్యాన్ ప్రిడిక్షన్స్ వినిపిస్తున్నాయి. అయితే అటు మలయాళంలో మాత్రం వంటలక్కకు యాక్సిడెంట్ అవుతుందని, గతం మరిచిపోయినట్లు చూపించారు. మరి ముందు ముందు ఏం జరుగుతోందో అనే టెన్షన్ ను మాత్రం ఇంకొంత కాలం భరించాల్సిందే...
Published by: Krishna Adithya
First published: November 30, 2019, 8:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading