Karthika Deepam: తెలుగు బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత మూడేళ్లుగా రేటింగ్‌లో టాప్ సీరియల్‌గా దూసుకుపోతుంది కార్తీక దీపం. ఇక ఈ సీరియల్లో నటిస్తోన్న కార్తీక్(పరిటాల నిరుపమ్), దీప(ప్రేమి విశ్వనాథ్), సౌందర్య(అర్చనా అనంత్), మోనిత(శోభా శెట్టి) తదితరులు తమ పాత్రలకు న్యాయం చేస్తూ బయట మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఈ సీరియల్ ఇటీవల మరో రేర్ ఫీట్‌ను అందుకుంది. మార్చి 30వ తేది నాటికి ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ నిరుపమ్. కార్తీక దీపంలో తన పాత్ర తనకే నచ్చడం లేదంటూ ఆయన కామెంట్లు చేశారు. కామన్ స్టోరీ అయినప్పటికీ ఇందులో ఉన్న ఎమోషన్ల వలనే చాలా మంది కార్తీక దీపంను ఇష్టపడుతున్నారని ఆయన అన్నారు.
ఇక ఈ సీరియల్లో కార్తీక్ పాత్రలో నటించడం తనకు ఎప్పుడు బోర్ కొట్టలేదని చెప్పారు. దీపను అనుమానించడం మొదలు పిల్లలపై ప్రేమ ఇలా ఈ సీరియల్లో తన పాత్రలో ఎన్నో షేడ్లు ఉన్నాయని.. ఇలాంటి అవకాశం బుల్లితెరపై అందరికీ దొరకదని అన్నారు. అయితే ఒక ప్రేక్షకుడిగా కార్తీక్ పాత్ర తనకు నచ్చలేదని అన్నారు. గత కొన్నేళ్లుగా ఆధారం లేని ఆరోపణలను పట్టించుకొని దీపను అనుమానించడం, ఆమెను కించపరచడం తనను కూడా ఇబ్బంది పెడుతుందని ఆయన తెలిపారు. అయితే సీరియల్ కథానుగుణంగా తప్పడం లేదని పేర్కొన్నారు. ఇక సీరియల్లో దీపను ఇబ్బంది పెట్టడంపై బయట చాలా మంది తనను అడుగుతూ ఉంటారని.. దీపకు ఎప్పుడు న్యాయం చేస్తావని అడుగుతుంటారని.. ఈ ప్రశ్నలు తనకు కామన్ అయిపోయాయని అన్నారు. అంతేకాదు తనకు బెదిరింపు మెసేజ్‌లు, ఫోన్లు కూడా వచ్చాయని.. వాటిని డైరెక్టర్‌కు, స్టార్ మా యాజమాన్యానికి చూపగా.. అప్పుడు నా పాత్రలో కొన్ని కొన్ని మార్పులు చేస్తూ వస్తున్నారని చెప్పుకొచ్చారు.
View this post on Instagram
ఇక ఇప్పట్లో సీరియల్‌కు శుభం కార్డు పడదని.. రానున్న ఎపిసోడ్లలో మరిన్ని ట్విస్ట్‌లు ఉండబోతున్నాయని.. ప్రేక్షకులు మెచ్చే విధంగా కార్తీక దీపం ఉంటుందని నిరుపమ్ తెలిపారు. ఇక రైటింగ్‌లో తనకు అనుభవం ఉన్నప్పటికీ.. స్ర్కిప్ట్ విషయంలో జోక్యం చేసుకోనని.. అయితే షూటింగ్‌కు ముందు సీన్లను డైరెక్టర్‌తో తామందరితో డిస్కస్ చేస్తారని.. అప్పుడు తన ఆలోచనలను మాత్రమే చెబుతానని డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Karthika Deepam serial, Paritala Nirupam (Doctor Babu), Television News