Home /News /movies /

Karthika Deepam: వంటలక్క వేసిన బిస్కెట్‌కు డాక్టర్ బాబు ఫిదా...షాక్‌లో మోనిత...

Karthika Deepam: వంటలక్క వేసిన బిస్కెట్‌కు డాక్టర్ బాబు ఫిదా...షాక్‌లో మోనిత...

(Image: Hotstar)

(Image: Hotstar)

తాజా ఎపిసోడ్ లో వంటలక్క, డాక్టర్ బాబు , పిల్లలు కలిసి పోతున్నట్లు సాగుతోంది. అయితే ఈ విషయం మోనితకు తెలుస్తుందని, దీంతో మోనితకు మెంటలెక్కిపోతోంది.

    కార్తీక దీపం సీరియల్ తెలుగులో అత్యంత ప్రజాదరణతో దూసుకుళ్తోంది. మొత్తం 700 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది. అయితే ఈ దశలోనే సీరియల్‌లో మొదటి సీజన్ ముగింపునకు వచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కథలో ఇఫ్పటికే కార్తీక్, దీపలను కలిపేందుకు కవల పిల్లలు సౌర్య, హిమ తీవ్రంగా ప్రయత్నం చేయడం, ఆ దిశగానే కథ ముందుకు కదలడం, దీప, కార్తీక్ ల మధ్య అపోహలు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి. తాజా ఎపిసోడ్ లో వంటలక్క, డాక్టర్ బాబు , పిల్లలు కలిసి పోతున్నట్లు సాగుతోంది. అయితే ఈ విషయం మోనితకు తెలుస్తుందని, దీంతో మోనితకు మెంటలెక్కిపోతోంది. మరోవైపు పిల్లలు ఇద్దరు తమ తల్లితండ్రులను కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న నేపథ్యంలో వంటలక్క ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారట.

    ఇప్పటికే తెలుగు టెలివిజన్ రేటింగ్స్ లో అత్యధిక పాయింట్లు సాధించిన కార్తీక దీపం బుల్లితెరపై ఓ సంచలనం అనే చెప్పవచ్చు. ఈ సీరియల్ ప్రస్తుతం మొదటి సీజన్ పూర్తి అవ్వనుందనే టాక్ వినిపిస్తోంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Hotstar, Karthika deepam, Vantalakka, Vantalakka deepa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు