news18-telugu
Updated: July 21, 2020, 9:15 PM IST
కార్తీక దీపం (Image: hotstar)
సోషల్ మీడియాలో వంటలక్కు కరోనా అంటూ వస్తున్న వార్తలతో ఎట్టకేలకు వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ క్లారిటీ ఇచ్చేసింది. తనకు ఎలాంటి కరోనా వైరస్ సోకలేదని తన స్వస్థలమైన కేరళ నుంచి వీడియో ద్వారా తెలిపింది. సోషల్ మీడియాలో తనపై కొందరు కావాలనే పుకార్లు లేపారంటూ వంటలక్క దీప ఫైర్ అయ్యింది. అంతేకాదు తనపై ఇలాంటి ప్రచారం చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని బాధపడింది. తాను ఫుల్ సేఫ్ గా ఉన్నానని, అంతేకాదు ఎంచక్కా ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.

కార్తీక దీపం వంటలక్క ప్రేమి విశ్వనాథ్ (Hot Star/Photo)
అయితే ప్రేమి విశ్వనాథ్ ఇటీవల యూట్యూబ్ చానెల్ ద్వారా తన అప్ డేట్స్ ఎప్పటి కప్పుడు పోస్ట్ చేస్తోంది. తద్వారా తనపై వస్తున్న పుకార్లకు తానే సమాధానం చెబుతూ ఫ్యాన్స్ సందేహాలను తీరుస్తోంది. అయితే ఈ నెల 1వ తారీఖు నుంచి 7 వతారీఖు వరకు జరిగిన కార్తీక దీపం షూటింగ్లో పాల్గొని తరువాత తిరిగి తన స్వస్థలం కేరళకు వెళ్లిపోయింది. తాను ఇంటికి వెళ్లిపోతున్నట్టుగా కూడా ఓ వీడియోను తన సొంత యూట్యూబ్ చానల్లో షేర్ చేసింది. వంటలక్క ఇంటికే వెళుతూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో బై చెపుతున్నట్టుగా వీడియో పోస్ట్ చేసింది. అయితే ఆమె పీపీఈ కిట్లో కనిపించటంతో కొందరు ప్రేమి విశ్వనాథ్ కు కరోనా సోకిందంటూ ప్రచారం మొదలు పెట్టారు.
దీనిపై వంటలక్క యూట్యూబ్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రేమి విశ్వనాథ్ వీడియోకు డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ నిరుపమ్ స్పందిస్తూ. ఇలా ఒక ఆర్టిస్టుపై పుకార్లు సృష్టించడం మంచిది కాదని హితవు పలికారు. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులు బాధపడేలా ఇలాంటి వార్తలు ప్రసారం చేయడం పట్ల డాక్టర్ బాబు సీరియస్ అయ్యారు. ఇక టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ సీరియల్ కార్తీక దీపం రేటింగ్స్ లో మాత్రం మరోసారి టాప్ లో నిలిచింది.
Published by:
Krishna Adithya
First published:
July 21, 2020, 9:15 PM IST