హోమ్ /వార్తలు /సినిమా /

కార్తీక దీపంలో ట్విస్ట్...వంటలక్క, డాక్టర్ బాబు కలిసిపోయే సమయంలో...అనుకోని ప్రమాదం...

కార్తీక దీపంలో ట్విస్ట్...వంటలక్క, డాక్టర్ బాబు కలిసిపోయే సమయంలో...అనుకోని ప్రమాదం...

కార్తీక దీపం యూనిట్ (Image: Youtube)

కార్తీక దీపం యూనిట్ (Image: Youtube)

ముందు ముందు ఎపిసోడ్స్ లో డాక్టర్ బాబు మనస్సు మార్చుకొని వంటలక్కను మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని, అయితే అక్కడే అసలైన ట్విస్ట్ ఉందని, టాక్ వినిపిస్తోంది.

కార్తీక దీపం సీరియల్ తెలుగులో అత్యంత ప్రజాదరణతో దూసుకుళ్తోంది. మొత్తం 650 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం ప్రస్తుతం ఒక కీలక దశకు చేరుకుంది. అయితే ఈ దశలోనే సీరియల్‌లో మొదటి సీజన్ ముగింపునకు వచ్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కథలో ఇఫ్పటికే కార్తీక్, దీపలను కలిపేందుకు కవల పిల్లలు సౌర్య, హిమ తీవ్రంగా ప్రయత్నం చేయడం, ఆ దిశగానే కథ ముందుకు కదలడం, దీప, కార్తీక్ ల మధ్య అపోహలు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి. తాజా ఎపిసోడ్ లో వంటలక్క, డాక్టర్ బాబు , పిల్లలు అంతా కలిసి బిర్యానీ పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం మోనితకు తెలుస్తుందని, దీంతో మోనితకు మెంటలెక్కిపోయి, డాక్టర్ బాబుకు కాల్ చేసి చెడామడా తిడుతుందనే టాక్ వినిపిస్తోది. అయితే మరోవైపు పిల్లలు ఇద్దరు తమ తల్లితండ్రులను కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.

అయితే ముందు ముందు ఎపిసోడ్స్ లో డాక్టర్ బాబు మనస్సు మార్చుకొని వంటలక్కను మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడని, అయితే అక్కడే అసలైన ట్విస్ట్ ఉందని, టాక్ వినిపిస్తోంది. మలయాళ మాతృకలో వంటలక్క, కార్తీక్ ఒక ప్రమాదం కారణంగా మళ్లీ విడిపోతారని, అయితే పిల్లలకు దూరంగా వంటలక్క గతం మర్చిపోతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే తెలుగులో కథ మారిందని, మళయాలంలో వంటలక్క, కార్తీక్ లకు ఒక్క కూతురే ఉందని ఈ నేపథ్యంలో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చూస్తే కథలో మార్పులు ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది.

First published:

Tags: Hotstar, Karthika deepam, Star Maa

ఉత్తమ కథలు