హోమ్ /వార్తలు /సినిమా /

Premi Viswanath: వంట‌ల‌క్క ప్రేమి విశ్వ‌నాథ్‌కి నిజ జీవితంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా..!

Premi Viswanath: వంట‌ల‌క్క ప్రేమి విశ్వ‌నాథ్‌కి నిజ జీవితంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా..!

ఏంటి.. కార్తీక దీపం సీరియల్ వంటలక్క చేయదా.. చేయకూడదు అనుకుందా..? ఇదెప్పుడు జరిగింది..? అసలు వంటలక్క లేని సీరియల్ ఎలా ఉంటుంది.. ఎలా చూడగలరు ప్రేక్షకులు అనుకుంటున్నారా..?

ఏంటి.. కార్తీక దీపం సీరియల్ వంటలక్క చేయదా.. చేయకూడదు అనుకుందా..? ఇదెప్పుడు జరిగింది..? అసలు వంటలక్క లేని సీరియల్ ఎలా ఉంటుంది.. ఎలా చూడగలరు ప్రేక్షకులు అనుకుంటున్నారా..?

కార్తీక దీపం సీరియ‌ల్ ద్వారా తెలుగు వారికి చాలా ద‌గ్గ‌ర‌య్యారు మ‌ల‌యాళ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్(Premi Viswanath). ఆ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌గా ప్రేమి న‌ట‌న అంద‌రినీ మెప్పిస్తోంది. ఇంకా చెప్పాలంటే కార్తీక దీపం సీరియ‌ల్‌కి అంత క్రేజ్ రావ‌డానికి ముఖ్య కార‌ణాల‌లో ప్రేమి విశ్వ‌నాథ్ ఒక‌రు

ఇంకా చదవండి ...

  Premi Viswanath: కార్తీక దీపం సీరియ‌ల్ ద్వారా తెలుగు వారికి చాలా ద‌గ్గ‌ర‌య్యారు మ‌ల‌యాళ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్. ఆ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌గా ప్రేమి న‌ట‌న అంద‌రినీ మెప్పిస్తోంది. ఇంకా చెప్పాలంటే కార్తీక దీపం సీరియ‌ల్‌కి అంత క్రేజ్ రావ‌డానికి ముఖ్య కార‌ణాల‌లో ప్రేమి విశ్వ‌నాథ్ ఒక‌రు. ప్ర‌స్తుతం ఈ సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. దీప పిల్లలు హిమ‌, సౌర్య చుట్టూ సాగుతున్న ఈ సీరియ‌ల్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. వారి భ‌విష్య‌త్ కోసం త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకునే పనిలో దీప ప‌డింది. కాగా ఈ సీరియ‌ల్‌లో పిల్ల‌ల‌ను త‌న ప్రాణంగా చూసుకునే వంట‌ల‌క్కకు నిజజీవితంలో ఎంత‌మంది పిల్ల‌లు ఉన్నారో తెలుసా..? షూటింగ్‌ల‌తో ఎప్పుడూ బిజీగా ఉండే దీప‌.. త‌న పిల్ల‌ల‌కు ఎప్పుడు స‌మ‌యం కేటాయిస్తుంది..? ఈ విష‌యాల‌పై ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది.

  ప్ర‌ముఖ ఆస్ట్రాలజర్ వినీత్ భ‌ట్‌ని వివాహం చేసుకున్న ప్రేమి విశ్వ‌నాథ్‌కి నిజ జీవితంలో ఓ బాబు ఉన్నాడు. ఈ విష‌యాన్ని ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఆ బాబు ప్ర‌స్తుతం త‌న త‌ల్లి ద‌గ్గ‌ర ఉంటున్నాడ‌ని.. వాడి ఆల‌నాపాల‌నా త‌న అమ్మ‌నే చూసుకుంటుంద‌ని ప్రేమి తెలిపింది. అయితే ఇక్క‌డ షూటింగ్‌లతో మీరు మీ పిల్లాడిని మిస్ అవ్వ‌గా అన్న ప్ర‌శ్న‌కు.. అలాంటిదేమీ లేదు. అమ్మ ద‌గ్గ‌రే ఉన్నాడు క‌దా. అయినా వీడియో కాల్స్ కూడా ఉన్నాయి కాబ‌ట్టి మిస్ అవుతున్న‌ట్లు అనిపించిదు. ఫ్యామిలీ కోసం ఒక వారం హైద‌రాబాద్‌లో షూటింగ్‌లు జ‌రుపుకొని మ‌రోవారం కేర‌ళ‌లో గ‌డుపుతుంటాను అని ప్రేమి తెలిపింది. ఇక త‌న భ‌ర్త త‌రుచుగా ఇంట్లో ఉండ‌ర‌ని, టూర్ల‌కు వెళుతుంటాడ‌ని ప్రేమి వివ‌రించింది.


  కాగా ప్ర‌స్తుతం తెలుగులో కార్తీక దీపం సీరియ‌ల్‌లో న‌టిస్తోన్న ప్రేమి.. త్వ‌ర‌లో వెండితెర‌పైనా క‌నిపించ‌నుంది. తెలుగులో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పింది ప్రేమి. అందులో పోలీస్‌గా న‌టించ‌నుంది వంట‌ల‌క్క‌. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Premi Viswanath, Vantalakka deepa

  ఉత్తమ కథలు