కార్తీక దీపం వంటలక్క దెబ్బ మాములుగా లేదుగా... దెబ్బకి రేటింగ్ ఢమాల్..

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దాదాపు సినిమా షూటింగ్స్‌లో పాటు సీరియల్స్ షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో చేసేది లేక పాత ప్రోగ్రామ్స్‌ను ప్రసారం చేస్తున్నాయి పలు టీవీ ఛానెళ్స్. తాజాగా కార్తీక దీపం ఎఫెక్ట్ స్టార్ మా ఛానెల్ పై పడింది.

news18-telugu
Updated: May 1, 2020, 8:38 AM IST
కార్తీక దీపం వంటలక్క దెబ్బ మాములుగా లేదుగా... దెబ్బకి రేటింగ్ ఢమాల్..
కార్తీక దీపం (Image: Hotstar)
  • Share this:
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దాదాపు సినిమా షూటింగ్స్‌లో పాటు సీరియల్స్ షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో చేసేది లేక పాత ప్రోగ్రామ్స్‌ను ప్రసారం చేస్తున్నాయి పలు టీవీ ఛానెళ్స్. ఇప్పటికే దూరదర్శన్‌లో ‘రామాయణం’, మహాభారతం’ సీరియల్స్‌ను ప్రసారం చేస్తున్నాయి. ఎన్నడు లేనంతగా కరోనా లాక్‌డౌన్ కారణంగా దూరదర్శన్ టీఆర్పీ రేటింగ్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. కానీ డేలీ సీరియల్స్‌ను నమ్ముకొని రన్ అవుతున్న తెలుగుతో పాటు పలు టీవీ ఛానెల్స్‌కు ఇపుడు కరోనా గడ్డు పరిస్థితులును కల్పించిందనే చెప్పాలి. ఇక తెలుగులో  స్టార్ మా చానల్ లో ప్రసారమయే కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని వారు తెలుగు ప్రేక్షకులు బహుశా ఉండరేమో. ఇంట్లో మగవాళ్లకు, పిల్లలకు ఈ సీరియల్ అంటే ఒకింత భయం అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సీరియల్ ప్రసారమయ్యే సమయంలో టీవీల్లో మరో ప్రోగ్రామ్స్‌ చూడాలంటే మగవాళ్లే  భయపడే పరిస్థితి దాదాపు అందరి ఇళ్లలోను తయారైంది. అంతలా ఈ డైలీ సీరియల్ తెలుగు మహిళ  ప్రేక్షకుల మనుసుల్లో చొచ్చుకుపోయింది. అంతగా తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది కార్తీ దీపం సీరియ‌ల్‌. ఈ సీరియల్ గత యేడాదిన్నరగా నెంబర్ వన్ టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ వస్తోంది. మధ్యలో  తోపు లాంటి సినిమాలు ఎన్ని ప్రసారమైన కార్తీక దీపిం సీరియల్ రేటింగ్‌ను మాత్రం దాటలేక కళ్లు తేలేసాయి.

karthika deepam,karthika deepam deepa vantalakka,Premi Viswanath,karthika deepam fame Premi Viswanath,karthika deepam deepa kasthuri,serial today episode, karthika deepam serial latest episode, karthika deepam today episode, karthika deepam serial, karthika deepam serial today, karthika deepam serial today episode live, karthika deepam, karthika deepam serial today episode full video, karthika deepam serial today episode review, karthika deepam serial today updates, karthika deepam serial latest updates, daily serial, star maa serial, 2nd december 2019, maa tv serial, today updates, karthika deepam serial today episode, karthika deepam serial latest episode, karthika deepam today episode, karthika deepam serial, karthika deepam serial today, karthika deepam serial today episode live, karthika deepam, karthika deepam serial today episode full video, karthika deepam serial today episode review, karthika deepam serial today updates, karthika deepam serial latest updates, daily serial, star maa serial, 2nd december 2019, maa tv serial, today updates,కార్తీక దీపం,కార్తీక దీపం వంటలక్క దీప,కార్తీక దీపం గృహలక్ష్మి సీరియల్,కస్తూరి గృహలక్ష్మి సీరియల్,ప్రేమి విశ్వనాథ్,కార్తీక దీపం ప్రేమి విశ్వనాథ్
కార్తీక దీపం వంటలక్క ప్రేమి విశ్వనాథ్ (Hot Star/Photo)


కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా సీరియల్ షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడటంతో ఈ సీరియల్ ప్రసారం చేసే స్టార్ మా ఛానెల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఎపుడు ఇండియాలో టాప్ టెన్‌లో ఉండే ఈ తెలుగు ఛానెల్‌ అందులో చోటు కోల్పోయింది. దాంతో తెలుగులో నెంబర్ వన్‌గా కొనసాగుతూ వస్తోన్న స్టార్ మా చానెల్ 2 నుంచి 3 స్థానానికి పడిపోయింది. ఇపుడు నెంబర్ వన్ ప్లేస్‌లో జెమిని టీవీ వచ్చింది. ఏమైనా కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన కార్తీక దీపం కారణంగా ఇపుడు స్టార్ మా  ఛానెల్ ఫస్ట్ ప్లేస్ గల్లంతయింది. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా కరోనా లాక్‌డౌన్ ఎపుడు ముగుస్తుందా.. ఎపుడు కార్తీక దీపం వంటలక్క సీరియల్ చూద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు.,
Published by: Kiran Kumar Thanjavur
First published: May 1, 2020, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading