HOME »NEWS »MOVIE »karthika deepam fan comment on premi viswanath latest photo goes viral mnj

Premi Viswanath: మా వంటలక్క తోపు...దమ్ముంటే ఆపు.. సోషల్ మీడియా కార్తీక దీపం ఫ్యాన్స్ రచ్చ

Premi Viswanath: మా వంటలక్క తోపు...దమ్ముంటే ఆపు.. సోషల్ మీడియా కార్తీక దీపం ఫ్యాన్స్ రచ్చ
వంటలక్క ( Photo : Star maa)

తెలుగు బుల్లితెర‌పై కార్తీక దీపం సీరియ‌ల్ ఓ సంచ‌నల‌నం. కొన్ని నెల‌లుగా రేటింగ్‌లో టాప్‌లో కొన‌సాగుతున్న ఈ సీరియ‌ల్‌కి చాలా మంది అభిమానులే ఉన్నారు. సాధార‌ణ ప్రేక్ష‌కులే కాదు ప‌లువురి సెల‌బ్రిటీల ఇళ్ల‌లోనూ రాత్రి 7.30గంట‌ల‌కు కార్తీక దీపం ప్ర‌సారం అవుతూ ఉంటుంది

  • Share this:
    Premi Viswanath- Karthika Deepam:  తెలుగు బుల్లితెర‌పై కార్తీక దీపం సీరియ‌ల్ ఓ సంచ‌నల‌నం. కొన్ని నెల‌లుగా రేటింగ్‌లో టాప్‌లో కొన‌సాగుతున్న ఈ సీరియ‌ల్‌కి చాలా మంది అభిమానులే ఉన్నారు. సాధార‌ణ ప్రేక్ష‌కులే కాదు ప‌లువురి సెల‌బ్రిటీల ఇళ్ల‌లోనూ రాత్రి 7.30గంట‌ల‌కు కార్తీక దీపం ప్ర‌సారం అవుతూ ఉంటుంది. ఇక ఈ సీరియ‌ల్‌లో దీప పాత్ర‌లో న‌టిస్తోన్న మ‌ల‌యాళ కుట్టీ ప్రేమి విశ్వ‌నాథ్.. ఇక్క‌డ ఎంతోమంది అభిమానుల‌కు సంపాదించుకున్నారు. సీరియ‌ల్ మొద‌ట్లో దీప‌గా.. ఆ త‌రువాత వంట‌లక్క‌గా ప్రేమి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. తెలుగులో ఆమె క‌నిపించేది ఈ ఒక్క సీరియ‌ల్ అయిన‌ప్ప‌టికీ.. మిగిలిన అంద‌రి కంటే ఎక్కువ ఫేమ్‌ని సంపాదించుకున్నారు ప్రేమి విశ్వ‌నాథ్. అంతేకాదు స్టార్ హీరో సినిమాలు, రియాలిటీ షోలు కూడా వంట‌ల‌క్క‌తో పోటీ ప‌డ‌లేక‌పోతున్నాయి.

    కాగా వంట‌ల‌క్క పేరిట ప్రేమికి ఇక్క‌డ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అంతేనా వంట‌ల‌క్క పేరు మీద సోష‌ల్ మీడియాలో వ‌చ్చే మీమ్స్‌కి అయితే లెక్క‌లేదు. క‌రోనా, ఐపీఎల్‌, సినిమాలు టాపిక్ ఏదైనా.. వంట‌ల‌క్క‌ను జ‌త చేసి కామెంట్లు క‌నిపిస్తూనే ఉంటాయి. గతేడాది ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యంలో వంట‌ల‌క్క కోసం ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యాన్ని మార్చ‌మ‌ని ఓ అభిమాని పెట్టిన కామెంట్ బాగా వైర‌ల్‌గా మారింది. అంతేనా.. ఈ మ‌ధ్య‌న విడుద‌లైన ఉప్పెన టీజ‌ర్‌కి వంట‌ల‌క్క మీద ఒట్టు. ఈ సినిమా సూప‌ర్ హిట్టు అంటూ ఓ నెటిజ‌న్ పెట్టిన కామెంట్ వైర‌ల్ అవ్వ‌గా.. స్టార్ మా సైతం ఆ కామెంట్‌ని లైక్ చేయ‌డం విశేషం.



    ఇదంతా ప‌క్క‌న‌పెడితే సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రేమి విశ్వ‌నాథ్.. తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. ఆ లుక్‌లో వంట‌ల‌క్క ఆల్ట్రా మోడ్ర‌న్‌గా ఉండ‌గా.. ఆ ఫొటో ఫ్యాన్స్‌ని బాగా ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలో చాలా మంది సూప‌ర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక అందులో ఓ నెటిజ‌న్ వినూత్న కామెంట్ పెట్టారు. మా వంట‌ల‌క్క తోపు ద‌మ్ముంటే ఆపు అంటూ ఆ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్‌ని ప్రేమి లైక్ చేయ‌డం మ‌రో విశేషం.

    ప్రేమి విశ్వనాథ్(Photo: Instagram)


    ఇదిలా ఉంటే ఇన్ని రోజులు బుల్లితెర‌పై సంచ‌ల‌నం క్రియేట్ చేస్తూ వ‌స్తోన్న ప్రేమి.. త్వ‌ర‌లో వెండితెర‌పైకి కూడా రానున్నారు. తెలుగులో ప్రేమి విశ్వ‌నాథ్ ఓ లేడి ఓరియెంటెడ్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.
    Published by:Manjula S
    First published:January 19, 2021, 10:59 IST