హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam: డాక్ట‌ర్ బాబు కాంప్లిమెంట్.. వంట‌ల‌క్క నాటీ రిప్లై

Karthika Deepam: డాక్ట‌ర్ బాబు కాంప్లిమెంట్.. వంట‌ల‌క్క నాటీ రిప్లై

Nirupam Paritala

Nirupam Paritala

Karthika Deepam: తెలుగు బుల్లితెర‌పై గ‌త కొన్ని నెల‌లుగా టాప్ సీరియ‌ల్‌గా దూసుకుపోతోంది కార్తీక దీపం సీరియ‌ల్‌. స్టార్ మాలో ప్ర‌సారం అయ్యే ఈ సీరియ‌ల్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు. సామాన్యులే కాదు సెల‌బ్రిటీల ఇళ్ల‌లోనూ ఈ సీరియ‌ల్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు రేటింగ్‌లో టాప్ హీరోల సినిమాల‌కు పోటీని ఇస్తోంది కార్తీక దీపం

ఇంకా చదవండి ...

  Doctor Babu- Vantalakka: తెలుగు బుల్లితెర‌పై గ‌త కొన్ని నెల‌లుగా టాప్ సీరియ‌ల్‌గా దూసుకుపోతోంది కార్తీక దీపం సీరియ‌ల్‌. స్టార్ మాలో ప్ర‌సారం అయ్యే ఈ సీరియ‌ల్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు. సామాన్యులే కాదు సెల‌బ్రిటీల ఇళ్ల‌లోనూ ఈ సీరియ‌ల్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు రేటింగ్‌లో టాప్ హీరోల సినిమాల‌కు పోటీని ఇస్తోంది కార్తీక దీపం. ఇదిలా ఉంటే ఈ సీరియల్‌లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న నిరుప‌మ్ ప‌రిటాల‌, ప్రేమి విశ్వ‌నాథ్‌ల‌కు బ‌య‌ట మంచి క్రేజ్ ఉంది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క‌గా వీరిద్ద‌రిని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ఇద్ద‌రు అప్పుడ‌ప్పుడు షూటింగ్ విశేషాలను కూడా పంచుకుంటుంటారు. ఈ క్ర‌మంలో తాజాగా ప్రేమి విశ్వ‌నాథ్ తీసిన ఓ ఫొటోను షేర్ చేసిన నిరుప‌మ్.. దానికి ఓ కామెంట్ పెట్టారు.

  వంట‌ల‌క్క చేసిన వంట ఎలా ఉంటుందో అంత ఐడియా లేదు కానీ.. తీసిన ఫొటోలు మాత్రం బానే ఉంటాయి అని నిరుప‌మ్ కామెంట్ పెట్టారు. దానికి వంద‌లో ఒక‌టి రాక చ‌స్తుందా అంటూ ఫ‌న్నీ కామెంట్‌ని కూడా జ‌త చేశారు. ఇక ఈ ఫొటో అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటుండ‌గా.. కార్తీక్ పెట్టిన కామెంట్‌కి ప్రేమి విశ్వ‌నాథ్ నాటీ రిప్లై ఇచ్చారు.

  మా డాక్ట‌ర్ బాబు బంగారం అంటూ ఆమె కామెంట్ పెట్టారు. ఇప్పుడు వీరిద్ద‌రి క‌న్వ‌ర్జేష‌న్ కార్తీక దీపం అభిమానుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. కాగా ఈ సీరియ‌ల్‌కి త్వ‌ర‌లో శుభం కార్డు ప‌డ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కార్తీక్, దీప క‌ల‌వ‌డంతో సీరియ‌ల్ అయిపోతుంద‌ని ఆ మ‌ధ్య‌న నిరుప‌మ్ ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Karthika Deepam serial

  ఉత్తమ కథలు