హోమ్ /వార్తలు /సినిమా /

Karthika deepam: మోనిత గురించి నిజాలన్నీ చెప్పేసిన అంజి.. కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్

Karthika deepam: మోనిత గురించి నిజాలన్నీ చెప్పేసిన అంజి.. కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో అంజిని చూసిన కార్తీక్.. అత‌డిని మోనిత ద‌గ్గ‌రికి తీసుకెళ్లాల‌నుకుంటున్నాడు. ఆ త‌రువాత‌ అంజి బండిని ప‌క్క‌కు ఆప‌మ‌ని.. కారులో ఎక్క‌మ‌ని చెబుతాడు. ఎక్క‌డికి, ఎందుకు అని అంజి అడ‌గ్గా.. చెప్తేగానీ ఎక్క‌వా అని కార్తీక్ అంటాడు

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో అంజిని చూసిన కార్తీక్.. అత‌డిని మోనిత ద‌గ్గ‌రికి తీసుకెళ్లాల‌నుకుంటున్నాడు. ఆ త‌రువాత‌ అంజి బండిని ప‌క్క‌కు ఆప‌మ‌ని.. కారులో ఎక్క‌మ‌ని చెబుతాడు. ఎక్క‌డికి, ఎందుకు అని అంజి అడ‌గ్గా.. చెప్తేగానీ ఎక్క‌వా అని కార్తీక్ అంటాడు

Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో అంజిని చూసిన కార్తీక్.. అత‌డిని మోనిత ద‌గ్గ‌రికి తీసుకెళ్లాల‌నుకుంటున్నాడు. ఆ త‌రువాత‌ అంజి బండిని ప‌క్క‌కు ఆప‌మ‌ని.. కారులో ఎక్క‌మ‌ని చెబుతాడు. ఎక్క‌డికి, ఎందుకు అని అంజి అడ‌గ్గా.. చెప్తేగానీ ఎక్క‌వా అని కార్తీక్ అంటాడు

ఇంకా చదవండి ...

  Karthika Deepam: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. శ‌నివారం నాటి ఎపిసోడ్‌లో అంజిని చూసిన కార్తీక్.. అత‌డిని మోనిత ద‌గ్గ‌రికి తీసుకెళ్లాల‌నుకుంటున్నాడు. ఆ త‌రువాత‌ అంజి బండిని ప‌క్క‌కు ఆప‌మ‌ని.. కారులో ఎక్క‌మ‌ని చెబుతాడు. ఎక్క‌డికి, ఎందుకు అని అంజి అడ‌గ్గా.. చెప్తేగానీ ఎక్క‌వా అని కార్తీక్ అంటాడు. నేను డ్రైవ్ చేస్తాను స‌ర్ అని అంజి అన‌గా.. నాకు డ్రైవింగ్ వ‌చ్చు వ‌చ్చి కూర్చో అని పుర‌మాయిస్తాడు. ఇక వారిద్ద‌రు మోనిత ఇంటికి వెళ‌తారు. మ‌రోవైపు దీప ఇంటికి సౌంద‌ర్య వెళుతుంది. లోప‌లికి వెళ్లి లైట్ వేసి చూడ‌గా.. అంతా ఖాళీగా ఉంటుంది. దాంతో దీప ఎక్క‌డికో వెళ్లిపోయింద‌ని తెలుసుకున్న సౌంద‌ర్య‌.. దీప దీప అంటూ కుమిలిపోతుంటుంది. ఆ ఇంట్లో ఙ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక సౌంద‌ర్య కారును చూసి స‌రోజ‌ అటుగా వ‌స్తుంది. వ‌చ్చారా అమ్మా. ఇప్పుడు వ‌చ్చారా అని స‌రోజ అడ‌గ్గా.. నా కోడ‌లు ఎక్క‌డ అని సౌంద‌ర్య ప్ర‌శ్నిస్తుంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందా అమ్మ అని స‌రోజ అంటుంది. ఇల్లు మారిపోయిందా అని సౌంద‌ర్య అడ‌గ్గా.. మ‌న‌షే మారిపోయింద‌మ్మా. ఏ మాట అడిగినా చెప్ప‌లేదు. మౌనంగా ఉంది. ఇల్లే కాదు ఊరే మారిపోయిన‌ట్లు ఉంది. ఇంటి ఓన‌ర్‌కి ఇవ్వాల్సిన డ‌బ్బులు కూడా ఇచ్చి వెళ్లిపోయింది. ఎక్క‌డికి అని ఎంత‌గా అడిగినా చెప్ప‌లేదు. వార‌ణాసి మీకు ఫోన్ చేస్తాన‌న్నా ఒప్పుకోలేదు. దీప ఎంత వ‌ద్ద‌న్నా వాడు కూడా వాళ్ల‌తో పాటే వెళ్లిపోయాడ‌మ్మా అని స‌రోజ చెబుతుంది. ఆ మాట‌ల‌తో సౌంద‌ర్య వెళ్ల‌మ‌ని స‌రోజకు సైగ‌లు చేసి ఏడుస్తూ ఉంటుంది. దీప‌కు, పిల్ల‌ల‌కు చెప్పిన విష‌యాల‌ను.. కార్తీక్, దీప మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ను, దీప ఇంటి నుంచి వెళ్లిపోయిన స‌న్నివేశాల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది.

  ఆ త‌రువాత స్టుపిడ్. ఎంత ప‌ని చేశావే. ఇంత‌కంటే ఇంకేం చేస్తావు. ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురుచూసి చూసి నీ స‌హ‌నం హ‌ద్దులు దాటి, గుండె ప‌గిలి, మ‌న‌సు విరిగి, విసిగిపోయి, వీసారిపోయి, వాడు ఎప్ప‌టికీ మార‌డ‌ని తెలిసిపోయి, అలిసిపోయి, వ‌ల‌స‌పోయి.. అయ్యో దీప. మ‌ళ్లీ నువ్వు చీక‌ట్లోకే వెళ్లిపోయావా. నీ క‌న్నీటి ధార ఉప్పెనై మా వంశాన్నే ముంచేస్తే నీ ఉసురు త‌గిలి ఏమైపోతామే. దీప. ఈ అత్త కూడా నీ దృష్టిలో చ‌చ్చిపోయిందా.. ప‌సి బిడ్డ‌ల‌తో ఎలా బ‌తుకుతావే అనుకుంటూ గుండెను ప‌ట్టుకొని ఏడుస్తుంది. దీప ఇంటిని చూసుకుంటూ భార‌మైన గుండెతో కారులో వెనుదిరుగుతుంది సౌంద‌ర్య‌.

  ఇక ఆటోలో పిల్ల‌ల‌ను తీసుకొని దీప వెళుతూ ఉంటుంది. త్వ‌ర‌గా పోనీవు వార‌ణాసి మ‌న‌కు ట్రైన్‌కి టైమ్ అవుతుంది అని దీప చెప్ప‌గా.. మ‌ధ్య‌లో ఆ రోడ్డు త‌వ్వేసి ఉండ‌క‌పోతే ఈపాటికి రైల్వే స్టేష‌న్‌లో ఉండేవాళ్లం, చుట్టూ తిరిగి రావాల్సి ఉంది క‌దా అక్క అని వార‌ణాసి అంటాడు. ఆ త‌రువాత రోడ్డుకు అటువైపున కారు ఆగిపోవడంతో సౌంద‌ర్య‌ ఉంటుంది. దాన్ని చూసిన సౌర్య‌.. వార‌ణాసి ఆపు ఆపు అని ఆటోను ఆపుతుంది. ఏమైంద‌మ్మా అని వార‌ణాసి ప్ర‌శ్నిస్తాడు. ఏంటి అత్త‌మ్మా ఎందుకు ఆప‌మ‌న్నావు అని దీప అడ‌గ్గా.. నానమ్మ అంటూ సౌంద‌ర్య‌ను చూపిస్తుంది. వెంట‌నే వార‌ణాసి.. అక్కా డాక్ట‌ర్ బాబు మంచోడ‌క్కా. వెళ్లి సౌంద‌ర్య‌మ్మ‌తో మాట్లాడు అక్కా అని చెబుతాడు. ఇక హిమ‌.. వెళ్దాం అమ్మా. వెళ్లిపోతున్నామ‌ని చెబుదాం అని అన‌గా.. ఒక్క‌సారి క‌లిసి వెళ్లిపోదామ‌మ్మా. పాపం నాన‌మ్మ మ‌న అంద‌రి కోసం ఏడుస్తుందమ్మా అని సౌర్య అంటుంది. ఇక దీప‌.. ఆ దేవ‌త మొహం చూస్తే నేను ఆగిపోతాను. ఈ ప్ర‌యాణం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆగ‌కూడ‌దు. పోనివ్వు వార‌ణాసి అని అంటుంది. అక్కా అని వార‌ణాసి అన‌గా.. పోనివ్వు అని చెబుతుంది.

  మ‌రోవైపు అంజిని మోనిత ద‌గ్గ‌ర‌కు కార్తీక్‌ తీసుకువెళ్ల‌గా ఆమె షాక్‌కి గురి అవుతుంది. రా మోనిత అని పిలిచి.. చెప్పురా. నీకు మోనిత ఎలా తెలుసు, మోనిత గురించి ఏం తెలుసు, ఆ దీప‌కు ఏం చెప్పావు. మా అమ్మ‌కు ఏం చెప్పాల‌నుకున్నావు. అన్నీ బ‌య‌ట‌పెట్టేసేయ్ అని అంటాడు. ఇక మోనిత త‌డ‌బ‌డుతూ కార్తీక్ అని అంటుండ‌గా.. నువ్వు ఆగు మోనిత‌. మ‌ధ్య‌లో అడ్డు రాకు. నువ్వు చెప్పురా అని కార్తీక్ అంటాడు. దాంతో అంజి మ‌న‌సులో ఇంత‌కంటే మంచి అవ‌కాశం లేదు. ఈ రాక్ష‌సి గురించి నిజం తెలిస్తేనే డాక్ట‌ర్ బాబుకు దీప‌మ్మ అంటే ఏంటో తెలుస్తుంది. ఇంక ఏదీ దాచ‌ను అని అనుకుంటాడు. ఆ త‌రువాత బ‌య‌ట‌కు స‌ర్. త‌ప్పుకుండా చెబుతాను. ఈ నిజం బ‌య‌ట‌పెట్ట‌డం వ‌ల‌న ఎవ‌రికి మంచి జ‌రుగుతుందో, ఎవ‌రికి చెడు జ‌రుగుతుందో నాకు తెలీదు. కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఈ మోనిత మామూలు ఆడ‌ది కాదు స‌ర్. మీరు ప్రేమించిన హిమ‌ను నాచేత చంపించింది అని అంటాడు. ఏంటి అని కార్తీక్ అడ‌గ్గా.. అవును స‌ర్ మీరు అనుకున్న‌ట్లు హిమగారు యాక్సిడెంట్‌లో చ‌నిపోలేదు. యాక్సిడెంట్ చేయించి చంపించారు. ఆ యాక్సిడెంట్ చేసింది నేను. చేయించింది ఈ మోనిత‌. అందుకు నాకు డ‌బ్బు ఇచ్చింది అని మోనిత త‌న‌ను బెదిరించిన విష‌యాన్ని కూడా చెప్పేస్తాడు. ఇది స‌ర్ జ‌రిగింది. మీరు మోనిత‌ను న‌మ్మొద్దు స‌ర్. ఇంకా ఇంకా చాలా దారుణాలు చేస్తుంది స‌ర్. దీప‌మ్మ‌ను కూడా వ‌ద‌ల్లేదు. అస‌లు అని చెబుతుండ‌గా.. కార్తీక్ ఆపుతాడు.

  ఇక ఈ విష‌యం మా మ‌మ్మీకి చెప్పావా అని కార్తీక్ అడ‌గ్గా.. మీరే క‌దండి స‌ర్ చెప్ప‌నివ్వ‌లేదు అని అంజి అంటాడు. ఆ త‌రువాత నువ్వు న‌డిపిన లారీ ఓన‌ర్ ఎవ‌రు, వాడి పేరేంటి అని అడ‌గ్గా.. తెలీదు స‌ర్. ఆ లారీని ఈ మోనిత‌ను అరేంజ్ చేసింది స‌ర్ అని చెబుతాడు. నన్నూ చంప‌మందా, హిమ‌ను చంప‌మందా.. లేక‌పోతే ఇద్దరినీ చంప‌మందా అని కార్తీక్ ప్ర‌శ్నించ‌గా.. మిమ్మల్ని కాదు స‌ర్. ఆ హిమ‌ను చంప‌మంది అని అంజి అంటాడు. దాంతో కార్తీక్ అంజి చెంప మీద కొడ‌తాడు.

  ఆ త‌రువాత ఎవ‌రికీ రా నువ్వు క‌థ‌లు చెప్పేది. నీ చేతిలో ఉన్న‌ది రివాల్వ‌ర్ కాదురా. లారీ స్టీరింగ్ ఉంది. డ్యాష్ ఇస్తే ఇద్ద‌రూ చ‌చ్చిపోవాలి క‌దా. మ‌రి కొల‌త ప్ర‌కారం ఒక‌రినే చంప‌డం ఎలా సాధ్య‌మ‌నుకున్నావు అని కార్తీక్ అడ‌గ్గా.. అది కారు స‌ర్ అని ఏదో చెప్ప‌బోతాడు. వెంట‌నే మాట్లాడ‌కు. ఇప్ప‌టివ‌ర‌కు నువ్వు చెప్పిన క‌ట్టు క‌థ ఎందుకు విన్నానంటే. నువ్వు ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ తిరుగుతున్నావో ఒక అంచ‌నాకు రావ‌డానికి. ఆ దీప నీతో క‌లిసి ప్లాన్ చేసి ఇవ‌న్నీ చెప్పిస్తుంద‌ని పూర్తిగా అర్థ‌మైంది. ఇక నువ్వే కాదు. ఆ దేవుడు చెప్పినా విన‌ను అని కార్తీక్ అన‌గా.. మోనిత సంతోషంలో తేలిపోతుంది. ఆ త‌రువాత అంజి స‌ర్ అని అన‌గా.. రేయ్. నువ్వు మా మ‌మ్మీకి చెప్పేట‌ప్పుడు అడ్డుప‌డ్డాను నిజ‌మే. కానీ ఇన్ని రోజుల్లో నీకు ఒక్క‌సారి కూడా ఆవిడ‌కు చెప్ప‌డానికి అవ‌కాశం చిక్క‌లేదా. ఎందుకు చెప్ప‌లేదంటే నువ్వొక హంత‌కుడ‌ని చెప్పుకుంటే ఎక్క‌డ నీ ఉద్యోగంలో నుంచి తీసి పారేస్తుంద‌న‌న్న భ‌యం. ఎంత గొప్ప క‌థ అల్లారురా ఇద్ద‌రు క‌లిసి. వెళ్లి ఆ దీప‌కు చెప్పు. అల్లిన క‌థంతా చెప్పాను కానీ అత‌క‌లేద‌ని అవ‌త‌లికి పొమ్మాన్నాన‌ని చెప్పాన‌ని చెప్పు. వెళ్లు. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త పుకార్లు పుట్టించ‌కు. గెటౌట్ అని అంజిని తోసేస్తాడు. ఆ త‌రువాత మోనిత‌, అంజిని చూసి క‌నుబొమ్మ‌లు ఎగ‌రేస్తుంది. ఆ త‌రువాత దొంగ ఏడుపు ప్ర‌ద‌ర్శిస్తూ కార్తీక్‌ని హ‌త్తుకుంటుంది. కార్తీక్ మోనిత‌ను ఓదారుస్తుండ‌గా.. ఇదే క‌నుక నువ్వు న‌మ్మేసి ఉంటే నా ప్రేమ అంతా అబ‌ద్దం అయిపోయి ఉండేది. నీ దృష్టిలో నేను హంతకురాలిని అవుతాన‌న్న భ‌యం క‌న్నా. నా ప్రేమ‌ను అనుమానించే ప‌రిస్థితి వ‌చ్చి ఉండేది. ఇప్పుడు అర్థ‌మైందా. నా వెనుక ఎంత భ‌యంక‌ర‌మైన కుట్ర జ‌రుగుతుందో అని అంటుంది.

  ఇక వార‌ణాసి దీప‌, హిమ‌, సౌర్య‌ల‌కు టిఫిన్ తీసుకొస్తాడు. దాన్ని పిల్ల‌ల‌కు తినిపిస్తూ అన్ని విష‌యాల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక సౌర్య‌, హిమలు కూడా అన్నీ ఙ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కార్తీక్ మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ దీప ఏడుస్తుంది. ఇక రేప‌టి ఎపిసోడ్ ప్రోమోలో దీప ఊరు వ‌దిలి వెళ్లిపోయింద‌న్న విష‌యాన్ని సౌంద‌ర్య చెబుతుంది. దాంతో కార్తీక్ పిల్ల‌ల‌ను త‌ల‌చుకుంటూ క‌న్నీళ్లు పెట్టుకుంటాడు.

  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial, Television News

  ఉత్తమ కథలు