Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ లేకపోతే జనాలు ఏం అయిపోతారో.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

Karthika deepam

Karthika Deepam: ప్రస్తుతం బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఇక ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రిటీలను కూడా బాగా ఆకట్టుకుంటుంది.

  • Share this:
    Karthika Deepam: ప్రస్తుతం బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఇక ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రిటీలను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ కు సీనియర్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో, సీరియలలో దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజేంద్ర. కానీ కార్తీక దీపంతో మాత్రం ఓ రేంజ్ లో అభిమానుల నుండి కామెంట్స్ ఎదుర్కొంటున్నాడు. ఇక తాజాగా ఈ సీరియల్ లేకపోతే జనాలు ఏమవుతారో గురించి ఓ షాకింగ్ కామెంట్ చేశాడు.

    ఎందుకంటే ఈయన ఈ సీరియల్ లో ఇచ్చే ట్విస్టులు అలా ఉంటాయన్నమాట. నిజానికి ఈ సీరియల్ గత కొన్ని రోజుల నుండి ఒకే కథతో సాగుతుంది. కానీ ఆ కథను బోరు కొట్టనివ్వకుండా ఎన్నో ట్విస్టులతో సాగదీస్తూ ఉన్నాడు. ఇక అభిమానులు మాత్రం ఇంకెప్పుడు కార్తీక్, దీప లు కలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సీరియల్ కు శుభం కార్డు ఉంటుందా లేదా అని కూడా ప్రశ్నలు వేస్తున్నారు. కానీ డైరెక్టర్ రాజేంద్ర మాత్రం ఈ సీరియల్ గురించి ఒకటే మాట చెప్పాడు.

    ఇప్పుడున్న పాత్రలను మార్చనని, పిల్లలను పెద్దలుగా చేసే ఉద్దేశం లేదని అన్నాడు. అంతేకాకుండా ఒకవేళ బోర్ కొట్టినట్లు అనిపిస్తే ఏం ట్విస్ట్ పెట్టాలా అని ఆలోచిస్తాడట. కానీ ఈ సీరియల్ కు ఇప్పటంతలా శుభం కార్డు ఉండదని తెలిపాడు. ఇది కేవలం బిజినెస్ అని అందుకు మంచి రేటింగ్ తో ఉన్నంతవరకు కథను సాగదీస్తామని తెలిపాడు. ఇక తాజాగా రాజేంద్ర ఈ సీరియల్ గురించి మాట్లాడుతూ.. ఈ సీరియల్ ను ఎండ్ చేయాలన్నది జనాల కోరిక కాదని.. కేవలం కార్తీక్, దీప లు కలవాలన్నది. అంతేకాకుండా మోనిత గురించి అసలు విషయం బయట పడాలన్నది అభిమానుల కోరిక అని తెలిపాడు.

    ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, వాళ్లు ఎప్పుడు కలిసి సంతోషంగా ఉంటారనేది వాళ్ల కోరిక మాత్రమే అని, ఒకవేళ అభిమానుల కోసం వాళ్లను కలిపితే.. సీరియల్ లో రొటీన్ లైఫ్ ఉంటుందని అప్పుడు ప్రేక్షకులు చూడటానికి ఆసక్తి చూపించరు కాబట్టి సాగదీస్తున్నారట. ఇక ఈ సీరియల్ అయిపోతే కూడా జనాలు ఏం చేస్తారని.. అందుకే వాళ్ల కోసమే ఈ కథను సాగిదీస్తున్నామని.. అంతేకానీ నటుల కోసం మాత్రం కాదని తెలిపాడు. అంటే డైరెక్టర్ మాటలను బట్టి కథ ఇంకా సాగుతూనే ఉంటుందని.. పైగా దీప, కార్తీక్ లు కలవడానికి ఇంకా సమయం ఉందని అర్థమవుతుంది. ఇక ఈ వంకతో ఇంకెన్ని ట్విస్టులు చూపిస్తాడో కార్తీకదీపం డైరెక్టర్.
    Published by:Navya Reddy
    First published: