KARTHIKA DEEPAM FAME VANTALAKKA ALIAS PREMI VISHWANATH ACTING AS DEVIKA IN MALAYALAM SERIAL NR
Premi Viswanath: వంటలక్క వెళ్లిపోతుందా.. కార్తీకదీపం సీరియల్కు శుభం కార్డు పడిందా.. అందుకే కొత్త సీరియల్?
Karthika deepam
Premi Viswanath: బుల్లితెరలో ఓ రేంజ్ లో సక్సెస్ అందుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. ఇక ఈ సీరియల్ కు ఎంతోమంది బుల్లితెర అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ ను వీక్షిస్తున్నారు.
Premi Viswanath: బుల్లితెరలో ఓ రేంజ్ లో సక్సెస్ అందుకుంటున్న సీరియల్ కార్తీకదీపం. ఇక ఈ సీరియల్ కు ఎంతోమంది బుల్లితెర అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ ను వీక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ కాస్త ట్విస్టులతో సాగుతున్న తరుణంలో ఎటు అర్థం కాని కథగా మారింది. ఇందులో కార్తీక్.. మోనిత ను పెళ్లి చేసుకుంటాడా.. దీపకి అన్యాయం చేస్తాడా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకవేళ ఇలాగే జరిగితే వంటలక్క వెళ్లి పోవడం.. ఇక ఈ సీరియల్ శుభం కార్డు పలకడం ఖాయమని తెలుస్తోంది. కానీ ఈ సీరియల్ డైరెక్టర్ కథను ఎలా మలుపు తిప్పుతాడో చూడాలి. ఇదిలా ఉంటే వంటలక్క మరో కొత్త సీరియల్ కు స్వాగతం పలికిందని తెలుస్తోంది.
కేరళకు చెందిన మన వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకుంది. ఇక ఈ సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ ఇప్పటివరకు ఏ సీరియల్ కు ఒప్పుకోలేదట. కానీ తాజాగా 'దేవిక' అనే మలయాళ సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సీరియల్ లో మన వంటలక్క పూర్తిగా లుక్ ను మార్చేసింది. మోడ్రన్ డ్రెస్సులో స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇక ఈ సీరియల్ జూలై 5 నుంచి సూర్య టీవీ లో రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమో ను వంటలక్క తన ఫేస్ బుక్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారగా ఇందులో వంటలక్క గెటప్ ను చూసి అందరూ షాక్ అవుతున్నారు. పైగా ఇందులో ఏమాత్రం అమాయకత్వం కనిపించకుండా ఉండటంతో మన తెలుగు ప్రేక్షకులు వంటలక్క కోసమైనా భాష అర్ధం కాకపోయినా ఈ సీరియల్ ను చూడటానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక కార్తీకదీపం సీరియల్ ఎటు వెళుతుందో తెలియదు కానీ మొత్తానికి అది శుభం కార్డు పలకడానికి సిద్ధంగా ఉందని అందుకే వంటలక్క మరో సీరియల్ వైపు అడుగులు వేసినట్లు తెలుస్తోంది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.