Home /News /movies /

KARTHIKA DEEPAM EPISODE UPDATE KARTHIK REFUSE TO LEARN TRUTH FROM DEEPA ELSEWHWRE DEEPA TAKES AWAY HIMA SOURYA FROM KARTHIK MNJ

Karthika Deepam: సౌర్య‌, హిమ‌ల‌తో ఇల్లు వదిలి వెళుతున్న దీప‌.. ఆగ‌మ‌న్న కార్తీక్

కార్తీక దీపం

కార్తీక దీపం

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో తుల‌సి విష‌యాన్ని దీప‌ చెప్పినా కార్తీక్ వినిపించుకోడు. ఈ విష‌యంలో సౌంద‌ర్య‌, ఆనంద‌రావు, దీప కార్తీక్‌తో మాట్లాడుతూ ఉంటారు. వారి సంభాష‌ణ ఇవాళ కొనసాగుతుంది.

ఇంకా చదవండి ...
  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. నిన్న‌టి ఎపిసోడ్‌లో తుల‌సి విష‌యాన్ని దీప‌ చెప్పినా కార్తీక్ వినిపించుకోడు. ఈ విష‌యంలో సౌంద‌ర్య‌, ఆనంద‌రావు, దీప కార్తీక్‌తో మాట్లాడుతూ ఉంటారు. వారి సంభాష‌ణ ఇవాళ కొనసాగుతుంది. ఆనంద‌రావు మాట్లాడుతూ.. దీప‌కు చీక‌ట్లో చిరు దీపంలా ఒక ఆశ చిగురించింది. ఆ ధైర్యంతోనే దీప‌ను నీతో మాట్లాడ‌టానికి ఏర్పాట్లు చేసి వెళ్లాము. కానీ నీలో వినే శ‌క్తి స‌న్న‌గిల్లింది. మాలో ఆ ఆశ కూడా కొడ‌కొట్టుకు పోయింది అని అంటాడు. ఇక కార్తీక్.. ఏం చేసి ఉండాల్సింది నేను. మీ అంద‌రిలో వెలిగిన ఆ చిరు దీపాన్ని అఖండ జ్యోతిలా వెలిగించ‌డానికి నా రెండు చేతులు అడ్డుపెట్టాలా.. నా చేతులు కాల్చుకోవాలా..ఏం తెలుసు డాడీ మీకు. కాస్త తెలివి ఉన్న వాడు ఎవ‌డైనా ఈ వంట‌ల‌క్క తెచ్చిన స‌మాచారాన్ని వింటే న‌వ్విపోతాడు. న‌మ్మిపోడు అని అంటాడు. ఇక ఆనంద‌రావు ఎందుకు న‌మ్మ‌డు ఆ తెలివైన మూర్ఖుడు అన‌గా.. ఎందుకంటే. పెళ్లై ప‌దేళ్లు ఖాళీగా ఉండి, ప‌దేళ్ల త‌రువాత అర్జెంట్‌గా పిల్ల‌ల కోసం ప‌రీక్ష‌లు చేయించుకున్నారా ఆ దంప‌తులు.. ఎవ‌రైనా పెళ్లైన పిల్ల‌ల కోసం రెండేళ్లు, మూడేళ్లు మ‌హా అయితే ఐదేళ్లు ఎదురుచూస్తారు. వాళ్ల‌కు ప‌దేళ్ల త‌రువాత అమ్మ నాన్న‌లు కావాల‌న్న కోరిక పుట్ట‌డం ఏంటి.. అందులో నుంచి మీకో చిరు దీపం వెల‌గ‌డం ఏంటి.. ఈ క‌థ‌ల‌న్నీ వీరు చెబుతున్నారా.. వీరు చెబుతున్నారా అన్న క‌నీస ఙ్ఞానం కూడా నాకు లేదా అని అన‌గా.. లేదు అని సౌంద‌ర్య అంటుంది.

  లేదురా. నీకు ఆ క‌నీస ఙ్ఞానం లేదు. అదే ఉంటే ఇలా అడ్డంగా వాదిస్తావా..ఎలాగోలా దీప‌ను నిన్నుక‌లిపేసి, చేతులు దులిపేసుకొని.. కృష్ణ, రామ అంటూ శేష జీవితం గ‌డిపేయాల‌నుకునే కారెక్ట‌ర్ కాదురా మీ అమ్మ‌ది. స‌త్యం మాట్లాడుతుంది. నైతిక విలువ‌ల‌ను గౌర‌విస్తుంది. ప‌విత్ర‌త‌ను మ‌న‌సుతో గుర్తిస్తుంది అని సౌంద‌ర్య అంటుంది. దానికి కార్తీక్.. నేను గుర్తించ‌ను. నేను మార‌ను. నేను న‌మ్మిందే స‌త్యం. నేను చూసిందే స‌త్యం. నాకు తెలిసిందే స‌త్యం. ద‌ట్సాల్ అని అంటాడు. ఇక దీప‌.. డాక్ట‌ర్ బాబు. మీరు ఇంత క‌ఠినంగా ఉండ‌కండి. ఇది మీ వ్య‌క్తిత్వం కాదు. మీరు నేర్చుకున్న సంస్కారం వేరు. మీరు ఎప్పుడు అంత ఎత్తులోనే ఉండాలి. నా క‌ళ్ల‌కు మీరు త‌క్కువ‌గా క‌నిపించ‌కూడ‌దు. నేనే గ‌నుక త‌ప్పు చేసి ఉంటే ఇలా మీ కోసం త‌పస్సు చేయ‌ను. ఎంతోమంది ప‌తివ్ర‌త‌లు శీల ప‌రీక్ష కోసం అగ్ని పరీక్ష‌లు చేశారు. కానీ అది ఒక్క‌సారే. నేను ప‌దేళ్ల నుంచి అగ్ని ప్ర‌వేశం చేస్తూనే ఉన్నాను. ఎందుకో ఆలోచించండి అని అంటుంది. వెంట‌నే కార్తీక్.. ఇంకెందుకు నా బ‌తుకు బూడిద చేయ‌డానికి అని అంటాడు.

  సౌంద‌ర్య, కార్తీక్ అనగా.. అమ్మ నువ్వు మ‌ధ్య‌లోకి రాకు. నేనే నిజం, నేనే సాక్ష్యం, నేనే రుజువు, నేనే ఆధారం. నా కోసం నేను మార‌డం కోసం మీరు ఇలాంటి ఎన్ని సాక్ష్యాలు తెచ్చినా నాకు అన‌వ‌స‌రం. నేను న‌మ్మ‌ను, న‌మ్మ‌ను, న‌మ్మ‌లేను అని కార్తీక్ అంటాడు. న‌మ్మ‌రా అని దీప అడ‌గ్గా.. న‌మ్మ‌ను అని కార్తీక్ అంటాడు. ఎప్ప‌టికీ న‌మ్మ‌రా అని దీప ప్ర‌శ్నించ‌గా.. న‌మ్మ‌లేను అని కార్తీక్ అంటాడు. ఇక దీప ఏడుస్తూ.. మంచిది. నేను నా వ్య‌క్తిత్వాన్ని ఇంకా ఇంకా అంగ‌డిలో స‌రుకులా అమ్మ‌లేను. అమ్మ‌ను నేను. అమ్మ‌కానికి ప‌నికిరాని వ‌స్తువును కాదు అని అంటుంది. సౌంద‌ర్య దీప అన‌గా.. అయిపోయింది అత్త‌య్య. మ‌న‌కు దొరికిన చిరు దీపం కూడా ఆరిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది. వెంట‌నే సౌంద‌ర్య నేను మాట్లాడుతున్నాను క‌దా అని అన‌గా.. అక్క‌డ మాట్లాడుతూనే ఉన్నారు క‌దా అని కార్తీక్ వైపు చూపించి చెబుతుంది దీప‌.

