karthika deepam fame vantalakka deepa Premi Viswanath | స్టార్ మా చానల్ లో ప్రసారమయే కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని వారు తెలుగు ప్రేక్షకులు బహుశా ఉండరేమో. ఇంట్లో మగవాళ్లకు, పిల్లలకు ఈ సీరియల్ అంటే ఒకింత భయం అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సీరియల్ ప్రసారమయ్యే సమయంలో టీవీల్లో మరో ప్రోగ్రామ్స్ చూడాలంటే మగవాళ్లే భయపడే పరిస్థితి దాదాపు అందరి ఇళ్లలోను తయారైంది. అంతలా ఈ డైలీ సీరియల్ తెలుగు మహిళ ప్రేక్షకుల మనుసుల్లో చొచ్చుకుపోయింది. అంతగా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది కార్తీ దీపం సీరియల్. ఈ సీరియల్ గత యేడాదిన్నరగా నెంబర్ వన్ టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ వస్తోంది. మధ్యలో తోపు లాంటి సినిమాలు ఎన్ని ప్రసారమైన కార్తీక దీపిం సీరియల్ రేటింగ్‌ను మాత్రం దాటలేక కళ్లు తేలుస్తున్నాయి. కార్తీక దీపం అంటే వంటలక్క అనేంతగా ప్రేక్షకుల నోళ్లలో ఈ సీరియల్ నానింది. ఈ సీరియల్ పాత్రధారి ప్రేమి విశ్వనాథ్.. ఎంతో పాపులర్ అయింది. మేని ఛాయ నలుపైనా తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే అందం ఆమె సొంతం. మలయాళం టీవీ తెర పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాథ్ అదే భాషలో కరుతముత్తు సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది. 2014లో ప్రారంభమైన కరుతముత్తు సీరియల్ తెలుగు కార్తీక దీపం సీరియల్ కు మాతృక. కరుతముత్తులో ప్రేమి కారక్టర్ పేరు కార్తీక అలియాస్ కార్తు అదే పేరుతో అక్కడ చాలా ఫేమస్ అయ్యింది.
మలయాళంలో అప్పటి వరకూ వచ్చిన చానెల్స్ అన్నింటిని దాటుకొని నెంబర్ వన్ పొజిషన్ ను అందుకుంది. కరుతముత్తు సీరియల్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ప్రేమి విశ్వనాథ్ మరో రెండు సీరియల్స్ లో కూడా నటించింది. అంతే కాదు పలు గేమ్ షోలలో కూడా హోస్ట్ గా వ్యవహరించింది. ఇక 2017లో తెలుగులో ప్రారంభమైన కార్తీక దీపంలో కూడా ప్రేమి విశ్వనాథ్ నట విశ్వరూపం ప్రదర్శించింది. వంటలక్కగా ప్రతీ తెలుగు ఇంటిని పలకరించింది.ఈ సీరియల్ దేశంలోనే నెంబర్ వన్ సీరియల్‌గా టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కొట్టింది.
తాజాగా ఈ సీరియల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వంటలక్క ప్రేమి విశ్వనాథ్ స్థానంలో మరో నటిని తీసుకోబోతున్నారనే ఈ వార్త టీవీ ఛానెల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఏడు వందలకు పైగా ఎపిసోడ్ లను పూర్తి చేసుకొని కీలకదశకు చేరుకున్న ఈ సీరియల్ లో లీడ్ రోల్ ని మార్చడం ఏంటని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ సీరియల్ ప్రారంభంలో ప్రేమి విశ్వనాధ్ తక్కువ పారితోషకానికి ఒప్పుకున్నరని చెబుతున్నారు. ఐతే ప్రస్తుతం ఆ పారితోషకాన్ని పెంచాలనీ ఆమె డిమాండ్ చేస్తున్నారంటూ చెప్పుకుంటున్నారు. ఇదే కారణంగా మరో టాలీవుడ్ సీనియర్ నటిని వంటలక్క పాత్ర కోసం తీసుకోవాలనుకున్నట్లు టాక్. ఈ ప్రచారం వైరల్ అవ్వడంతో.. దీప ప్లేస్ లో మరో నటిని ఊహించుకోలేమని.. కార్తికదీపం అంటే వంటలక్క.. వంటలక్క అంటే కార్తీక దీపం అని ఆమె అభిమానులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Premi Viswanath, Telugu Cinema, Tollywood, Vantalakka deepa