హోమ్ /వార్తలు /సినిమా /

Karthika deepam: రిపోర్ట్‌ల విష‌యంలో కార్తీక్ వెనుక‌డుగు.. మోనిత మాట‌ల‌ను వినేసిన కార్తీక్

Karthika deepam: రిపోర్ట్‌ల విష‌యంలో కార్తీక్ వెనుక‌డుగు.. మోనిత మాట‌ల‌ను వినేసిన కార్తీక్

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

అప్పటికే తన పిల్లలు హిమ,శౌర్యలను తన భర్త దగ్గరికి చేరుస్తుంది వంటలక్క. సీరియల్‌కు మెయిన్ విలన్ అయిన మోనిత డాక్టర్ బాబు దక్కలేదనే బాధతో ఆత్మహత్య చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పట్లో ఈ సీరియల్ ముగింపు ఊహించడం కష్టమే.

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో భోజ‌నం కోసం కూర్చున్న హిమ‌, సౌర్య‌లు ముర‌ళీకృష్ణ‌ను ఇమిటేట్ చేస్తుంటారు. దాంతో అమ్మా గ‌డుగ్గాయిలు న‌న్నే ఆట‌ప‌ట్టిస్తారా.. నా కూతురిని నేను అమ్మా దీప అని పిల‌వ‌క, నాన్నా దీప అని పిలుస్తానా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. పిల్ల‌లిద్ద‌రు న‌వ్వుతారు.

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో భోజ‌నం కోసం కూర్చున్న హిమ‌, సౌర్య‌లు ముర‌ళీకృష్ణ‌ను ఇమిటేట్ చేస్తుంటారు. దాంతో అమ్మా గ‌డుగ్గాయిలు న‌న్నే ఆట‌ప‌ట్టిస్తారా.. నా కూతురిని నేను అమ్మా దీప అని పిల‌వ‌క, నాన్నా దీప అని పిలుస్తానా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. పిల్ల‌లిద్ద‌రు న‌వ్వుతారు. దాంతో దీప‌.. ఇక్క‌డ‌కు వ‌చ్చాక వాళ్ల మొహంలో న‌వ్వు క‌నిపించింది ఇవాళే నాన్న అన‌గా.. అర్థ‌మైంద‌మ్మా. ఎవ‌రు లేరు, ఎవ‌రు రారు అనుకున్న పిల్లల‌కు నేను క‌నిపించ‌డం వ‌ల్ల కాస్త ఊర‌ట అనిపించి ఉంటుంది అని ముర‌ళీకృష్ణ అంటాడు. నువ్వు వ‌చ్చేట‌ప్పుడు నాన్న‌ను చూశావా తాత‌య్య అని హిమ అడ‌గ్గా.. నాన్న ఎలా ఉన్నాడు తాత‌య్య, హిమ‌ను మాత్ర‌మే గుర్తు చేసుకుంటున్నాడా, ఈ రౌడీని కూడా గుర్తు చేసుకుంటున్నాడా అని సౌర్య అడుగుతుంది. ఆ మాట‌ల‌కు ముర‌ళీకృష్ణ.. మీ నాన్న ఉండే భ‌వంతికి, నేను ఉండే చిన్న ఇంటికి చాలా దూరం ఉంద‌మ్మా. అందుకే మీ నాన్న‌ను చూడ‌లేక‌పోయాను అని అంటాడు. నాన్న మంచి వాడా, చెడ్డ వాడా తాత‌య్య అని సౌర్య అడ‌గ్గా.. ముర‌ళీకృష్ణ కార్తీక్ మాట‌ల‌ను గుర్తు చేసుకుంటుంటాడు. ఇక హిమ‌.. నాన్న మంచి వాడే అని చెబుతుంది. మ‌రి మ‌న‌మెందుకు ఇక్క‌డ ఉన్నాము అని సౌర్య అడ‌గ్గా.. అంటే అమ్మ‌నే క‌దా మ‌న‌ల‌ను తీసుకొచ్చింది అని హిమ అంటుంది.

  తీసుకొచ్చేట‌ప్పుడు మ‌న‌ల‌ను ఆప‌లేద‌ని నువ్వే కదా అన్నావు అని సౌర్య అన‌గా.. ఆప‌క‌పోతే చెడ్డ‌వాడా అని హిమ అంటుంది. మీ నాన్న ఎలాంటి వాడో మీ అమ్మే చెప్పాల‌మ్మా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. దేవుడి లాంటి వాడ‌మ్మా. నోరు తెరిచి పిలిచిన‌వెంట‌నే ప‌లుకుతాడు. ఆయ‌న‌కు న‌చ్చిన భ‌క్తుల‌కే వ‌రాలిస్తాడు, ద‌ర్శ‌న‌మిస్తాడు. దేవుడికి క‌రుణ క‌లిగినా, ఆగ్ర‌హం క‌లిగినా వ‌రాల‌కు, శాపాల‌కు కొద‌వే ఉండ‌దు అని దీప అంటుంది. మాకేం అర్థం కాలేదు అని హిమ అన‌గా.. ఇంత వ‌య‌సు, అనుభ‌వం ఉన్న నాకే మీ నాన్న అర్థం కాలేదమ్మా అని ముర‌ళీకృష్ణ అంటాడు. వీళ్ల‌కు ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నాన్న‌నే గుర్తు వ‌స్తున్నాడు నాన్న. నాన్న ఙ్ఞాప‌కాల నుంచి బ‌య‌ట‌ప‌డేల‌క పోతున్నారు అని దీప అన‌గా.. నాన్న మ‌మ్మ‌ల్ని బాగా చూసుకున్నారు క‌దా అమ్మా అని సౌర్య అంటుంది. నేనేం కాద‌న‌డం లేద‌మ్మా. దానికి దీప‌.. నేను దూరం అయినా మీ నాన్న‌ను ద్వేషించండి అని నేను ఎప్ప‌టికీ చెప్ప‌ను. ప్రేమించండి. మీ ప్రేమ‌నే మీ నాన్న‌ను లాక్కొని వ‌స్తుంది. దేవుడు ఏదో ఒక మార్గం చూపించి మీ నాన్న‌ను మ‌న ద‌గ్గ‌ర‌కు చేరుస్తాడు అని అంటుంది.

  ఇక కార్తీక్ మాట‌ల‌ను గుర్తుచేసుకునే మోనిత ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అక్క‌డ‌కు ప్రియ‌మ‌ణి వ‌చ్చి.. మీరు కోప్ప‌డ‌నంటే కొన్ని నిజాలు చెబుతాన‌మ్మా అని అంటుంది. అందుకు మోనిత హు అన‌గా.. వంట మ‌నిషి ఏంటి సొంత మ‌నిషిలా మాట్లాడుతుంది అని మ‌న‌సులో పెట్టుకోకండ‌మ్మా. కార్తీక్ అయ్య చెప్పుకోవ‌డానికి లేక మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాడు గానీ మీరే దిక్కు అని మాత్రం ఇక్క‌డ‌కు రావ‌డం లేద‌మ్మా. మీరేమో ఏం చేస్తే కార్తీక్ అయ్య‌కు న‌చ్చుతానా అని ఆలోచిస్తారు. కానీ కార్తీక్ అయ్య ఏమో మీరు ఏం చేస్తే ఆయ‌న‌కు మంచి అవుతారా అని ఆలోచిస్తున్నారు. ఏనాడు అయినా కార్తీక్ అయ్య ఆయ‌నంత‌కు ఆయ‌నే మీకు ఐల‌వ్ యూ చెప్పారా అమ్మా. మీరు సిగ్గు విడిచి ఎన్ని సార్లు చెప్పినా.. హిమ‌ను తీసుకొస్తే మాత్ర‌మే మిమ్మ‌ల్ని పెళ్లి చేసుకుంటా అని అన్నారు. అంటే ఆయ‌న‌కు హిమ ముఖ్యం కానీ మీరు కాద‌మ్మా. మీరు పెళ్లి కోసం క‌ల‌లు కంటూ హిమ‌ను తీసుకురావ‌డానికి వెళ్లారు. తీసుకురాలేదు. అంటే మిమ్మ‌ల్ని కార్తీక్ అయ్య పెళ్లి చేసుకోడు క‌ద‌నే అమ్మా. మీ మీద ఆయ‌నే ఉంటే మ‌ధ్య‌లో హిమ ఎందుకమ్మా. ఆయ‌న త‌ల‌చుకోగానే మీకు తాళి క‌ట్టేయొచ్చు క‌దా. ఏనాడు అయినా మీతో ప్రేమ‌గా మాట్లాడారా.. మీరు మాట్లాడిస్తే మాట్లాడుతారు. మీ ద‌గ్గ‌ర త‌ల్లిని, పెళ్లాన్ని చెరో భుజాన పెట్టుకొని మోస్తూ ఉంటాడు. వాళ్ల‌ను మీరు ఏమైనా అంటే ఒప్పుకోరు. ఈ మ‌ధ్య‌న మీరు ఏమైనా చెప్తే వింటున్నారా.. ఈ చెవిలో విని ఈ చెవిలో వ‌దిలేస్తున్నారు. ఏదైనా మాట వ‌స్తే ముందు మీరే ఫోన్ చేసి చెప్పాలి త‌ప్ప‌, ఆయ‌న మాత్రం ఫోన్ చేయ‌రు. ఇంటికి రండి పదిసార్లు బ్ర‌తిమ‌లాడితే ఒక్కసారి వ‌స్తాడు. అదే త‌న‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే మాత్రం పూట‌కోసారి వ‌స్తాడు. ఆయ‌న మీ ప్రేమ‌ను అడ్డం పెట్టుకొని మిమ్మ‌ల్ని ఎండాకాలంలో విస‌న‌క‌ర్ర‌లాగా, వ‌ర్షాకాలంలో గొడుగులాగా వాడేసుకుంటున్నారు అమ్మా. హిమ కోసం ఏదైనా చేసేస్తాడు క‌దమ్మా. అందుకే హిమ‌ను తీసుకొస్తే మిమ్మ‌ల్ని చేసుకుంటా అని చెప్పాడు. హిమ గ‌ట్టిగా చెప్తే దీప‌ను ఏలుకోడ‌ని గ్యారెంటీ ఏంట‌మ్మా. నాకు ఏదో భ‌యంగా ఉంద‌మ్మా. మ‌న‌సు కీడు శంకిస్తుంద‌మ్మా మీకు ఏదైనా జ‌రుగుతుంద‌ని అని అంటుంది. ఆ మాట‌లతో మోనిత టెన్ష‌న్ ప‌డుతుండ‌గా.. అమ్మా ఏమైంది. కార్తీక్ అయ్య‌కు ఫోన్ చేయ‌మంటారా అని ఫోన్ తీసుకుంటుంది. ఇక ఫోన్‌ను తీసుకొని వేరే డాక్ట‌ర్‌కి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది. ఆ త‌రువాత థ్యాంక్యు డాక్ట‌ర్ నేను తెప్పించుకుంటాను అని చెప్పి ప్రియ‌మ‌ణికి డ‌బ్బులు ఇచ్చి మెడిక‌ల్ షాప్‌కు పంపుతుంది. ఆ త‌రువాత మోనిత టెన్ష‌న్‌తో.. అయిపోయిందా. నేను క‌ట్టుకున్న ఆశ‌ల సౌధం కూలిపోనుందా అని అనుకుంటుంది.

  ఇక టెస్ట్ రిజ‌ల్ట్ కోసం కార్తీక్ ఆసుప‌త్రికి వెళ‌తాడు. బ‌య‌ట ఆగి ఒక‌వేళ రిపోర్ట్స్ ఎప్ప‌టిలాగే నాకు పిల్ల‌లు పుట్ట‌ర‌ని వ‌స్తే సౌర్య‌ను, హిమ‌ను తెచ్చుకోవ‌డానికి మ‌మ్మీ ఎప్ప‌టికీ ఒప్పుకోదు. ఇంత‌కాలం నెత్తిన పెట్టుకొన్న దీప‌ను కూడా పిల్ల‌ల‌తో స‌హా ద్వేషించి దూరం పెట్టుకుంటుంది. ఈ జీవితంలో పిల్ల‌ల‌ను నేను చూడ‌కుండా చేస్తుంది. పిల్ల‌లు లేక‌పోతే, రాక‌పోతే, నాన్న అని పిల‌వ‌క‌పోతే నేను ఎలా ఉండ‌గ‌ల‌ను. అన‌వ‌స‌రంగా నేను టెస్ట్‌లు చేయించుకున్నాను. ఇక్క‌డకు రాకుండా ఉండాల్సింది. అదే బెట‌ర్‌. రిపోర్ట్‌లో ఏ రిజ‌ల్ట్ వ‌చ్చినా నేను వెళ్లి వాటిని చూడ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్. నా మ‌న‌సులో ఏం ఉండ‌దు, మ‌మ్మీకి ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు అని వెనుదిరుగుతాడు. ఆ త‌రువాత ఆ హాస్పిట‌ల్‌కి మోనిత వ‌చ్చి.. ఇదే హాస్పిట‌ల్‌లో కార్తీక్ టెస్ట్‌లు చేయించుకుంటున్నాడు. కానీ రిపోర్ట్స్ తారు మారు చేయాలంటే ల్యాబ్ వాళ్లు, డాక్ట‌ర్లు అంద‌రూ కార్తీక్‌కి తెలిసిన వాళ్లే. ఏం చేయాలి. ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ త‌రువాత అదే చేయాలి. నేను అనుకున్న‌దే చేయాలి. రిస్క్ అయినా స‌రే నా జీవితాన్ని ప‌ణంగా పెట్టి అదే ప‌ని చేస్తా. బేసిక్‌గా నేను డాక్ట‌ర్‌ని కాబ‌ట్టి కార్తీక్‌కి క్లోజ్ ఫ్రెండ్‌ని కాబ‌ట్టి వీళ్ల‌కు ఎలాంటి అనుమానం కూడా రాదు అని బ‌య‌ట‌కు దిగి హాస్పిటల్ లోకి వెళుతుంది.

  ఇక దీప టిఫిన్ సెంట‌ర్ ద‌గ్గ‌ర బిజీబిజీగా జ‌రుగుతూ ఉంటుంది. చూశావా అమ్మా క‌స్ట‌మ‌ర్లు ఎంత‌మంది పెరిగారో ఇదంతా నీ చేతి చ‌లువ అని ముర‌ళీకృష్ణ అన‌గా.. ఇదంతా అత్త‌మ్మ బ్రెయిన్ చ‌లువ అని దీప అంటుంది. అదేంట‌మ్మా అని ముర‌ళీకృష్ణ అన‌గా.. ఒక‌రోజు వార‌ణాసికి తెలిసిన వాళ్లు కార్లో వ‌చ్చేలా చేయ‌మ‌న్నాను తాత‌య్య అని జ‌రిగిన దాన్ని చెబుతుంది. దానికి ముర‌ళీకృష్ణ అమ్మ‌నా మ‌న‌వ‌రాలా అన‌గా.. అమ్మ‌నా వియ్య‌పురాలా అను. అన్నీ మా అత్త‌య్య గారి తెలివితేట‌లే నాన్న అని దీప అంటుంది. ఇక హిమ‌.. నేను సౌర్య అని పిల‌వ‌కుండా నాన‌మ్మ అని పిలుస్తాను అని అనగా.. అప్పుడు నేను నిన్ను ఏమే పొట్టి బుడంకాయ్(సౌంద‌ర్య హిమ‌ను పిలిచే పేరు) అని పిలుస్తా అని సౌర్య అన‌గా.. నేను నాన్న లాగా ఏమే రౌడీ అంటా అని హిమ అంటుంది. పిల్ల‌లిద్ద‌రు తిన్నాక వారిని లోప‌లికి వెళ్ల‌మంటుంది దీప‌.

  ఆ త‌రువాత ముర‌ళీకృష్ణ ఏంట‌మ్మా ఇది. ఆ ప‌నివాళ్ల‌కు నాన్న‌ను మ‌రిపించడం చాలా క‌ష్టం అయ్యేలా ఉంది. ఇటు చూస్తే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అని అంటాడు. దానికి దీప‌.. ఎక్క‌డికి నాన్న‌. పిలిస్తే వెళ్లే ప‌ని అయితే వ‌చ్చేదాన్నే కాదు. అక్క‌డ ఉంటే ప‌ని అయితే ఇన్ని తిప్ప‌లు ఎందుకు ప‌డ‌తాను అని అంటుంది. కాద‌మ్మా పిల్ల‌లు కోటీశ్వ‌రుల వార‌సులు. వాళ్లు అనుభ‌వించాల్సిన భోగ‌భాగ్యాలు నువ్వే దూరం చేస్తున్నావేమో. ఆత్మ‌గౌర‌వానికి పోయి నువ్వే వాళ్ల‌ను పేద‌రికంలో పెంచుతున్నావేమో అని ముర‌ళీకృష్ణ అన‌గా.. అవును నాన్న‌, త‌ప్పే ఒప్పుకుంటాను. కానీ డాక్ట‌ర్ బాబు ఆ పిల్ల‌లు నా పిల్లలు అని ఎప్పుడూ అనుకోలేదు. ఒక‌రిని పెంచుకున్నాను అనుకుంటున్నాడు. ఇంకొక‌రిపైన అభిమానం పెంచుకున్నాను అనుకుంటున్నాడు. నిజం తెలుసుకునే దాకా వాళ్లు ఆయన దృష్టిలో ఆయ‌న పిల్ల‌లే కాదు. ప‌రాయి పిల్ల‌లు అని దీప చెబుతంది.

  అయితే వారి మ‌న‌సు నుంచి పూర్తిగా తండ్రిని దూరం చేయాల‌నుకుంటున్నావా అని ముర‌ళీకృష్ణ అడ‌గ్గా.. లేదు నాన్న‌., అది నా వ‌ల్ల కాద‌ని నాకు తెలుసు. ఇక్క‌డే ఉంటే ఏ రోజు అయినా నాన్న వ‌స్తారనే ఆశ‌తో ఉంటారు. అదే అక్క‌డుంటే ఏ రోజుకు నాన్న మార‌డు అని అభిప్రాయానికి వ‌చ్చి ద్వేషం పెంచుకుంటే పాపం, వాళ్ల నాన్న ఏమైపోతాడు నాన్న. వాళ్ల భ‌విష్య‌త్ ఏమైపోతుంది అని దీప అంటుంది.

  మ‌రోవైపు సౌంద‌ర్య ఇంట్లో అంద‌రూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆనంద‌రావు.. మౌనం రాజ్య‌మేలుతుంది అని అన‌గా.. ఆ రాజ్యాన్ని ప‌రిపాలించే మ‌గ‌మ‌హ‌రాజు మ‌న సుపుత్రుడే అని సౌంద‌ర్య అంటుంది. మ‌ధ్య‌లో నేనేం చేశాను రాజ‌మాత గారు అని కార్తీక్ అన‌గా.. నిరంకుశ పాల‌న మొద‌లుపెట్టావు సుపుత్రా అని సౌంద‌ర్య అంటుంది. దానికి కార్తీక్.. రాజ‌దండం నీ చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. అందుకే నేనేం చేస్తాను అని అన‌గా.. నీకో దండం, నేను నీతో వాదించ‌లేను నాయ‌నా అని సౌంద‌ర్య అన‌గా.. అప్పుడు మ‌ళ్లీ మౌనం రాజ్య‌మేలుతుంది అని కార్తీక్ అంటాడు. ఇక ఆనంద‌రావు.. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంత డ‌బ్బు ఉండి, ఇంత ఇన్ఫ్యూయెన్స్ ఉండి, నా కోడ‌లు, మ‌న‌వ‌రాళ్లు ఎక్క‌డ ఉన్నారో వెతికి తీసుకురాలేక‌పోతున్నాము అని అన‌గా.. పేప‌ర్లో ప్ర‌క‌ట‌న ఇస్తే అని శ్రావ్య అన‌గా.. అమ్మో అన్న‌య్య కిరీటం ప‌డిపోతుంది అని ఆదిత్య అంటాడు.

  ఇక ఆనందరావు.. ఆదిత్య బీ సీరియ‌స్ అన‌గా.. నువ్వు ఏదైనా చెప్పాల‌నుకుంటే అన్న‌య్య‌కు చెప్పు డాడీ. బీ సీరియ‌స్ అని ఆదిత్య అంటాడు. పిల్లలు చిరిగిన బ‌ట్ట‌ల‌తోనే అర్దాక‌లితోనే ఉంటే అప్పుడు బావుంటుదారా అని సౌంద‌ర్య అన‌గా.. నీ కోడ‌లు అది ప‌స్తులు ఉన్నా వాళ్ల‌కు ఆ గ‌తి రానివ్వ‌దు అని కార్తీక్ అంటాడు. దీప‌ను అంత‌లా అర్థం చేసుకున్నావా అని ఆనంద‌రావు అన‌గా..భార్య‌గా త‌ప్పు చేసి ఉండొచ్చు. త‌ల్లిగా ఎప్ప‌టికీ త‌ప్పు చేయదు అని కార్తీక్ అన‌గా.. తండ్రిగా నువ్వు ఎప్పుడు త‌ప్పు చేయ‌లేదా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. పెంచిన తండ్రిగా త‌ప్పు చేశాను. హిమ‌ను ఆపేయాల్సింది. హిమ‌తో పాటు సౌర్య‌ను ఆపాల్సింది అని కార్తీక్ అంటాడు. దానికి శ్రావ్య‌.. త‌ల్లిని, బిడ్డ‌ల‌ను వేరు చేస్తే మా అక్క ఇంక ఏం చూసుకొని బ‌తుకుతుంది బావ‌గారు అని అడుగుతుంది. దానికి కార్తీక్.. ఆమె జీవితానికి నేను భ‌రోసా ఇస్తాను, సగం ఆస్తి రాసిస్తాను అని అంటాడు. ఇక ఆనంద‌రావు.. ఈ ముక్క నేను ఏనాడో చెప్పాను. ఆస్తి కావాల‌నుకుంటే అప్పుడే తీసుకునేది అని అన‌గా.. అయితే ఇప్పుడు కేవ‌లం న‌న్ను సాధించ‌డానికే వెళ్లింది. పిల్లలను దూరం చేస్తే నా మొగుడే చ‌చ్చిన‌ట్లు దిగొస్తాడు అనుకుంది. దీప వంట‌ల‌క్క‌గా తెలిసిన‌ప్పుడే దానికి దూరంగా తీసుకెళ‌తానంటే హిమ దిగులుతో ప్రాణాల మీద‌కు తెచ్చుకుంది. ఇప్పుడు ఇన్నేళ్లు పెంచిన ఈ తండ్రిపై బెంగ‌తో హిమ మ‌ళ్లీ ప్రాణాల‌పైకి తెచ్చుకుంటే హిమ కోసం నేను దిగొచ్చి దీప‌ను తెచ్చుకుంటాన‌ని దీప ఆశ‌ప‌డుతుంది. అది పిల్ల‌ల‌ను అడ్డుపెట్టుకొని నాతో క‌న‌ప‌డ‌ని బేరం మొద‌లుపెట్టింది అని కార్తీక్ అంటాడు. వెంట‌నే ఆనంద‌రావు.. వీడు మార‌డు. ఆ మాట‌లు మార‌వు, ఆ అభిప్రాయాలు మార‌వు. కంఠ‌శోస త‌ప్ప ఏమీ ఉండ‌దు. ఇక్క‌డే ఉంటే నాకు బీపీ పెరగ‌డం త‌ప్ప ఏమీ ఒర‌గ‌దు. క‌న‌ప‌డిన బేరం మొద‌లుపెట్టిన నా కోడ‌లు క‌ళ్లెదురుగా క‌న‌ప‌డ‌కుండా ఎక్క‌డికి వెళ్లిపోతుందో కూడా ఆలోచించ‌ని ఈ అఙ్ఞానితో నేను వాదించ‌ను అని లేచి వెళ‌తాడు. ఆ త‌రువాత సౌంద‌ర్య‌.. ఒరేయ్ ఙ్ఞానిలా ఫీల్ అయ్యే అఙ్ఞాని మీ నాన్న అడిగిన దానికి స‌మాధానం చెప్ప‌రా.. అస‌లు ఎక్క‌డుందో తెలీకూడ‌ద‌నే క‌దా అది ఫోన్లు ఆపేసుకొని అఙ్ఞానంలో ఉంది. దానికి పిల్ల‌లు భారం అనుకుంటే క‌దా బేరం మొద‌లుపెట్టేది. నువ్వేరా పెంచిన ప్రేమ‌ను అడ్డం పెట్టుకొని, పిల్ల‌ల‌ను లాక్కిని త‌ల్లిని దాని చావు అది చ‌స్తుందిలే అనుకుంటున్నావు. ఆస్తి రాసిస్తాను అనుకుంటున్నావా.. అది తీసుకుంటుందా.. తీసుకోదు అని నీకు తెలీదా.. అస‌లు ఆస్తి కోసం పిల్ల‌ల‌ను అమ్ముకునేంత నీచానికి దిగ‌జార్చ‌కు రా ఒక అమ్మ‌ను అని సౌంద‌ర్య అంటుంది. దానికి కార్తీక్.. నా బిడ్డ కావాలంటే ఏం చేయాలో, ఇంకేం చెప్పాలో నాకు తెలీడం లేదు మ‌మ్మీ. నేను ఏమైనా పిల్ల‌ల‌ను అన్యాయం చేశానా.. హిమ అనాథ అని తెలిసిన‌ప్పుడు ఎంత ప్రేమించాను. అది దీప కూతురు అని తెలిసిన‌ప్పుడు కూడా అంతే ప్రేమించాను క‌దా. సౌర్య‌, దీప కూతురు అని తెలిసినా దాన్ని ఏనాడు అయినా బాధ‌పెట్టే మాట‌లు అన్నానా అని అడుగుతాడు. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో దీప ఎక్క‌డుంతో మోనిత‌, ప్రియ‌మ‌ణికి చెబుతుండ‌గా కార్తీక్ వింటాడు. పిల్ల‌ల కోసం కార్తీక్ విజ‌య‌న‌గ‌రం బ‌య‌లుదేరుతాడు.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు