KARTHIKA DEEPAM ARDAPAVU BAGYAM ALIAS UMA DEVI FIGHT WITH ANNE MASTER BECAUSE OF ALOO CURRY NR
Bigg Boss 5 Telugu: ఇక్కడికి అడుక్కోవడానికి రాలేదంటూ కూర కోసం కార్తీకదీపం అర్ధపావు భాగ్యం రచ్చ.. గట్టిగట్టిగా అరుస్తూ
Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో దీప సవితి తల్లిగా నటిస్తున్న అర్థ పావు భాగ్యం అలియాస్ ఉమాదేవి గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే భాగ్యం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో అడుగు పెట్టి తానేంటో నిరూపించుకుంటుంది.
Bigg Boss 5 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో దీప సవితి తల్లిగా నటిస్తున్న అర్థ పావు భాగ్యం అలియాస్ ఉమాదేవి గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే భాగ్యం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో అడుగు పెట్టి తానేంటో నిరూపించుకుంటుంది. మొత్తానికి ఈ రియాలిటీ షో లో అవకాశాన్ని అందుకొని మరింత పరిచయాన్ని పెంచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇక్కడికి అడుక్కోడానికి రాలేదు అంటూ బాగా రచ్చరచ్చ చేసింది.
ఇక బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో హౌస్ లో బాగానే రచ్చ జరిగింది. నిజానికి అందరూ ఒకే చోట కలిసి ఉన్నప్పుడు కలిసి పని చేయడంలో తప్పు ఉండదని అందరికీ తెలుసు. ఎంతటి సెలబ్రెటీలు అయినా తమ హోదాను పక్కన పెట్టుకొని తాము చేస్తున్న పని గురించి, తాము ఉంటున్న ప్రాంతం గురించి ఆలోచించుకోవాలని ఈ బిగ్ బాస్ సెలబ్రిటీలకు మరో అవకాశాన్ని ఇచ్చింది. ఇక ఉమాదేవి కిచెన్ లో బాగానే సహాయపడుతుంది.
దీంతో ఆలు కూర తనకు వడ్డించకుండా ఫ్రిడ్జ్ లో ఎవరు పెట్టారు అంటూ ప్రశ్నించే సరికి ఆనీ మాస్టర్ వచ్చి నేనే పెట్టాను అంటూ సమాధానమిచ్చింది. దీంతో ఉమాదేవి కోపంతో.. నాకు వడ్డించకుండా ఫ్రిడ్జ్ లో ఎలా పెట్టారు అంటూ అనీ మాస్టర్ పై మండి పడింది. తను కూర అడిగినప్పుడు లేదని అన్నారు.. మరి ఇప్పుడు ఎలా ఉంది అని గట్టిగా ప్రశ్నించింది. నేను ఇక్కడికి అడుక్కోవడానికి రాలేదు అంటూ గట్టి గట్టిగా అరిచింది. వెంటనే ఆనీ మాస్టర్ సెకండ్ తినేవాళ్ళకు కూర సరిపోవడం లేదని అందుకే కూరను ఫ్రిడ్జిలో పెట్టానని.. కాని కూర ఉన్న విషయం మర్చిపోయానని తెలిపింది.
అంతటితో ఉమాదేవి ఆవేశం తగ్గకపోవడంతో వెటకారం గా మాట్లాడింది. మొదట కాకుండా సెకండ్ తినాలి అన్నమాట అంటూ కాస్త వెటకారంగా మాట్లాడటంతో కలిసి తింటే సరిపోతుంది కదా అని ఆనీ మాస్టర్ సమాధానమిచ్చింది. దానికి రెండు కూరలు చేసుకోవడం ఎందుకు ఒకటే చేసుకుంటే సరిపోతుంది కదా అంటూ బాగా రచ్చరచ్చ చేసింది. దీంతో ఆనీ మాస్టర్ మరో సమాధానం చెప్పలేక క్షమాపణలు తెలిపింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.