• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KARTHIKA DEEPAM FAME VANTALAKKA PREMI VISHWANATH ASSETS DOMINATING HEROINES PK

Karthika Deepam Vantalakka Deepa: కార్తీక దీపం వంటలక్క ఆస్తులు అన్ని కోట్లా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే..!

Karthika Deepam Vantalakka Deepa: కార్తీక దీపం వంటలక్క ఆస్తులు అన్ని కోట్లా..  హీరోయిన్స్ కూడా దిగదుడుపే..!

ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanath/Instagram)

Karthika Deepam Vantalakka Deepa: వంటలక్క.. ఈ ఒక్క పేరు చాలు తెలుగు రాష్ట్రాలు రెండూ అభిమానంతో తడిసిపోవడానికి. ఓ సీరియల్‌కు ఇంత పాపులారిటీ వస్తుందా.. ఓ సీరియన్ నటిని ఇంతగా అభిమానిస్తారా అని అంతా ముక్కున వేలేసుకునేలా క్రేజ్..

  • Share this:
వంటలక్క.. ఈ ఒక్క పేరు చాలు తెలుగు రాష్ట్రాలు రెండూ అభిమానంతో తడిసిపోవడానికి. ఓ సీరియల్‌కు ఇంత పాపులారిటీ వస్తుందా.. ఓ సీరియన్ నటిని ఇంతగా అభిమానిస్తారా అని అంతా ముక్కున వేలేసుకునేలా క్రేజ్ సంపాదించుకుంది ప్రేమీ విశ్వనాథ్. ఈమె పేరు ఇది అని చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందరికీ ఈమె వంటలక్కగానే పరిచయం కాబట్టి. కార్తీక దీపం సీరియల్‌తో తెలుగులో కూడా చాలా గుర్తింపు సంపాదించుకుంది దీప ఉరఫ్ ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో ఈమెకు వచ్చిన క్రేజ్ చూసి చాలా మంది సీరియల్ హీరోయిన్లు కుళ్లుకుంటారేమో మరి..? తెలుగు రాష్ట్రాల్లో టీఆర్పీ పరంగా చూసుకున్నా కూడా కార్తీక దీపం నెంబర్ వన్ అంతే. దాని దరిదాపుల్లోకి కూడా మరో సీరియల్ రాదంటే అతిశయోక్తి కాదేమో..? ఆ మధ్య వరదలు వచ్చి ఇంట్లోకి మోకాళ్ళ లోతు నీళ్ళొస్తే కూడా కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ కూర్చున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సీరియల్ ఇంటింటికీ ఎలా చేరిపోయిందో..? మరోవైపు టీవీ లేదంటే ఓ అభిమానికి తన సొంత డబ్బులతో టీవీ కొనిచ్చింది వంటలక్క. అలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. ఇప్పుడు వెండితెరపై అరంగేట్రం చేస్తుంది. ఈమె క్రేజ్ చూసి కొందరు దర్శకులు ఏరికోరి సినిమాల్లో ఛాన్సులు ఇస్తున్నారు. వంటలక్క త్వరలోనే వెండితెరపై దర్శనమివ్వబోతుంది.
ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanath/Instagram)
ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanath/Instagram)


ఈ విషయాన్ని ప్రేమీ విశ్వనాథ్ స్వయంగా కన్ఫర్మ్ చేసింది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు చెప్పింది ప్రేమీ. లాక్‌డౌన్ కానీ లేకపోయుంటే ఈ పాటికే సినిమా విడుదలై ఉండేదని.. కానీ మధ్యలో కరోనా వచ్చి ప్లాన్స్ పాడు చేసిందని చెప్పుకొచ్చింది ఈమె. ఇప్పుడు షూటింగ్‌లకు అనుమతి రావడంతో మళ్లీ పాల్గొంటుంది ప్రేమీ విశ్వనాథ్. ఈమె సినిమా ఎంట్రీ కోసం వంటలక్క ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు బుల్లితెరపై కూడా వంటలక్క జోరు మామూలుగా లేదు.
ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanath/Instagram)
ప్రేమి విశ్వనాథ్ ( Premi Vishwanath/Instagram)


ఈమె రెమ్యునరేషన్స్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. కార్తీక దీపం కోసం ఒక్కో ఎపిసోడ్‌కు లక్షకు పైగానే తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. పైగా మలయాళ సినిమాల్లోనూ నటిస్తుంది ప్రేమీ. అక్కడా ఈమెకు లక్షల్లోనే పారితోషికం అందుతుంది. ఇక ఈమె ఆస్తుల విషయానికి వస్తే.. 2020 లెక్కల ప్రకారం 36 కోట్లకు పైగానే ఉందని తెలుస్తుంది. సీరియల్స్ చేసుకుంటూ ఈ రేంజ్‌లో సంపాదించింది అంటూ వంటలక్క రేంజ్‌కు అంతా ఫిదా అయిపోవాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published: