కార్తీక దీపం దీప వంటలక్కకు మళ్లీ పెళ్లి...డాక్టర్ బాబుతో కాదంట..ఊహించని ట్విస్ట్

దీప అలియాస్ వంటలక్క కష్టాలు తీరబోతున్నాయని సీరియల్ ఫాలోయర్స్ అవుతున్నవారందరూ భావిస్తున్నాయి. ప్రస్తుతం సీరియల్‌లో దీప, డాక్టర్ బాబు ఇద్దరూ మరో సారి పెళ్లికి సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.

news18-telugu
Updated: November 27, 2019, 3:08 PM IST
కార్తీక దీపం దీప వంటలక్కకు మళ్లీ పెళ్లి...డాక్టర్ బాబుతో కాదంట..ఊహించని ట్విస్ట్
కార్తీక దీపం (Image: hotstar)
  • Share this:
తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పవచ్చు. ఈ సీరియల్ దెబ్బతో మిగితా చానెల్స్ వారికి పోటీ పెరిగిందంటే అతిశయోక్తి కాదు. సినిమా హీరోలను మించి అభిమానం ఈ సీరియల్ కేరక్టర్లకు ఉంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కార్తీకదీపం సీరియల్‌ను పురుషుల్లో సైతం పెద్ద ఎత్తున అభిమానులున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ సీరియల్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రపంచ కప్ లాంటి ఈవెంట్లను సైతం పక్కన పెట్టేసి మహిళా ప్రేక్షకులు ఇంట్లో టీవీ రిమోట్ కంట్రోళ్లను దాచేసి మరీ సీరియల్ ఫాలో అవుతుంటారు. మరి ఇంతలా ఆకట్టుకున్న ఈ సీరియల్‌కు అంత పేరు తెచ్చింది మాత్రం దీప అలియాస్ వంటలక్క కేరక్టర్ అనే చెప్పవచ్చు. దీప, కార్తీక్ మధ్య ఉన్న దాంపత్య బంధమే ఈ సీరియల్ సక్సెస్ అని చెబుతుంటారు.

ఇదిలా ఉంటే ఈ సీరియల్ ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది. దీప అలియాస్ వంటలక్క కష్టాలు తీరబోతున్నాయని సీరియల్ ఫాలోయర్స్ అవుతున్నవారందరూ భావిస్తున్నాయి. ప్రస్తుతం సీరియల్‌లో దీప, డాక్టర్ బాబు ఇద్దరూ మరో సారి పెళ్లికి సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందని, ఇద్దరూ మళ్లీ విడిపోయే చాన్స్ ఉందని, దీప గతం మర్చిపోయి వేరే వ్యక్తికి దగ్గరై పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతుందని, ఆ ట్విస్ట్ తో ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. అదే కనుక జరిగితే సీరియల్ మరో నాలుగేళ్లు సాగదీసే అవకాశం ఉందని టాక్ వనిపిస్తుంది.
Published by: Krishna Adithya
First published: November 27, 2019, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading