Karthika Deepam Serial: తెలుగు బుల్లితెరపై టాప్ 1 సీరియల్‌గా కొనసాగుతోంది కార్తీక దీపం. ఎన్ని కొత్త సీరియల్స్ వచ్చినా ఈ సీరియల్ రేటింగ్‌ని బ్రేక్ చేయలేకపోతున్నాయంటేనే ఈ సీరియల్ క్రేజ్‌ని అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులే కాదు సెలబ్రిటీల ఇళ్లలో సైతం ఈ సీరియల్‌కి అభిమానులు ఉన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ రాత్రి గం.7.30 ని.లు అయ్యిందంటే దాదాపుగా అందరి ఇళ్లలో కార్తీక దీపం వెలుగుతూ ఉంటుంది. ఇక ఇంతటి క్రేజ్ ఉన్న ఈ సీరియల్ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. తన మీద పడ్డ నిందను చెరుపుకునేందుకు దీప ప్రయత్నిస్తుండగా.. దీప ప్రయత్నాలను నమ్మకుండా మోనిత కుట్రలు చేస్తోంది. దీంతో ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో తాను ఎవరు చెప్పినా నమ్మను అని కార్తీక్ గట్టిగా చెబుతాడు. దీంతో దీపలో ఉన్న ఆశ మరింత నీరు గారనుంది.
ఇక ప్రస్తుత పరిస్థితుల్లో దీప తన మీద పడ్డను నిరూపించుకోడానికే ఉన్న ఒక మార్గం తులసి. అయితే అమెరికాలో ఉన్న విహారి కోసం ఇటీవల తులసి అక్కడికి వెళ్లిపోతుంది. దీంతో ఇప్పుడు తులసి కోసం దీప అమెరికా వెళ్లనుందన్న టాక్ వినిపిస్తుంది. కార్తీక దీపం మాతృక సీరియల్ కారుతి ముత్తులో కూడా దీప పాత్ర అమెరికా వెళ్లనుండగా.. ఇప్పుడు అలాగే దీప అక్కడకు వెళ్లనుందా..? అని అభిమానుల్లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే పిల్లలు ఉండటంతో దీప అక్కడికి వెళ్లే అవకాశం లేదని కొందరు అంటున్నారు.
దీప పరిస్థితిని తెలుసుకున్న విహారి, తులసి ఇద్దరు ఇక్కడకు రానున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సీరియల్‌ని డైరెక్టర్ ఇంకా ఎన్ని మలుపులు తిప్పబోతున్నాడు.. కార్తీక్, దీప ఇప్పట్లో కలవరా.. తాను ఏం తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు ఉన్న అవకాశాలన్నీ ఇప్పటికే దీపకు నిరాశను తెప్పించగా.. ఇకపై సీరియల్‌ని ఎలా నడపబోతున్నారు అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు సీరియల్‌ని చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.