హోమ్ /వార్తలు /సినిమా /

అభిమానుల కోసం కార్తీక దీపం సీరియల్ వంటలక్క సంచలన నిర్ణయం...

అభిమానుల కోసం కార్తీక దీపం సీరియల్ వంటలక్క సంచలన నిర్ణయం...

కార్తీక దీపం దీప (Image : Star maa)

కార్తీక దీపం దీప (Image : Star maa)

కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు.

    తెలుగునాట అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్ కార్తీక దీపం, అయితే ఈ సీరియల్ లో దీప కేరక్టర్ అంటే మహిళలకు బాగా ఇష్టమనే చెప్పవచ్చు. కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు. అయితే దీపగా, వంటలక్కగా ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రేమి విశ్వనాథ్, ప్రతీ మహిళను కదిలించేలా నటించింది. అయితే తాజాగా తన అభిమానుల కోసం ప్రేమి విశ్వనాథ్ ఒక నిర్ణయం తీసుకుంది. తన మాతృభాష మలయాళం అయినప్పటికీ, ఫ్యాన్స్ కోసం తెలుగు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. వీలైతే భవిష్యత్తులో తన డబ్బింగ్ తానే చెప్పేందదుకు సైతం వంటలక్క అలియాస్ దీప సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

    First published:

    Tags: Karthika deepam, Star Maa, Vantalakka deepa

    ఉత్తమ కథలు