హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam Hima: 'కార్తీక దీపం'లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ హిమ‌కు ఆ క‌ష్టాలే

Karthika Deepam Hima: 'కార్తీక దీపం'లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లోనూ హిమ‌కు ఆ క‌ష్టాలే

బేబీ సహృద Instagram

బేబీ సహృద Instagram

కార్తీక దీపం(Karthika Deepam) సీరియ‌ల్ చూసేవారికి అందులో హిమ(Hima) పాత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక్, దీప క‌వ‌ల పిల్ల‌ల్లో చిన్న‌దైన హిమ‌ను పుట్టిన‌ప్పుడే సౌంద‌ర్య దీప నుంచి దూరం చేసి అనాథ‌గా కార్తీక్ ద‌గ్గ‌ర‌కు తీసుకొస్తుంది

ఇంకా చదవండి ...

  Baby Sahruda: కార్తీక దీపం సీరియ‌ల్ చూసేవారికి అందులో హిమ పాత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక్, దీప క‌వ‌ల పిల్ల‌ల్లో చిన్న‌దైన హిమ‌ను పుట్టిన‌ప్పుడే సౌంద‌ర్య దీప నుంచి దూరం చేసి అనాథ‌గా కార్తీక్ ద‌గ్గ‌ర‌కు తీసుకొస్తుంది. కార్తీక్ ద‌గ్గ‌రే హిమ పెర‌గ్గా.. ఆమెను చాలా గారాబంగా పెంచుతాడు కార్తీక్. అయితే హిమ కూడా దీప బిడ్డ అని తెలిసిన కార్తీక్.. ఆలోచ‌న‌లో ఉండ‌గా.. త‌న బిడ్డ‌ను తానే తీసుకుపోతానంటూ దీప, హిమ‌ను తీసుకెళ్తుంది. ప్ర‌స్తుతం హిమ‌, దీప ద‌గ్గ‌రే ఉంటోంది. ఇలా ఈ సీరియ‌ల్‌లో పుట్టిన‌న‌ప్పుడు అమ్మ‌కు దూరంగా.. ఇప్పుడు నాన్న‌కు దూరంగా ఉంటోన్న హిమ‌.. నిజ జీవితంలోనూ అలాంటి క‌ష్టాల‌ను ఎదుర్కొంది. తాజాగా స్టార్ మా విడుద‌ల చేసిన సంక్రాంతి స్పెష‌ల్ ప్రోగ్రామ్‌ ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ ప్రోమోలో హిమ గురించి చూపించారు.

  హిమ అస‌లు పేరు బేబీ స‌హృద కాగా.. చిన్న‌ప్పుడు ఆమె పుట్టిన‌ప్పుడు ఆడ‌పిల్ల పుట్టింద‌ని, వాళ్ల నాన్న చూడ‌టానికి కూడా రాలేద‌ట‌. ఈ విష‌యాన్ని స‌హృద త‌ల్లి చెప్పింది. దాంతో ఆమె భావోద్వేగానికి గురి అవుతుంది. స‌హృద మాత్ర‌మే కాదు అక్కడ ఉన్న అంద‌రూ ఎమోష‌న‌ల్ అవుతారు. ఆ తరువాత యాంకర్ ర‌వి మాట్లాడుతూ.. కూతురు అంటే టెన్ష‌న్ కాదు.. కూతురు అంటే ప‌ది మంది అబ్బాయిల‌తో స‌మానం అని చెబుతాడు.

  View this post on Instagram


  A post shared by STAR MAA (@starmaa)  ఇక ప్రోమోలో ఫ‌ల్గుణి హాట్ డ్యాన్స్‌ని కూడా చూపించారు. అలాగే అరియానా, అవినాష్ రొమాన్స్‌.. అవినాష్‌తో బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్ వ‌ద్దురా సోద‌రా పాట‌కు డ్యాన్స్, సీరియ‌ల్‌లో న‌టించేవారి ఫ్యామిలీల‌ను చూపించారు. ఇక ఈ స్పెష‌ల్ ప్రోగ్రామ్‌కి బిగ్‌బాస్ 4 విన్న‌ర్ అభిజీత్, తల్లితో క‌లిసి రావ‌డం హైలెట్. మొత్తానికి ప్రోమో చూస్తుంటే.. ఈ సంక్రాంతికి బుల్లితెర‌పై ఫుల్ ఫ‌న్ ఉండ‌బోతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial

  ఉత్తమ కథలు