Nirupam Paritala - Manjula Paritala: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ తో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు కార్తీక్. ఈ సీరియల్ లో డాక్టర్ బాబుగా మంచి సక్సెస్ తో దూసుకుపోతున్నాడు పరిటాల నిరుపమ్. అలనాటి నటుడు, డైలాగ్ రైటర్ ఓంకార్ కుమారుడే నిరుపమ్. ఇక ఈయన మరో బుల్లితెర నటి మంజుల ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే కాలేజీలో జరిగిన విషయం గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది మంజుల.
బుల్లితెరలో క్యూట్ కపుల్స్ గా ఉన్న ఈ జంట.. చంద్రముఖి సీరియల్ లో తొలిసారిగా కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం పెరగడంతో ప్రేమగా మారిందని.. ఇక తన ప్రేమ విషయం తమ కుటుంబ సభ్యులతో చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నామని గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలిపారు. ఇక పెళ్లి తర్వాత కూడా మంజుల పలు సీరియల్స్ లో నటించింది. ఇక ఈ మధ్య సీరియల్స్ కు దూరమవ్వగా అప్పుడప్పుడు బుల్లితెరలో జరిగే కొన్ని ఈవెంట్లలో, కొన్ని షోలలో పాల్గొంటుంది.
ఇదిలా ఉంటే జీ తెలుగులో త్వరలో ప్రసారం కానున్న అలా బృందావనములో ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో విడుదలయింది. అందులో శ్రీముఖి హోస్టింగ్ చేయగా ఇందులో టాలీవుడ్ హీరోలు సుధీర్ బాబు, శ్రీ విష్ణు, సుశాంత్ గెస్ట్ లుగా పాల్గొన్నారు. అంతేకాకుండా బుల్లితెర నటులు కూడా పాల్గొనగా తమ పర్ఫామెన్స్ లతో బాగా అదరగొట్టారు. పలువురు కమెడియన్స్ కూడా పాల్గొని తమ స్కిట్ లతో తెగ నవ్వించారు.
ఇక కొందరు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకోగా.. మన డాక్టర్ బాబు భార్య మంజుల కూడా తన కాలేజీ రోజుల్లో జరిగిన విషయాన్ని పంచుకుంది. కాలేజీ లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ సిగరెట్ ట్రై చేయాలని అనుకుందని తెలుపగా.. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఇక అందర్ని చూస్తూ నాకైతే అటువంటి ఉద్దేశం లేదు అంటూ కామెంట్స్ చేసింది. వెంటనే నిరుపమ్ ఉద్దేశాల గురించి ఎందుకులే కానీ.. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు అంటూ పంచ్ వేయగా వీరి మధ్య మాటలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారగా.. బుల్లితెర ప్రేక్షకులు ఈ షో కోసం ఎదురు చూస్తున్నాం అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika deepam, Manjula paritala, Nirupam paritala, Nirupam smoking, Vantalakka