  సౌంద‌ర్య, కార్తీక్ అనగా.. అమ్మ నువ్వు మ‌ధ్య‌లోకి రాకు. నేనే నిజం, నేనే సాక్ష్యం, నేనే రుజువు, నేనే ఆధారం. నా కోసం నేను మార‌డం కోసం మీరు ఇలాంటి ఎన్ని సాక్ష్యాలు తెచ్చినా నాకు అన‌వ‌స‌రం. నేను న‌మ్మ‌ను, న‌మ్మ‌ను, న‌మ్మ‌లేను అని కార్తీక్ అంటాడు. న‌మ్మ‌రా అని దీప అడ‌గ్గా.. న‌మ్మ‌ను అని కార్తీక్ అంటాడు. ఎప్ప‌టికీ న‌మ్మ‌రా అని దీప ప్ర‌శ్నించ‌గా.. న‌మ్మ‌లేను అని కార్తీక్ అంటాడు. ఇక దీప ఏడుస్తూ.. మంచిది. నేను నా వ్య‌క్తిత్వాన్ని ఇంకా ఇంకా అంగ‌డిలో స‌రుకులా అమ్మ‌లేను. అమ్మ‌ను నేను. అమ్మ‌కానికి ప‌నికిరాని వ‌స్తువును కాదు అని అంటుంది. సౌంద‌ర్య దీప అన‌గా.. అయిపోయింది అత్త‌య్య. మ‌న‌కు దొరికిన చిరు దీపం కూడా ఆరిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది. వెంట‌నే సౌంద‌ర్య నేను మాట్లాడుతున్నాను క‌దా అని అన‌గా.. అక్క‌డ మాట్లాడుతూనే ఉన్నారు క‌దా అని కార్తీక్ వైపు చూపించి చెబుతుంది దీప‌.

  వారిని ద‌గ్గ‌ర‌కు తీసుకుంటుంది దీప‌. మ‌నంద‌రం క‌లిసిపోతామ‌ని మీకు ప్రామిస్ చేశాను. నిల‌బెట్టుకోలేక‌పోతున్నాను. మీకు అమ్మో, నాన్నో ఎవ‌రో ఒక‌రే మిగిలారు. అమ్మ కావాలంటే నాతో రండి. నాన్న కావాలంటే ఇక్క‌డే ఉండండి. మీరు ఇక్క‌డ ఉండ‌టం ఆయ‌న‌కు అభ్యంత‌రం ఉండ‌ద‌నే అనుకుంటున్నాను అని దీప అంటుంది.

  ఇక దీప వెళ‌తాను అత్త‌య్య అని అన‌గా.. వ‌ద్దే ప్లీజ్ అని సౌంద‌ర్య అంటుంది. వెళ్లాలి త‌ప్ప‌దు అని చెప్పి సౌర్య‌, హిమ‌ల‌ను తీసుకెళుతుంటుంది దీప‌. ఒక్క నిమిషం అని కార్తీక్ ఆపుతాడు. సౌర్య‌, హిమ‌ల‌ను తీసుకొని హ‌త్తుకొని.. ఎప్పుడైనా, ఎక్క‌డైనా నేను క‌న‌ప‌డితే న‌వ్వుతూ ప‌ల‌క‌రించండి. ఎప్పుడైనా, ఏదైనా అవ‌స‌రం అయితే నేను ఉన్నాన‌ని మ‌ర్చిపోకండి. నేను మంచి వాడిన‌ని మీరు న‌మ్మితే చాలు అని అంటాడు. వెంట‌నే కార్తీక్ నుంచి పిల్ల‌ల‌ను తీసుకొని దీప ఇల్లు వ‌దిలి వెళుతుంది. కార్తీక్ పైకి వెళ‌తాడు.

  మ‌రోవైపు మోనిత‌.. కారులో ఉండి కార్తీక్ మాట‌ల‌ను గుర్తు చేసుకుంటుంది. ఛ అస‌లు వీళ్ల ప్లాన్ ఏంటి. ఏ ఉద్దేశ్యంతో కార్తీక్‌ని వ‌దిలేసి అంద‌రూ గుడికి వెళ్లారు. నేను ముందే కార్తీక్ బ్రెయిన్‌లో ఒక విష‌బీజం నాటాను. ఇదంతా కావాల‌ని దీప‌ను నీతో మాట్లాడించ‌డానికి చేస్తున్నార‌ని చెప్పి అత‌డిని ప్రిపేర్ చేసి ఉంచాను. కానీ అది వ‌ర్కౌట్ అవుతుందా.. నిజంగా దీప‌, కార్తీక్ ద‌గ్గ‌ర‌కు విహారి విష‌యం చెప్ప‌డానికి వెళ్లిందా.. ఏం జ‌రిగి ఉంటుంది. ఏం జ‌రిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా కాల్ చేయ‌లేదేంటి అని అత‌డికి ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి నేను త‌రువాత చేస్తా అని చెబుతాడు.

  ఇక పిల్ల‌ల‌ను తీసుకొని దీప శ్రీరామ్ న‌గ‌ర్ బ‌స్తీకి వెళ్ల‌గా.. కార్తీక్ బెడ్‌రూమ్‌లో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సౌర్య, కార్తీక్ ఙ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంటికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌గా.. ఏడుస్తూ వెన‌క్కి వ‌చ్చి వార‌ణాసి ఆటో తీయ్‌రా. నాన్న ద‌గ్గ‌ర వదిలేయ‌రా.. తీసుకెళ్ల‌రా.. స్టార్ట్ చేయ‌రా.. పోనీరా అని ఏడుస్తూ ఉంటుంది. పోనీరా.. మా నాన్న‌ను చూడాలి, మాట్లాడాలి. ప్లీజ్‌రా అని ఏడుస్తూ ఉండ‌గా.. సౌర్య రా అని హిమ పిలుస్తుంది. దానికి సౌర్య‌.. నాకు నాన్న కావాలి అని అంటుంది. ఇక హిమ‌.. నాన్న మ‌న‌మే కావాలి అనుకున్నాడా.. మ‌నం వ‌స్తుంటే ఆపాడా.. ఉండ‌మ‌న్నాడా... నాన్న‌కు అమ్మ వ‌ద్దు, మ‌నం వ‌ద్దు. అందుకే ఉండ‌మ‌న‌లేదు. ఎందుకు వెళ‌తానంటున్నావు అని అంటుంది. ఇక దీప ద‌గ్గ‌ర‌కు వెళ్లే సౌర్య‌.. అమ్మ, నాన్న చాలా మంచివాడ‌మ్మా. న‌న్ను చాలా బాగా చూసుకున్నాడ‌మ్మా. ఏం అన‌లేద‌మ్మా. అంత పెద్ద డాక్టర్ కదా. నేను చెబితే రోడ్డు పక్కన టిఫెన్ కూడా తిన్నాడు. నేల మీద కూర్చొని అన్నం తిందామంటే కూడా తిన్నాడు. పైన చెయ్యి వేసి పడుకున్నా తీసేయలేదు. ఎంత మంచోడ‌మ్మా నాన్న‌, ఎలా వ‌దిలి రావాల‌మ్మా, ఎలా దూరంగా ఉండాల‌మ్మా. ఇన్ని రోజులు నువ్వు ఏం చెప్పావ‌మ్మా. నానమ్మ ఏం చెప్పింది. అంద‌రూ క‌లిసిపోయే రోజు వ‌స్తుంద‌నే క‌దా చెప్పారు. ఏది రాలేదే. ప‌దేళ్ల నుంచి ఆ రోజు కోస‌మే క‌ద‌మ్మా ఎదురుచూశాను. మ‌రి రాలేదేం. ఇంకా రాద‌మ్మా నాకు అర్థ‌మైపోయింది అని ఏడుస్తూ ఉంటుంది.
  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika deepam telugu serial, Television News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు