హోమ్ /వార్తలు /సినిమా /

Karthika Deepam Vantalakka: 'కార్తీక దీపం' వంట‌ల‌క్క అభిమానుల‌కు షాకింగ్ న్యూస్

Karthika Deepam Vantalakka: 'కార్తీక దీపం' వంట‌ల‌క్క అభిమానుల‌కు షాకింగ్ న్యూస్

కార్తీక దీపం దీప

కార్తీక దీపం దీప

ప్రేమి విశ్వ‌నాథ్(Premi Viswanath) అభిమానుల‌కు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. కార్తీక దీపం సీరియ‌ల్‌లో దీప‌, వంట‌ల‌క్క‌గా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న ఈ కేర‌ళ బ్యూటీ ఒక సోష‌ల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యింది.

  Premi Viswanath: ప్రేమి విశ్వ‌నాథ్ అభిమానుల‌కు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. కార్తీక దీపం సీరియ‌ల్‌లో దీప‌, వంట‌ల‌క్క‌గా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న ఈ కేర‌ళ బ్యూటీ ఒక సోష‌ల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యింది. త‌న ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు ప్రేమి విశ్వ‌నాథ్ ఇన్‌స్టాలో వెల్ల‌డించారు. ప్రేమి విశ్వ‌నాథ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. రాఫెల్ రామిరెజ్ అనే వ్య‌క్తి ప్రేమి అకౌంట్‌ని హ్యాక్ చేశారు. అతడి అకౌంట్ బ్లాక్ అయ్యేలా ఫేస్‌బుక్‌కి రిపోర్ట్ చేయండి అని ఇన్‌స్టాలో స్టోరీలో పెట్టారు. ఆ హ్యాక‌ర్ అకౌంట్‌ని కూడా ప్రేమి త‌న సోష‌ల్ మీడియాలో తెలిపారు. అయితే ఆమె అకౌంట్‌లో మాత్రం ఇంత‌వ‌ర‌కు ఎలాంటి అనుచిత పోస్ట్‌లు రాలేదు.

  కాగా కార్తీక దీపం ద్వారా తెలుగు బుల్లితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు ప్రేమి విశ్వ‌నాథ్. ఆ సీరియ‌ల్ ద్వారా ఇక్క‌డ మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు ప్రేమి. ముఖ్యంగా వంట‌ల‌క్క‌గా ఎంతోమంది గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. కొన్ని నెల‌లుగా కార్తీక దీపం సీరియ‌ల్ రేటింగ్‌లో టాప్‌లో ఉందంటే దానికి ఒక కార‌ణం ప్రేమి న‌ట‌న‌.

  Instagram
  Premi Viswanath

  మ‌‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రేమికి అక్క‌డ కూడా ఎక్కువ మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇక ఇన్ని రోజులు బుల్లితెర‌కే ప‌రిమిత‌మైన ఈ న‌టి త్వ‌ర‌లో వెండితెర‌పై కూడా ద‌ర్శనం ఇవ్వ‌నున్నారు. తెలుగులో ఒక చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు ప్రేమి ఇటీవ‌ల వెల్ల‌డించారు.

  Published by:Manjula S
  First published:

  Tags: Karthika deepam, Premi Viswanath, Vantalakka deepa

  ఉత్తమ కథలు