Home /News /movies /

Karthika deepam: తెలుగు రాష్ట్రాల్లో కన్నీటి సునామీ...వంటలక్క కూతురు సౌర్య ప్రశ్నలకు డాక్టర్ బాబు షాక్...

Karthika deepam: తెలుగు రాష్ట్రాల్లో కన్నీటి సునామీ...వంటలక్క కూతురు సౌర్య ప్రశ్నలకు డాక్టర్ బాబు షాక్...

Image : Star Maa

Image : Star Maa

డాక్టర్ బాబు దగ్గర పెరుగుతున్న హిమ కూడా వంటలక్కను తన తల్లిగా తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇప్పటికే అత్తగారు సౌందర్య కూడా సౌర్యతో తన తండ్రి డాక్టర్ బాబే అని చెప్పేసింది. అటు వంటలక్క కూడా విడాకుల సమయం దగ్గర పడుతుండటంతో టెన్షన్ టెన్షన్ గా ఉంది.

ఇంకా చదవండి ...
    తెలుగు రాష్ట్రాల్లో ఊహించని ప్రేక్షకాదరణతో దూసుకెళ్తున్న టీవీ సీరియల్ కార్తీక దీపంలో ట్విస్టుల మీద ట్విస్టులతో దూసుకెళ్తుంది. అయితే ఇప్పటికే డాక్టర్ బాబు మనస్సును మార్చేందుకు పిల్లలు ఇద్దరూ కలిసి వేస్తున్న ప్లాన్స్ సక్సెస్ అవుతున్నాయి. అయితే ఇందులో భాగంగా వంటలక్క దగ్గర పెరుగుతున్న సౌర్య అయితే తన తండ్రి డాక్టర్ బాబే అని తెలుసుకొని మరీ తన స్కెచ్చులతో అదరగొడుతోంది. అటు డాక్టర్ బాబు దగ్గర పెరుగుతున్న హిమ కూడా వంటలక్కను తన తల్లిగా తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇప్పటికే అత్తగారు సౌందర్య కూడా సౌర్యతో తన తండ్రి డాక్టర్ బాబే అని చెప్పేసింది. అటు వంటలక్క కూడా విడాకుల సమయం దగ్గర పడుతుండటంతో టెన్షన్ టెన్షన్ గా ఉంది.

    ఇదిలా ఉంటే..కార్తీకదీపం సీరియల్ దెబ్బకు బుల్లితెరపై రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. తెలుగులో టీవీప్రోగ్రామ్స్ కు సంబంధించిన తాజా రేటింగ్స్‌లో ఈ వారం కూడా కార్తీక దీపమే టాప్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో వదినమ్మ నిలిచింది. బార్క్ ఇండియా విడుదల చేసిన ఈ రేటింగ్స్‌లో వరుసగా కార్తీక దీపం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే కార్తీక దీపం ఆదరణతో అటు స్టార్ మా చానెల్ అయితే తన మాతృసంస్థ అయిన స్టార్ ప్లస్ ను సైతం రేటింగ్స్‌లో దాటేసింది. స్టార్‌మా టాప్‌లో నిలిచేందుకు వంటలక్క ఆదరణే కారణమని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు సీరియల్స్‌లో విశేష ఆదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం, అయితే ఈ సీరియల్ లో దీప కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు.

    కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. అయితే దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించేలా నటించింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Karthika deepam, Telugu tv serials, Vantalakka, Vantalakka deepa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు