స్టార్ మా లో ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి తెలియని మహిళా ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ సీరియల్ దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచిందంటే ఈ సీరియర్ కున్న క్రేజ్ ఏ పాటితో చెప్పాల్సిన పనిలేదు. కార్తీక దీపం అంటే వంటలక్క అనేంతగా ప్రేక్షకుల నోళ్లలో ఈ సీరియర్ నానింది. ఈ సీరియల్ పాత్రధారి ప్రేమి విశ్వనాథ్.. ఎంతో పాపులర్ అయింది. మేని ఛాయ నలుపైనా తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే అందం ఆమె సొంతం. మలయాళం టీవీ తెర పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాథ్ అదే భాషలో కరుతముత్తు సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది. 2014లో ప్రారంభమైన కరుతముత్తు సీరియల్ తెలుగు కార్తీక దీపం సీరియల్ కు మాతృక. కరుతముత్తులో ప్రేమి కారక్టర్ పేరు కార్తీక అలియాస్ కార్తు అదే పేరుతో అక్కడ చాలా ఫేమస్ అయ్యింది. మలయాళంలో అప్పటి వరకూ వచ్చిన చానెల్స్ అన్నింటిని దాటుకొని నెంబర్ వన్ పొజిషన్ ను అందుకుంది. కరుతముత్తు సీరియల్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ప్రేమి విశ్వనాథ్ మరో రెండు సీరియల్స్ లో కూడా నటించింది. అంతే కాదు పలు గేమ్ షోలలో కూడా హోస్ట్ గా వ్యవహరించింది. ఇక 2017లో తెలుగులో ప్రారంభమైన కార్తీక దీపంలో కూడా ప్రేమి విశ్వనాథ్ నట విశ్వరూపం ప్రదర్శించింది. వంటలక్కగా ప్రతీ తెలుగు ఇంటిని పలకరించింది.ఈ సీరియల్ దేశంలోనే నెంబర్ వన్ సీరియల్‌గా టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కొట్టింది. అంతేకాదు గత యేడాదిన్నరగా ఈ సీరియల్ టీఆర్పీ కొట్టే వేరే సీరియల్ కానీ.. సినిమా కానీ రాలేదంటే అతిశయోక్తి కాదు.
తాజాగా కార్తీక దీపం సీరియల్ వంటలక్కకు పోటీగా మరో సీనియర్ హీరోయిన్ రంగంలోకి దిగనుంది. అప్పట్లో ‘భారతీయుడు’ సినిమాలో పచ్చని చిలుకలు తోడుంటే.. అనే పాట అనగానే గుర్తుకు వచ్చే కస్తూరి తాజాగా తెలుగులో ‘ఇంటింటీ గృహలక్ష్మీ’ సీరియల్‌తో పలకరించబోతుంది. రేపటి నుంచే టీవీల్లో ఈ సీరియల ప్రసారం కానుంది. తెలుగులో డాన్ శీను సినిమాలో రవితేజ అక్క పాత్రలోనటించింది. అంతకు ముందు నిప్పురవ్వ సినిమాలో బాలకృష్ణ చెల్లెలు పాత్రలో నటించిన కస్తూరి.. ఆ తర్వాత అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. గతేడాది కస్తూరి కమల్ హాసన్ హోస్ట్ చేసిన తమిళ బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇపుడు గృహలక్ష్మీ సీరియల్‌తో పలకరించబోతుంది. ఈ సీరియల్‌తో కార్తీక దీపం వంటలక్కకు గృహలక్ష్మీ సీరియల్‌తో చెక్ పెడుతుందా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Telugu Cinema, Tollywood, Vantalakka deepa