హోమ్ /వార్తలు /సినిమా /

Premi Vishwanath : సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. కారణం అదేనా...

Premi Vishwanath : సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. కారణం అదేనా...

Premi Vishwanath

Premi Vishwanath

Premi Vishwanath : ఆత్మస్థైర్యంతో ఎదుర్కోంటున్న దీప పాత్రలో నటిస్తూ.. వంటలక్కగా గుర్తింపు సొంతం చేసుకుంది కేరళ కుట్టి ప్రేమి విశ్వానాథ్. ఈ సీరియల్‏లో వంటలక్క (దీప) పాత్రలో అద్భుతంగా నటిస్తూ.. తెలుగువారి ఇంట్లో ఆడపిల్లగా మారిపోయింది.

ఇంకా చదవండి ...

కార్తీక దీపం సీరియల్‌తో బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ దక్కించుకున్నారు ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్‌లో వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ (Premi Vishwanath) అద్భుత నటనతో బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసుకోగా.. డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల అంతే అద్భుతంగా ఆకట్టుకుంటున్నారు. ఇక వీళ్లిద్దరికీ పిల్లలుగా నటించిన సౌర్య (బేబీ క్రితిక), హిమ (సహృద)ల నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. ఇటీవల ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంది. రాత్రి 7.30 అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో కార్తీక దీపం సీరియల్ చూడాల్సిందే. ఇప్పటికే ఈ సీరియల్ చూడకుండా ఉండలేనివారు చాలా మందే ఉన్నారు. అంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సీరియల్‏కు ప్రధాన బలం వంటలక్క. తన వ్యక్తిత్వాన్ని చంపుకోని ఓ భార్యగా.. భర్త అనుమానాలను తొలగించడానికి.. ఎదురైన ప్రతి కష్టాన్ని తన ఆత్మస్థైర్యంతో ఎదుర్కోంటున్న దీప పాత్రలో నటిస్తూ.. వంటలక్కగా గుర్తింపు సొంతం చేసుకుంది కేరళ కుట్టి ప్రేమి విశ్వానాథ్. ఈ సీరియల్‏లో వంటలక్క (దీప) పాత్రలో అద్భుతంగా నటిస్తూ.. తెలుగువారి ఇంట్లో ఆడపిల్లగా మారిపోయింది ఈ మలయాళ భామ.ఈ సీరియల్ ద్వారా ప్రేమి విశ్వనాథ్‏కు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ అమ్మడుకు సంబంధించిన ప్రతి విషయం నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉంటుంది.

అలాగే వంటలక్క కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలతోపాటు… సీరియల్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే స్టార్ మా ఛానల్ ఉగాది పండుగను పురస్కరించుకొని .. మా ఉగాది వేడుక అనే స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు. అందులో పలు సీరియల్స్ నటీనటులు విభిన్న స్క్రిప్ట్స్ చేస్తూ.. ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఆ వీడియోలో డాక్టర్ బాబు రాముడిగా, వంటలక్క సీతగా, పిల్లలు సౌర్య, హిమలు లవకుశలుగా కనిపిస్తూ.. రామయణ గాథను వినిపించిన సంగతి తెలిసిందే.అయితే ఈ వేడుక కోసం సీతలాగా రెడీ అయిన ప్రేమివిశ్వనాథ్ తన ఫోటోను..నయనతారతో పోల్చూతూ.. రామయణమే.. శ్రీ రామయణమే అనే సాంగ్ జత చేసి తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. ప్రేమి విశ్వనాథ్ కంటే నయనతారనే బాగుంది… నయనతార మేకప్ నేచురల్‏గా ఉంది… కానీ మీకు మేకప్ ఓవర్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: Karthika deepam, Nayanathara, Premi Viswanath

ఉత్తమ కథలు