• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • KARTHIKA DEEPAM DOCTOR BABU NIRPAM PARITAL REVEALS ABOUT FANS FIRE ON KARTHIKA DEEPAM NR

Nirupam Paritala: నన్ను చాలామంది తిడుతున్నారు.. కార్తీకదీపం డాక్టర్ బాబు!

nirupam paritala

Nirupam Paritala: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ఎంతలా ఫాలోయింగ్ పెంచుకుందో చూస్తూనే ఉన్నాం. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ పై ఎంతో అభిమానం పెంచుకున్నారు.

  • Share this:
    Nirupam Paritala: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ఎంతలా ఫాలోయింగ్ పెంచుకుందో చూస్తూనే ఉన్నాం. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ పై ఎంతో అభిమానం పెంచుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. నిజం తెలుసుకొని కార్తీక్.. దీప ను కలుసుకున్న మరుక్షణమే మోనిత కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. దీంతో అభిమానులు ఈ సీరియల్ గురించి ఆశలు వదులుకున్నారు. ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు. అసలు వంటలక్క, డాక్టర్ బాబు లు కలుస్తారా లేదా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

    ఇదిలా ఉంటే కార్తీక్ ( నిరుపమ్ పరిటాల) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నగా ఈ సీరియల్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. కార్తీకదీపం సీరియల్ ఇంత క్లిక్ అవుతుందని తాను అనుకోలేదట. కేవలం మంచి కథ, మంచి రోల్ అని అనుకున్నాడట. ఈ విధమైన రెస్పాన్స్ ని, సక్సెస్ ను ఊహించుకోలేదట డాక్టర్ బాబు. వంటలక్క పాత్ర గురించి విన్నప్పుడు సక్సెస్ ఫార్ములా ఉందని నమ్మకం ఏర్పడిందట. కానీ ఇంతలా రెస్పాన్స్ అసలు ఊహించుకోలేదట.

    పైగా అతని మీద మీమ్స్, ట్రోల్స్ వస్తుంటే నాపై ఇలా పడ్డారా ఏంటి అనుకున్నాడట. అలా చాలా వాటికి నవ్వుకుంటాడట. ఇక తిట్టినప్పుడు బాగా ఫీల్ అవుతాడట. ఇక ఆయనను చాలా మంది తిడుతుంటారని, తనకు పర్సనల్ గా చాలామంది మెసేజ్ లు పెడుతుంటారని, తిడుతుంటారని అన్నాడు. కానీ అవన్నీ ఇష్టంతోనే చేయడంతో పెద్దగా పట్టించుకోనని తెలిపాడు.

    Karthika deepam
    Karthika deepam


    ఇక తను ఓవైపు డాక్టర్ బాబు పాత్ర మరోవైపు హిట్లర్ పాత్ర అందించినందుకు చాలా లక్ అని తెలిపాడు. ఈ మధ్యకాలంలో సక్సెస్ అనేది అంత ఈజీగా రావడం లేదంటూ.. టీవీ కి కూడా విపరీతమైన కాంపిటీషన్ వచ్చిందని తెలిపాడు. తనకు సక్సెస్ లభించింది అంటే ప్రేక్షకులు తన కష్టాన్ని గుర్తించారని తెలిపాడు. ఇక వంటలక్క ఆన్ స్క్రీన్ లో ఏడుస్తూ ఉంటుంది కానీ ఆఫ్ స్క్రీన్ లో చాలా సరదాగా ఉంటుందని తెలిపాడు. ఇక ఈ సీరియల్ ఎటు వెళుతుందో తనకు తెలియదని.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారో.. తను కూడా ఎక్కడ కనిపించినా మీరు వంటలక్క ఎప్పుడు కలుస్తారనే అడుగుతున్నారని తెలిపాడు. ఇక ఈ టైం లో వేరే సీరియల్స్ చేయడం కుదరదని.. తన అభిమానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను అంటూ తెలిపాడు డాక్టర్ బాబు.
    Published by:Navya Reddy
    First published: