Nirupam- Manjula: బుల్లితెరపై గత కొన్ని నెలలుగా టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్‌కి ఎంత క్రేజ్ ఉందంటే.. సినీ సెలబ్రిటీల ఇళ్లలో సైతం ఈ ధారావాహికకు అభిమానులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి కూడా ఈ సీరియల్ అంటే చాలా ఇష్టం. ఇక ఇందులో నటిస్తోన్న నిరుపమ్ పరిటాల(కార్తీక్), ప్రేమి విశ్వనాథ్(దీప), శోభా శెట్టి(మౌనిత), అర్చనా అనంత్(అర్చనా అనంత్)లకు బయట చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్రాధారులైన నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్‌లకు మంచి డిమాండ్ ఉంది.
ఇదిలా ఉంటే రియల్ లైఫ్‌లో నిరుపమ్ పరిటాల తన సహనటి మంజులను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చంద్రముఖి సీరియల్లో వీరిద్దరు కలిసి నటించారు. ఆ ఇద్దరికి ఇదే మొదటి సీరియల్ కాగా.. ఆ ధారావాహిక జరిగే సమయంలోనూ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. ఇక ఈ ఇద్దరు ప్రస్తుతం వారి వారి సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు.
కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంజుల తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో నిరుపమ్, మంజుల రామ్ రెడ్ చిత్రంలోని ఉండిపో పాటకు స్టెప్పులు వేశారు. ఈ వీడియోలో ఆ ఇద్దరి రొమాన్స్ అదిరిపోయింది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను నిరుపమ్, మంజుల చూపగా.. వారి అభిమానులను వీడియో బాగా ఆకట్టుకుంటోంది.