Karthika Deepam: సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న దీప‌.. 'కార్తీక దీపం'లో ట్విస్ట్ అదిరింది

కార్తీక దీపం సీరియల్

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ మ‌రింత ఉత్కంఠ‌గా మారింది. హిమ పుట్టుక గురించి నిజాలను తెలుసుకున్న డాక్ట‌ర్ బాబు(Doctor Babu).. వాట‌న్నింటిని చెబుతూ సౌంద‌ర్య‌, దీప‌, ఆనంద‌రావుల‌ను నిల‌దీస్తాడు.

  • Share this:
    Karthika Deepam Serial: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునే కార్తీక దీపం సీరియ‌ల్ మ‌రింత ఉత్కంఠ‌గా మారింది. హిమ పుట్టుక గురించి నిజాలను తెలుసుకున్న డాక్ట‌ర్ బాబు.. వాట‌న్నింటిని చెబుతూ సౌంద‌ర్య‌, దీప‌, ఆనంద‌రావుల‌ను నిల‌దీస్తాడు. ఈ ఇంట్లో త‌న‌ను అంద‌రూ మోసం చేశార‌ని, ఇక‌పై ఇక్క‌డ ఉండ‌బోన‌ని బ‌య‌ట‌కు వెళ్లేందుకు నిర్ణ‌యం తీసుకుంటాడు. అలా బ‌య‌ట‌కు వెళ్తుండ‌గా.. హిమ‌, సౌర్య రావ‌డంతో.. హిమ‌ను చూసి ఆగిపోతాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబు ద‌గ్గ‌ర‌కు వెళ్లిన హిమ ఏడుస్తూ.. ఎక్క‌డికి వెళ్తున్నావు డాడీ అని అడుగుతుంది. నేను పోతే ఏంటి.. ఇప్పుడు నీకు అంద‌రినీ ఇచ్చి వెళ్తున్నాను. మీ నాన‌మ్మ‌, తాత‌య్య‌, పిన్ని, బాబాయ్, మీ అక్క‌, మీ ఇంకో తాత‌య్య, మీ అమ్మ‌మ్మ, మీ అమ్మ అంటూ చెప్తాడు. వంట‌లక్క మా అమ్మ‌నా.. అని హిమ అంటుండ‌గా.. అక్క‌డ మీ అమ్మ అన్న విష‌యం నీకు తెలుస‌ని నాకు తెలుసు అని చెబుతాడు. కానీ ఈ విష‌యం నువ్వు కూడా నా ద‌గ్గ‌ర దాచావు అని అని కార్తీక్ అంటాడు.

    ఇప్పుడు తెలిసి పోయింది క‌దా డాడీ.. నేను నీకు ఈ విష‌యం చెప్పాల‌నే అనుకున్నా. కానీ అమ్మ‌, నాన‌మ్మ ఆపారు. నీకు అమ్మ అంటే ఇష్టం లేదు క‌దా. అందుకే సౌర్యను చూసిన‌ట్లు న‌న్ను చూసి, నన్ను దూరం పెడతావ‌నే ఉద్దేశ్యంతో వారు చెప్ప‌నివ్వ‌లేదు అని చెబుతోంది. ఆ త‌రువాత అయినా ఈ నిజం నీకు తెలిసిన త‌రువాత నువ్వు న‌న్ను అక్క‌డి నుంచి తీసుకొచ్చావు క‌దా డాడీ. ఇప్పుడు అంద‌రం క‌లిసి ఇక్క‌డే ఉందాం అని హిమ అంటుంది. అయితే మీరంతా ఒక‌టే. నేను వేరు. నేను ఒక్క‌డినే వేరు. నాకు ఎవ‌రు లేరు. అందుకే వెళ్లిపోతాను అంటూ కార్తీక్ చెప్తాడు.

    డాడీ ఎక్క‌డికి వెళ్ల‌కు డాడీ. నువ్వు న‌న్ను చూడ‌కుండా ఉండ‌లేవు. నేను కూడా ఉండ‌లేను. అప్పుడు నన్ను చూడ‌లేక ఉండ‌లేక‌నే క‌దా నువ్వు మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చావు. నేను, సూర్య నీ కూతుర్ల‌మే క‌దా. అంద‌రం క‌లిసి ఉండ‌చ్చు క‌దా డాడీ అంటూ ఏడుస్తుంది..? అయితే నీ ప్ర‌శ్న‌ల‌కు నేను స‌మాధానం చెప్ప‌లేను. నేనే ఇప్పుడు ఓ ప్ర‌శ్నను అంటూ చెప్పి బ‌య‌ట‌కు వెళ్తుంటాడు. నాన‌మ్మ మీరైనా చెప్పండి. డాడీని ఆగ‌మ‌ని చెప్పండి అని హిమ ఏడుస్తుంది.

    వెంట‌నే దీప‌.. డాక్ట‌ర్ బాబు ఆగండి అని అంటుంది. ఇది మీ కుటుంబం. మీ ఆస్తి. మీ వాళ్లతో మీరు ఉండండి. నేను రావ‌డం వ‌ల‌న మీరు వెళ్లడం త‌ప్ప‌దు అనుకుంటే నేనే వెళ్లిపోతాను అంటూ దీప చెబుతుంది. నా పిల్ల‌ల‌ను తీసుకొని నేనే వెళ్తాను. మీలో సంఘ‌ర్ష‌ణ మొద‌లైంది. క‌న్న ప్రేమ‌, పెంచిన ప్రేమ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌కే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు. దీని వ‌ల‌న మీరు బాధ‌ప‌డుతున్నారు. ఈ పాపం నాకు వ‌ద్దు. అంద‌రూ న‌న్ను క్ష‌మించండి. కానీ న‌న్ను అంద‌రూ ఆశీర్వ‌దించి పంపండి. నా దుర‌దృష్టం నాతోనే పోనివ్వండి అని చెబుతుంది. పెంచిన ప్రేమ గొప్ప‌ది అయితే మీరు హిమ కోసం వ‌స్తారు. క‌న్న ప్రేమ గొప్ప‌ది అయితే హిమ నాతోనే ఉంటుంది. మీతో రాదు అని చెప్పి పిల్ల‌ల‌తో అక్క‌డ నుంచి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతుంది.

    ఇక హిమ‌.. డాడీ నువ్వు నా కోసం క‌చ్చితంగా వ‌స్తావ‌ని నాకు తెలుసు. నువ్వు దూరం వెళ్ల‌కు డాడీ. అప్పుడు నా ద‌గ్గ‌ర‌కు రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. నువ్వు వ‌స్తావ‌ని ఎదురుచూస్తుంటాను అని చెబుతుంది. ఈ క్ర‌మంలో ఆ ముగ్గురు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్తుంటారు. ఆ స‌మ‌యంలో హిమ‌, కార్తీక్ ఒక‌రినొక‌రు చూసుకుంటారు. వాళ్లు వెళ్లిన త‌రువాత ఆనంద‌రావు, సౌంద‌ర్య‌లు బ‌య‌ట ఉండ‌గా.. వారి వ‌ద్ద‌కు వెళ్లే ఆదిత్య‌.. ఆ ఇద్ద‌రిపై త‌న ఆవేద‌న‌ను వ్య‌క్త‌ప‌రిచాడు. ఎందుకు మ‌మ్మీ ఇలా చేశావు. నీ వ‌ల‌న ఇప్పుడు ఎవ‌రికీ న్యాయం జ‌రిగింది. వ‌దిన ఇద్ద‌రు పిల్ల‌ల‌తో వెళ్లిపోయింది. ఇప్పుడు అన్నయ్య ఎంత బాధ‌ప‌డుతున్నాడో చూడు అంటూ త‌న బాధ‌ను క‌క్కేస్తాడు. వెంట‌నే ఆనంద‌రావు ఇప్ప‌టికే స‌గం చ‌చ్చిపోయాము. మ‌ళ్లీ చంప‌కు రా అంటాడు.

    ఇక రేప‌టి ఎపిసోడ్‌లో త‌మ పెళ్లి చేసిన పూజారి దగ్గ‌ర‌కు వెళ్లిన దీప‌.. ఎందుకు స్వామి ఇలా జ‌రుగుతుంది. మా పెళ్లి కూడా మీరే చేశారు. నేను ప‌డ్డ క‌ష్టాలు మీకు తెలుసు. ఆత్మ‌గౌర‌వంతో ఉండ‌టం త‌ప్పా.? అంటూ ప్ర‌శ్నిస్తుంది. ఆత్మ‌గౌర‌వానికి, అహంకారానికి తేడా ఉంటుంది అమ్మ‌. ముందు డాక్ట‌ర్ బాబుకు నీ మీద మొద‌లైన అనుమానాన్ని పోగొట్టుకునేందుకు ప్ర‌య‌త్నించూ. నిన్ను క‌లిసేందుకు డాక్ట‌ర్ బాబు ప్ర‌య‌త్నిస్తాడు అని చెప్తాడు. దీంతో కార్తీక దీపం సీరియల్ మరింత ఆసక్తిగా మారనుంది.
    Published by:Manjula S
    First published: