Karthika Deepam Uma Devi: ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ, గొడవలు పడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.
Karthika Deepam Uma Devi: ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ, గొడవలు పడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ మొదటి వారంలో సరియు హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలోనే రెండవ వారం నామినేషన్ల భాగంగా లోబో, ఉమాదేవి, అనీ మాస్టర్, ప్రియాంక, ప్రియా, నటరాజ్ మాస్టర్, కాజల్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే విషయం పై ప్రేక్షకులలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలోనే నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ స్క్రీన్ స్పేస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.
ఇదిలా ఉండగా ఈ వారం హౌస్ నుంచి ఉమాదేవి ఎలిమినేట్ అవుతుందని మొదట్లో భావించినప్పటికీ వారం చివరికి ఆమె పాజిటివ్ ఓటింగ్ పెరగడంతో ఈవారం ఎలిమినేషన్ నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. అందుకు గల కారణం ఈమె నామినేషన్ లిస్టులో ఉన్నప్పటి నుంచి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ టాస్క్ లలో ఎంతో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోంది.
అలాగే సింగిల్ బెడ్ టాస్క్ లో భాగంగా సిరితో అత్త కోడలు టాస్క్ ఎంతో అద్భుతంగా చేసి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచింది. ఈ విధంగా ఈ వారం ఉమాదేవిని బిగ్ బాస్ ఎంతో హైలెట్ చేసి చూపించడంతో ఈమెకు ఓటింగ్ శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమాదేవి ఈవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి:మీరు కరెక్ట్ అవ్వచ్చు కానీ ఈ షోకు మీరు సెట్ కారు.. అర్ధపావు భాగ్యంకు గట్టి షాక్ ఇచ్చిన షన్ను?
ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ చూస్తే నామినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో అత్యధిక ఓటింగ్ చేసుకొని మొదటి స్థానంలో లోబో ఉండగా, తరువాతి స్థానంలో ప్రియాంక, ప్రియా, కాజల్ ఉన్నారు. ఉమాదేవికి పాజిటివ్ ఓట్లు పడటంతో ప్రస్తుతం అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ ఎవరు అవుతారనే విషయంపై ఉత్కంఠత ఉంది. ఇకపోతే వారం మొదట్లో ఎంతో నెగిటివిటీని సంపాదించుకున్న ఉమాదేవి చివరికి అధిక ఓట్లు సంపాదించుకొని సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా కార్తీకదీపం ఫ్యాన్స్ మహిమ అని చెప్పవచ్చు. కార్తీకదీపం సీరియల్ ద్వారా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వారు ఈమెకు మద్దతుగా నిలవడంతో ఈమె ఎలిమినేషన్ నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.