Home /News /movies /

KARTHIKA DEEPAM MAY END LIKE THIS HERE IS FULL DETAILS OF SERIAL ENDING MNJ

karthika Deepam: కార్తీక దీపం క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుందంటే

కార్తీక దీపం

కార్తీక దీపం

karthika Deepam: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎక్కువ‌గా ఆక్ట‌టుకునే సీరియ‌ళ్ల‌లో టాప్ 1లో ఉంది కార్తీక దీపం. గ‌త కొన్నేళ్లుగా బుల్లితెర రేటింగ్‌లో టాప్‌లో న‌డుస్తోంది ఈ సీరియ‌ల్‌. పెద్ద పెద్ద హీరోల సినిమాలు, ఐపీఎల్ మ్యాచ్‌లు పైతం ఈ సీరియ‌ల్ వ‌చ్చే స‌మ‌యంలో రేటింగ్‌ని కోల్పోతూ ఉంటాయి. ఇక ఈ సీరియ‌ల్‌లో న‌టించడం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రేమి విశ్వ‌నాథ్, నిరుప‌మ్ ప‌రిటాల‌, అర్చ‌నా అనంత్, శోభా శెట్టి, బేబి కృతిక‌, బేబి స‌హృద త‌దిత‌రులు

ఇంకా చదవండి ...
    karthika Deepam: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎక్కువ‌గా ఆక్ట‌టుకునే సీరియ‌ళ్ల‌లో టాప్ 1లో ఉంది కార్తీక దీపం. గ‌త కొన్నేళ్లుగా బుల్లితెర రేటింగ్‌లో టాప్‌లో న‌డుస్తోంది ఈ సీరియ‌ల్‌. పెద్ద పెద్ద హీరోల సినిమాలు, ఐపీఎల్ మ్యాచ్‌లు పైతం ఈ సీరియ‌ల్ వ‌చ్చే స‌మ‌యంలో రేటింగ్‌ని కోల్పోతూ ఉంటాయి. ఇక ఈ సీరియ‌ల్‌లో న‌టించడం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రేమి విశ్వ‌నాథ్, నిరుప‌మ్ ప‌రిటాల‌, అర్చ‌నా అనంత్, శోభా శెట్టి, బేబి కృతిక‌, బేబి స‌హృద త‌దిత‌రులు. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా ఈ సీరియ‌ల్ ఒకే లైన్‌లో న‌డుస్తోంది. అదేంటంటే కార్తీక్, దీప క‌ల‌వ‌డం. సీరియ‌ల్‌లో పెళ్లైన ఆరు నెల‌ల‌కే విడిపోయే వీరు.. ఎప్పుడెప్పుడు క‌లుస్తారా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవ‌ల త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేందుకు దీప ప్ర‌య‌త్నిస్తుండగా.. వారిద్ద‌రు ఇప్ప‌ట్లో క‌ల‌వ‌కుండా ద‌ర్శ‌కుడు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది.

    ఇదిలా ఉంటే ఈ సీరియ‌ల్ ఎలా ఎండ్ అవుతుందని చాలా మందిలో ఆలోచ‌న‌లో ఉంది. ఈ సీరియ‌ల్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. దీప‌, కార్తీక్ క‌లిసినా మ‌రికొన్ని సంవ‌త్స‌రాల పాటు ఈ సీరియ‌ల్ ఉంటుందా.. లేక దీప‌, కార్తీక్ క‌ల‌వ‌గానే సీరియ‌ల్ అయిపోతుందా.. అన్న ప్ర‌శ్న‌లు అంద‌రిలో మెదులుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ సీరియ‌ల్ ఎండింగ్‌పై ఓ క్లారిటీని ఇచ్చాడు డాక్ట‌ర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ నిరుప‌మ్ ప‌రిటాల‌.

    ఈ సీరియ‌ల్ ఎండింగ్ గురించి ఆ మ‌ధ్య‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన నిరుప‌మ్‌.. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే సీరియ‌ల్ ఎండింగ్ ఉండ‌నుందని తెలిపారు. దీప‌, కార్తీక్ క‌లవ‌గానే సీరియ‌ల్ ముగియ‌నుందని.. అలా కాకుండా ఇంకోలా ఎండింగ్ పెడితే ఇంటికి వ‌చ్చి కొట్టేలా అభిమానులు ఉన్నార‌ని అన్నారు. ఇక పిల్ల‌లు పెర‌గ‌డం, మ‌ళ్లీ వాళ్ల పెళ్లిళ్లు ఇలాంటివి ఏవీ ఉండ‌వ‌ని నిరుప‌మ్ స్ప‌ష్టం చేశారు. చూడాలి మ‌రి దీప‌, కార్తీక్‌లు ఎప్పుడు క‌లుస్తారో.. కార్తీక దీపం మ‌ళ్లీ ఎప్పుడు వెలిగిస్తారో.. వంట‌ల‌క్క అభిమానులు ఎప్పుడు పండుగ చేసుకుంటారో.
    Published by:Manjula S
    First published:

    Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు