Karthika Deepam: నిజ జీవితంలో కార్తీక దీపం సౌందర్య, కార్తీక్ మధ్య వయసు బేధం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

పరిటాల నిరుపమ్ అర్చనా అనంత్

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటూ నంబ‌ర్ 1 సీరియ‌ల్‌గా కొన‌సాగుతోంది కార్తీక దీపం. ఈ సీరియ‌ల్‌లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న కార్తీక్(పరిటాల నిరుప‌మ్), దీప‌(ప్రేమి విశ్వ‌నాథ్), సౌంద‌ర్య‌(అర్చ‌నా అనంత్), మౌనిత‌(శోభా శెట్టి)ల‌కు బ‌య‌ట మంచి క్రేజ్ ఉంది. త‌మ న‌ట‌న‌తో వీరు ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

  • Share this:
    Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటూ నంబ‌ర్ 1 సీరియ‌ల్‌గా కొన‌సాగుతోంది కార్తీక దీపం. ఈ సీరియ‌ల్‌లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న కార్తీక్(పరిటాల నిరుప‌మ్), దీప‌(ప్రేమి విశ్వ‌నాథ్), సౌంద‌ర్య‌(అర్చ‌నా అనంత్), మౌనిత‌(శోభా శెట్టి)ల‌కు బ‌య‌ట మంచి క్రేజ్ ఉంది. త‌మ న‌ట‌న‌తో వీరు ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. కాగా ఈ సీరియ‌ల్‌లో నిరుప‌మ్‌కి అమ్మ పాత్ర‌లో న‌టిస్తున్నారు అర్చ‌నా అనంత్. అటు కొడుకుపై ప్రేమ‌ను చూపుతూ.. ఇటు కోడ‌లికి మ‌ద్ద‌తుగా ఉండే సౌంద‌ర్య పాత్ర‌లో అర్చ‌నా జీవించేస్తున్నారు. అంతేకాదు బుల్లితెర‌పై అంద‌మైన అత్త‌గా పేరును సంపాదించుకున్నారు. కాగా ఇందులో తల్లీ కొడుకులుగా న‌టిస్తున్న‌ప్ప‌టికీ.. నిజ జీవితంలో నిరుప‌మ్, సౌంద‌ర్య మధ్య వ‌య‌సులో వ్య‌త్యాసం ఎంతో తెలుసా..!

    అర్చ‌నా అనంత్ క‌ర్ణాట‌క‌లో పుట్టి పెరిగారు. సీరియ‌ళ్ల‌లోకి రాక‌ముందు బ్యూటీషియ‌న్‌గా ప‌నిచేసిన అర్చ‌నా.. ఒక బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రికి ఒక బాబు కూడా ఉన్నాడు. కాగా 1988 జ‌న‌వ‌రి 3న‌ జ‌న్మించిన అర్చ‌నా వ‌య‌స్సు ప్ర‌స్తుతం 33 ఏళ్లు.

    ఇక టాలీవుడ్‌ల నిర్మాత ఓంకార్ కుమారుడైన ప‌రిటాల నిరుప‌మ్ కూడా 1988లో జ‌న్మించారు. ఫిబ్ర‌వ‌రి 15న నిరుప‌మ్ జ‌న్మించారు. త‌న స‌హ న‌టి మంజుల‌ను నిరుప‌మ్ వివాహం చేసుకోగా.. వీరిద్ద‌రికి ఒక బాబు ఉన్నాడు.

    అయితే కార్తీక దీపం సీరియ‌ల్‌లో తల్లీకొడుకులుగా న‌టిస్తున్న‌ప్ప‌టికీ.. నిజ జీవితంలో కార్తీక్, సౌంద‌ర్య‌ల మ‌ధ్య వ‌య‌సు వ్యత్యాసం 43 రోజులు మాత్ర‌మే. అయిన‌ప్ప‌టికీ.. వ‌య‌సు మించిన పాత్ర‌లో కార్తీక్‌కి త‌ల్లిగా సౌంద‌ర్య అద‌ర‌గొట్టేస్తున్నారు. కాగా ఇన్ని రోజులు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన అర్చ‌నా.. ఇప్పుడు వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు సిద్ధ‌మవుతున్నారు. అన‌సూయ న‌టించిన థ్యాంక్యు బ్ర‌ద‌ర్‌లో అర్చ‌నా కీల‌క పాత్ర‌లో క‌నిపించనున్నారు.
    Published by:Manjula S
    First published: