సరిలేరు నీకెవ్వరూ తొలి సాంగ్ విడుదలైంది. అందులో మహేష్ బాబు పక్కన వంటలక్క కూతురు బేబీ క్రితిక కనిపించింది. దీంతో అటు వంటలక్క అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
కార్తీకదీపం సీరియల్ దీప వంటలక్క కూతురు సౌర్యకు సూపర్ స్టార్ మహేష్ పక్కన తళుక్కుమంది. సోమవారం సరిలేరు నీకెవ్వరూ తొలి సాంగ్ విడుదలైంది. అందులో మహేష్ బాబు పక్కన వంటలక్క కూతురు బేబీ క్రితిక కనిపించింది. దీంతో అటు వంటలక్క అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బేబీ క్రితికకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆదరిపోయే ఛాన్స్ వచ్చింది. మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో బేబీ క్రితిక మెయిన్ రోల్ చేస్తోంది. ప్రస్తుతం రిలీజ్కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా, అలనాటి తార విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. దిల్ రాజు,అనిల్ సుంకర, మహేష్ బాబు ఈ సినిమాని కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12 న సినిమాని విడుదల చేయనున్నారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.