Home /News /movies /

KARTHIKA DEEPAM FAME PREMI VISWANATH WASHING CAR VIDEO GOES VIRAL IN TIKTOK SK

లాక్‌డౌన్‌లో క్లీనర్‌గా మారిన వంటలక్క.. షాకైన కార్తీక దీపం ఫ్యాన్స్

కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్

కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్

కార్తీక దీపం సీరియల్ మాదిరే.. నిజ జీవితంలోనూ నీకు ఎన్ని కష్టాలు వచ్చాయక్కా.. అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. మాయదారి కరోనా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందంటూ.. ఫన్నీగా స్పందిస్తున్నారు.

    వంటలక్క..! తెలుగింటి గృహిణిలకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. కార్తీక దీపం సీరియల్ ద్వారా అందరికీ ఇంటి మనిషి అయిపోయింది దీప. ఆ క్యారెక్టర్‌ను తెలుగు ప్రేక్షకులకు అంతగా ఆదరిస్తున్నారు. కార్తీక దీపం రేటింగ్‌కు బిగ్ బాస్ షో కాదు కదా.. పెద్ద పెద్ద సినిమాలు సైతం బీట్ చేయలేకపోయాయి. రేటింగ్ పరంగా అంతలా దూసుకెళ్లింది కార్తీక దీపం. అందులో దీప క్యారక్టర్‌లో నటించిన ప్రేమి విశ్వనాథ్‌కు తెలుగునాట పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. టాప్ సినిమా హీరోయిన్ స్థాయిలో ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్ ఉంది.

    ఐతే కరోనా లాక్‌డౌన్ వల్ల అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. సినిమాలు, సీరియళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. సినీ స్టార్లంతా ఇళ్లకే పరిమితమై.. కుటుంబంతోనే గడుపుతున్నారు. క్వారంటైన్‌లో సినిమాలు చూస్తూ.. ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అదే తరహాలో కార్తీక దీపం కూడా నిలిచిపోవడంతో.. ప్రేమి విశ్వనాథ్ కూడా ఇంటికే పరిమితమయ్యారు. క్వారంటైన్‌లో తాను కూడా ఇంటి పనులు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఐతే టిక్ టాక్‌లో గురువారం ప్రేమి విశ్వనాథ్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటి ముందు కారును శుభ్రంచేస్తూ క్లీనర్‌గా మారిపోయింది వంటలక్క. డస్టర్‌ను నీటిలో ముంచి .. కారు బ్యానెట్‌ను తుడుస్తూ వీడియోలో కనిపించింది.

    ఆ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ మాదిరే.. నిజ జీవితంలోనూ నీకు ఎన్ని కష్టాలు వచ్చాయక్కా.. అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. మాయదారి కరోనా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందంటూ.. ఫన్నీగా స్పందిస్తున్నారు.
    @premivishwanath9

    ##car ##wash ##challeng ##karthikadeepam ##kerala ##crazy ##girl##love ##tiktok ##tiktok_india

    ♬ Manohari - Vijay Yesudas & Sayanora
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Premi Viswanath, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు