• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KARTHIKA DEEPAM FAME BAGYAM SHOCKING COMMENTS ON INDUSTRY NR

Karthika Deepam: ఇష్టం అనుకుంటే ఇండస్ట్రీలో ఇబ్బందే ఉండదు: కార్తీకదీపం భాగ్యం

Karthika Deepam: ఇష్టం అనుకుంటే ఇండస్ట్రీలో ఇబ్బందే ఉండదు: కార్తీకదీపం భాగ్యం

karthika deepam bagyam

Karthika Deepam: చాలామంది వెండితెర నటులు బుల్లితెరలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది నటులు బుల్లితెరలో నటించగా.. బుల్లి తెరపై వస్తున్న క్రేజ్ తమకు వెండితెరలో రాలేదంటున్నారు నటులు

  • Share this:
    Karthika Deepam: చాలామంది వెండితెర నటులు బుల్లితెరలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది నటులు బుల్లితెరలో నటించగా.. బుల్లి తెరపై వస్తున్న క్రేజ్ తమకు వెండితెరలో రాలేదంటున్నారు నటులు. ఇదిలా ఉంటే కార్తీకదీపం భాగ్యం గురించి అందరికీ తెలిసిందే. స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ లో దీప సవతి తల్లిగా నటిస్తున్న భాగ్యం ఒక వెండితెర నటినే. భాగ్యం అసలు పేరు ఉమా. ఇక ఈమె ఈ సీరియల్లో తన పాత్రకు మొదట్లో ప్రేక్షకులనుండి విమర్శలు ఎదుర్కొన్న ఇప్పుడు మాత్రం మంచి ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాకుండా ప్రేమ ఎంత మధురం, మమతల కోవెల సీరియల్ లో కూడా నటిస్తుంది.

    ఇక వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. బోల్డ్ పాత్రలు కూడా చేసింది. అంతేకాకుండా బోల్డ్ నటిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. ఇక తాజాగా ఆమె కొన్ని విషయాల గురించి పంచుకోగా.. తను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తన ఎదుర్కొన్న సమస్యలు, తను నటనలో తెచ్చుకున్న గుర్తింపుల గురించి తెలుపుతూ.. ఇక ఇబ్బంది అనుకుంటే ఎక్కడైనా ఇబ్బంది ఉంటుందని తెలిపింది. ఇక తనకు ఫ్యామిలీ నుండి కూడా సపోర్ట్ వుండగా మొత్తానికి మంచి ఆర్టిస్టుగా మారిందట‌.

    karthika deepam bagyam
    karthika deepam bagyam


    ఇక ఆమె బోల్డ్ పాత్రలో నటించగా.. తనకు ఎక్కువ ఇబ్బందులు రాలేవట. ఒక ఆర్టిస్ట్ తన కెరీర్ ని ప్రొఫెషనల్ గా భావించినప్పుడే ఏ పాత్రనైన చేస్తాడని తెలిపింది. ఇక ఇప్పటికీ ఆమె ఏ పాత్ర అయినా చేస్తానంటూ, ఇప్పటివరకు ఆ పాత్రలలో ఎందుకు నటించానని అనుకోలేదట. ఇక మంచి తొందరగా వెళ్లదు అంటూ చెడు తొందరగా వెళ్తుంది అని అంటూ.. దానికి ఉదాహరణగా తను నటించిన బోల్డ్ పాత్రలేనని తెలిపింది. తన బోల్డ్ పాత్రలు తక్కువగా చేసిన వాటి గురించి ఎక్కువ చెప్పుకునేవారట.
    Published by:Navya Reddy
    First published: