KARTHIKA DEEPAM FAME PREMI VISWANATH BREAKS HER OWN RULES ACTS IN ADVERTISEMENT BA
Karthika Deepam: కార్తీకదీపం వంటలక్క షాకింగ్ నిర్ణయం.. అందులో నుంచి బయటకొచ్చేసింది..
కార్తీక దీపం వంటలక్క (Twitter/Photo)
కార్తీక దీపం సీరియల్ ఫేం ప్రేమీ విశ్వనాథ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ఆమెను సీరియల్‌లోనే చూసేవాళ్లు ఫ్యాన్స్. ఆమె బయట కూడా పెద్దగా కనిపించదు. కేవలం సీరియల్‌లో మాత్రమే అభిమానులను అలరిస్తుంది. అయితే, ఇన్నాళ్లూ తను పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేసింది.
కార్తీక దీపం సీరియల్ ఫేం ప్రేమీ విశ్వనాథ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ఆమెను సీరియల్‌లోనే చూసేవాళ్లు ఫ్యాన్స్. ఆమె బయట కూడా పెద్దగా కనిపించదు. కేవలం సీరియల్‌లో మాత్రమే అభిమానులను అలరిస్తుంది. అయితే, ఇన్నాళ్లూ తను పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేసింది. కెరీర్‌లో మొట్టమొదటి సారి సీరియల్స్ నుంచి బయటకు వచ్చింది. ఫస్ట్ టైమ్ సీరియల్స్ కాకుండా ఆమె యాడ్స్‌లో కూడా నటిస్తోంది. ఒక్కటే కాదు. జంటగా. కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబుతో కలసి ఆమె ఓ ఇన్ ఫ్రా కంపెనీ యాడ్‌లో నటించింది. ఈ యాడ్ ప్రస్తుతం కొన్ని తెలుగు ఛానల్స్‌లో ప్రసారం అవుతోంది. తెలుగులో కార్తీక దీపం సీరియల్ ద్వారా ప్రేమీ విశ్వనాథ్ సూపర్ ఫాలోయింగ్ ఉంది. అలాగే, డాక్టర్ బాబు, వంటలక్క కాంబినేషన్ సూపర్ హిట్. ఎలాంటి యాడ్స్ కూడా చేయని, పెద్దగా బయటకు రాని ప్రేమీ విశ్వనాథ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కార్తీక దీపం సీరియస్ స్టార్ మా ఛానల్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ తెలుగులో మాత్రమే ప్రసారం అవుతున్నా కూడా చానల్ రేటింగ్స్ అమాంతం పెంచేసింది. స్టార్ మా లో మరో క్రేజీ ప్రోగ్రాం అయిన బిగ్ బాస్‌కు కూడా రేటింగ్స్‌లో పెద్ద కాంపిటీషన్ ఇచ్చింది. ఓ దశలో పలుమార్లు రేటింగ్స్ కూడా కొల్లగొట్టింది.
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. సౌర్య, హిమలను తీసుకొని దీప.. సౌందర్య ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో నెక్ట్స్ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి పెరిగింది. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో సౌందర్య ఇంటి బయట కూర్చొని, దీప గురించి ఆలోచిస్తూ ఉండగా.. కార్తీక్ వస్తాడు. నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని ప్రశ్నించగా.. ఒకప్పుడు నేను అసలు ఇష్టపడని ఓ మనిషిని నువ్వు నా దగ్గరకు తీసుకొచ్చావు. అప్పుడు నేను దాన్ని ఇక్కడే ఉంచా. దానికి ఉన్నది ఆత్మ గౌరవం అని అది ఇల్లు దాచి వెళ్లినప్పుడే తెలిసింది. అది తప్పు చేసిందని నేను అనుకున్నా. అప్పుడు అది ఆత్మ గౌరవం అని నువ్వు నమ్మావు. ఇప్పుడు అది తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావు. కానీ నేను ఆత్మ గౌరవం అని అంటున్నా అని ఏడుస్తుంది. నువ్వు ముందు అక్కడి నుంచి లోపలికి రా అని వెళ్లిపోతాడు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.