హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam | Archana Ananth : బుల్లెట్ రాణిలా అందాల అత్తమ్మ సౌందర్య.. బ్యూటిఫుల్ పిక్స్...

Karthika Deepam | Archana Ananth : బుల్లెట్ రాణిలా అందాల అత్తమ్మ సౌందర్య.. బ్యూటిఫుల్ పిక్స్...

అర్చన అనంత్ Photo : Instagram

అర్చన అనంత్ Photo : Instagram

Karthika Deepam | Archana Ananth : అర్చన అనంత్.. ఈ పేరు కొత్తగా వినవచ్చు కానీ.. కార్తీక దీపంలో అత్తమ్మ సౌందర్య అంటే టక్కున గర్తుపడుతారు.

అర్చన అనంత్.. ఈ పేరు కొత్తగా వినవచ్చు కానీ.. దీప అత్తమ్మ సౌందర్య అంటే టక్కున గర్తుపడుతారు. కార్తీక దీపం సీరియల్’లో దీప అత్తగా సౌందర్య పాత్రలో ఎంతో ఠివీని ఒకలబోస్తూ అదరగొడుతోన్న నటి అర్చన అనంత్. ఆ సీరియల్ హీరో కార్తీక్ పాత్రలో చేస్తోన్న నిరుపమ్ కంటే కూడా ఏజ్‌లో చిన్నది అర్చన.. అయినా కూడా ఎంతో హుందాగా అత్త పాత్రలో ఒదిగిపోయి వీక్షకుల్నీ ఆకట్టుకుంటోంది. అర్చన వయస్సు 32 సంవత్సరాలే.. కన్నడ భామ అయినా అర్చన తెలుగులో వరుసగా సిరీయల్స్’లో అవకాశం పొందుతూ త్వరలో ఓ సినిమాలో కూడా మెరవనుందని సమాచారం. ఇక కార్తీక దీపం సీరియల్ గురించి మాట్లాడితే.. ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కరలేదు. ఆ సీరియల్ దెబ్బకు బిగ్ బాస్ లాంటీ షోలు సైతం కుదేలైయాయి. అంతే స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ సీరియల్‌ను దీని రేటింగ్స్ ముందు చిన్నబోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే స్టార్ మా టీవీ రేటింగ్స్‌లో దూసుకుపోవాడానికి ఈ సీరియలే పెద్ద దిక్కు. అంతలా కార్తీక దీపం రేటింగ్స్‌ను తెచ్చిపెడుతోంది. ఇక ఆ సీరియల్’లో ఉండే క్యారెక్టర్స్‌ను ఓ సారి పరిశీలిస్తే.. కార్తిక్‌గా నిరుపమ్ పరిటాల ఆకట్టుకుంటుంటే.. దీప పాత్రలో వచ్చిరాని తెలుగుతో పరవాలేదనిపిస్తోంది ప్రేమి విశ్వనాథ్. అయితే ఈ రెండు పాత్రలతో పాటు మరో ప్రధాన పాత్ర సౌందర్య పాత్ర. ఈ పాత్ర ఎంతో హుందా ఉంటూ.. చక్కని ఆహార్యంతో ఆకట్టుకుంటోంది.

ఈ పాత్ర పవర్ లేడిగా మంచి అత్తగా చేస్తోన్న నటి అర్చన అనంత్. ఈమె గురించి చాలా మందికి ఎక్కువుగా తెలియదు.. అర్చన ప్రస్తుతం కార్తీక దీపంతో పాటు స్టార్ మా మరో సీరియల్ ‘కేరాఫ్‌ అనసూయ’లో కూడా నటిస్తోంది. ఇందులో కూడా పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తోంది అర్చన అనంత్.‌ ఈ అందాల అత్త అర్చన ఫ్యాషన్‌ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కెరీర్ మొదట్లో ఆరాటపడిందట. అయితే ఆ తర్వాత ఆ వృత్తి కలిసిరాక నటి అయి ఇప్పుడు తన విశ్వరూపం చూపుతోంది.


ఇటీవల అర్చన ఓ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యానని ‘‘ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేస్తున్నవేళా, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్‌ కోసం ఆడిషన్‌ ఇవ్వమని కోరగా.. సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్‌లో పాల్గొన్నాను. దీంతో నటించే అవకాశం వచ్చిందని పేర్కోంది. అయితే తన తొలి పాత్ర మాత్రం ఓ శవంలా పడుకోవడం అట. అలా తన నటనా ప్రయాణం ప్రారంభమైందని చెప్పుకొచ్చింది. అర్చన నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటుడు అనంత వేలు.


ఇక నటిగా మారిన పదేళ్లకు కానీ తెలుగులో తనకు అవకాశం రాలేదని తెలిపింది అర్చన. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్తీకదీపంలో సౌందర్య క్యారెక్టర్‌ కోసమే తనకు ఇన్నేళ్లూ తెలుగులో అవకాశం లభించలేదేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తుందంటూ కార్తీకదీపంలో ఆ పాత్ర లభించడం తన లక్ అని పేర్కోంది. ఇక తనకు సినిమాలపైన కూడా ఆసక్తి ఉందని.. సినిమా రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. కన్నడలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశానని.. కానీ తెలుగులో చేయలేదని.. అయితే ఓ మంచి క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇవ్వాలనీ కోరుకుంటున్నాని తెలిపింది. ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీర్‌గా కనిపించాలనుకుంటున్నాను. దాంతో పాటు ‘దాసీ’ క్యారెక్టర్‌లో కూడా నటించాలని ఉందన్నారు అర్చన..


ఇటీవల అర్చన ఓ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యానని ‘‘ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేస్తున్నవేళ, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్‌ కోసం ఆడిషన్‌ ఇవ్వమని కోరగా.. సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్‌లో పాల్గొన్నాను. దీంతో నటించే అవకాశం వచ్చింది. అయితే నా తొలి పాత్ర ఓ శవంలా పడుకోవడం. అలా నా నటనా ప్రయాణం ప్రారంభమైంది’’ అని చెప్పుకొచ్చారు.


అర్చన నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటుడు అనంత వేలు. నటిగా మారిన పదేళ్లకు కానీ తెలుగులో తనకు అవకాశం లభించలేదన్నారు అర్చన. కార్తీకదీపంలో సౌందర్య క్యారెక్టర్‌ కోసమే తనకు ఇన్నేళ్లూ అవకాశం లభించలేదేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తుందంటూ కార్తీకదీపంలో ఆ పాత్ర లభించడం తన లక్ అని పేర్కోన్నారు. తన సినిమా రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. కన్నడలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశానని.. కానీ తెలుగులో ఓ మంచి క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇవ్వాలనీ కోరుకుంటున్నాను. అదీ ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీర్‌గా కనిపించాలనుకుంటున్నాను. అలాగే ‘దాసీ’ క్యారెక్టర్‌లో కూడా నటించాలని ఉందన్న అర్చన.. మంచి అవకాశం వస్తే ఓటీటీలలో కూడా నటిస్తానని పేర్కోంది.

First published:

Tags: Television News

ఉత్తమ కథలు