కార్తీకదీపం. ఈ సీరియల్ పేరు తెలియని టీవీ ప్రేక్షకులు ఉండరు. దేశవ్యాప్తంతా పెద్ద పెద్ద స్టార్స్ ప్రోగ్రామ్స్‌ను ఢీకొట్టి రేటింగ్స్ సాధించింది. ఆ సీరియల్లో దీపక్కకు భారీ ఎత్తున ఫ్యాన్స్, కటౌట్లు కూడా పెట్టారు. అయితే, అలాంటి సీరియల్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని సినిమా, సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రభావం సీరియల్స్ మీద పడింది. రేపు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠగా ఎదురుచూసే సీరియల్ ప్రేక్షకులకు ఇది చాలా ఇబ్బందికర పరిణామం. ఇలాంటి క్రమంలో కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకుల కోసం రీ టెలికాస్ట్ చేస్తున్నారు. అంటే మొదటి నుంచి కార్తీకదీపం సీరియల్‌ను ప్రసారం చేస్తున్నారు. అసలు డాక్టర్ బాబుకి, వంటలక్కకి మధ్య పరిచయం ఎలా కలిగింది? వారిద్దరూ ఎలా కలిశారు? ఎలా విడిపోయారు? అసలు గతంలో ఏం జరిగిందని తెలుసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. వారంతా టీవీ సీరియల్ చూసి తెలుసుకోవచ్చు. వారి పరిచయం, ప్రేమ, పెళ్లి, విడిపోవడం అన్నీ తెలుసుకోవచ్చు. అయితే, అది లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందనేదాని మీద ఆధారపడి ఉంటుంది. లాక్ డౌన్ కాలంలో, బ్యాకప్‌గా ఉంచిన ఎపిసోడ్స్ అన్నీ అయిపోయాయి. దీంతో ఫ్రెష్ గా షూట్ చేసి, ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేయడానికి, లాక్ డౌన్ తర్వాత కనీసం రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆపాత మధురాలను చూడొచ్చు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.