• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • KARTHIKA DEEPAM HERO NIRUPAM PARITALA HELPED NATURAL STAR NANI CAREER LIKE THIS PK

Nani - Nirupam Paritala: డాక్టర్ బాబు సాయంతో స్టార్ హీరోగా ఎదిగిన నాని.. ఆ రోజు అలా చేసుండకపోతే..?

నాని నిరుపమ్ పరిటాల (Nani Nirupam Paritala)

Nani - Nirupam Paritala: ఏంటి.. డాక్టర్ బాబు కారణంగా ఈ రోజు నాని(Nani) స్టార్ హీరో అయ్యారా..? వినడానికి చాలా విచిత్రంగా ఉందే అనుకుంటున్నారు కదా..? ఇప్పుడు కూడా ఇదే జరిగింది మరి. కార్తీక దీపం(Karthika Deepam) హీరో నిరుపమ్(Nirupam) వల్లే నాని ఈ రోజు స్టార్ హీరో అయ్యాడంటే నమ్ముతారా..?

  • Share this:
ఏంటి.. డాక్టర్ బాబు కారణంగా ఈ రోజు నాని స్టార్ హీరో అయ్యారా..? వినడానికి చాలా విచిత్రంగా ఉందే అనుకుంటున్నారు కదా..? అప్పుడప్పుడూ అలాంటి చిత్రమైన నిజాలు తెలుస్తుంటాయి మరి. ఇప్పుడు కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల విషయంలోనూ ఇదే జరిగింది. ఈయన ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రముఖి సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఆ తర్వాత కార్తీక దీపంతో నెంబర్ వన్ అయిపోయాడు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ బాబు అంటే తెలియని వాళ్లు ఉండరు. అంతటి క్రేజ్ సంపాదించుకున్నారు నిరుపమ్. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఈయన కూడా సినిమా హీరో కావాలనే ఇండస్ట్రీకి వచ్చారు. పైగా ఈయన తండ్రి ఓంకార్ కూడా మంచి నటుడు, రచయిత, దర్శకుడు. దాంతో చిన్నప్పటి నుంచి కూడా సినిమాలంటే నిరుపమ్‌కు ఆసక్తి. తాజాగా ఈయన తన భార్య, నటి మంజులతో కలిసి అలీతో సరదాగా షోకు వచ్చాడు. అక్కడ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు నిరుపమ్. అవి విన్న తర్వాత నిజంగానే అంతా షాక్ అయిపోతుంటాం. అసలు విషయం ఏంటంటే.. సరిగ్గా 13 ఏళ్ళ కింద ఈయన్ని ఓ సినిమా కోసం హీరోగా ఎంచుకున్నారు.

ఆడిషన్‌కు కూడా రమ్మని పిలిచారు. కట్ చేస్తే ఆ తర్వాత అసలు ఆడిషన్ కూడా తీసుకోకుండానే ఈయన్ని తప్పించి మరో కొత్త కుర్రాడిని తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఆ కొత్త కుర్రాడే ఇప్పటి మన నాచురల్ స్టార్ నాని. నిరుపమ్‌ను కనీసం ఆడిషన్ కూడా చేయకుండా తప్పించిన సినిమా అష్టా ఛమ్మా. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంతోనే నాని హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న నాని కాస్తా ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు స్టార్ అయ్యాడు.

ఒక్కో సినిమాకు 10 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఈ సినిమాకు ముందు నిరుపమ్‌ను ఆడిషన్ చేయాలనుకున్నాడు ఇంద్రగంటి. పిలిచాడు కూడా.. అయితే అప్పటికే సీరియల్స్ చేస్తుండటంతో ఎందుకో తెలియదు మరి ఆడిషన్ చేయకుండానే పంపించేసారని చెప్పాడు నిరుపమ్. ఒకవేళ ఆ రోజు అన్నీ కుదిరి అష్టా ఛమ్మా ఆడిషన్ జరిగి డాక్టర్ బాబు కానీ అందులో హీరోగా ఎంపికై ఉంటే ఈ రోజు మనం నానిని చూసేవాళ్లమా.. ఒకవేళ చూసినా ఈ స్థాయిలో ఉండేవాడా..? ఏదైనా మొదలైన పాయింట్ మాత్రం అక్కడే కావడం గమనార్హం.
Published by:Praveen Kumar Vadla
First published: