హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam Hima: కార్తీక దీపం హిమ రియల్ లైఫ్ తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు

Karthika Deepam Hima: కార్తీక దీపం హిమ రియల్ లైఫ్ తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు

Karthika Deepam Hima: తెలుగు సీరియల్స్‌లో కార్తీక దీపంకు ఆదరణ రోజు రోజుకీ పెరుగుతోంది. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయ్యారు. ముఖ్యంగా హిమ, శౌర్య పాత్రలకు. కానీ నిజ జీవితంలో హిమ పాత్ర పేరు సీరియల్‌లో చూస్తున్న దానికి భిన్నంగా ఉంటుంది.

ఇంకా చదవండి ...

  వెండితెరకు ధీటుగా బుల్లితెరకు ఆదరణ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇంట్లోని మహిళల ఆదరణ బుల్లితెరకే ఎక్కువగా ఉంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రేక్షకులు సీరియల్స్‌ చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కార్తీక దీపంకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు ఈ సీరియల్‌ తెలియని తెలుగు ప్రేక్షకులు, వంటలక్క గురించి తెలియని వారు ఉండకవచ్చు. ఈ ఆదరణ కారణంగానే వెయ్యి ఎపిసోడ్లు పూర్తవుతున్నప్పటికీ కార్తీకదీపంకు ఆదరణ తగ్గలేదు. ఈ సీరియల్‌లో వంటలక్క పాత్ర చాలా పాపులర్‌ అయ్యింది. ఆమె కూతుర్లుగా నటించిన హిమ, శౌర్య పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని దక్కించుకున్నాయి. వీరిలో హిమకు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ క్రియేట్‌ అయ్యింది. నిజానికి హిమ పాత్రలో నటించిన పాప పేరు సహృద. సీరియల్‌లో తండ్రి నుంచి ఎంతో ప్రేమను పొందిన సహృద నిజజీవితంలో అందుకు భిన్నమైన అనుభవాన్ని ఎదుర్కొంటుంటోందట.

  సహృద పుట్టినప్పుడు ఆమె తండ్రికి ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేదట. దీంతో ఆ పాపను ఆయన చూడనేలేదట. తల్లి ఎంతో కష్టపడి సహృదను పెంచి పెద్ద చేసింది. సీరియల్‌కు భిన్నంగా నిజ జీవితంలో తండ్రి ప్రేమను నోచుకోని సహృద కార్తీక దీపంలో హిమ పాత్రలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. హిమ, శౌర్య పాత్రల్లో హిమ పాత్ర నల్లగా ఉంటుంది. నటన అంటే ఇష్టమున్నప్పటికీ సహృదను ఓ సందర్భలో హిమ పాత్రలో నటించడానికి భయపడిందని చెప్పుకొచ్చింది. అయితే నిర్మాతకు ఇచ్చిన మాటకు కట్టుబడి క్యారెక్టర్‌లో మేకప్ నచ్చక పోయినా బలవంతంగా నటించానని చెప్పింది సహృద.

  తర్వాత వంటలక్కగా నటించిన ప్రేమి విశ్వనాథన్‌ డీ గ్లామర్‌ పాత్రను ఎంత ఇష్టపడి చేసి మంచి పేరు తెచ్చుకుందో తెలుసుకుని ఆ పాత్రను క్రమంగా ఇష్టపడటం ప్రారంభించానని ఇప్పుడెంతో ఇష్టంగా హిమ పాత్రను చేస్తున్నానని సహృద తెలిపింది. కార్తీక దీపంలోని ప్రతి కారెక్టర్‌తోనూ ప్రేమలో పడిపోయారు ఆడియన్స్. వంటలక్క, డాక్టర్ బాబు, హిమ, సౌందర్య, మోనిత ఇలా ప్రతీ ఒక్క పాత్ర కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

  First published:

  Tags: Karthika Deepam serial

  ఉత్తమ కథలు