Karthika Deepam: అమెరికాకు పయనమైన వంటలక్క కుటుంబం.. మోనిత తిరిగిచ్చేలోపు మనం వెళ్లిపోవాలంటూ?

karthika deepam

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుండి మంచి అభిమానం ఉంది. రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఇక కోర్టు నుండి స్టేషన్ కు వెళ్తున్న మోనిత.. సౌందర్యను, దీపను, ఆనందరావు లను గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లే పలకరిస్తూ పోతుంది.

 • Share this:
  Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుండి మంచి అభిమానం ఉంది. రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఇక కోర్టు నుండి స్టేషన్ కు వెళ్తున్న మోనిత.. సౌందర్యను, దీపను, ఆనందరావు లను గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లే పలకరిస్తూ పోతుంది. కార్తీక్ ను మన బిడ్డ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉండు అంటూ మళ్ళీ వస్తాను అని కార్తీక్ ను రాక్షస ప్రేమతో అలాగే చూస్తూ వెళ్లిపోతుంది. ఇక ఇంట్లో కార్తీక్ మేడ పైన దీప ను అవమానించిన రోజులను, సౌర్య మాటలను గతంలో తాను చేసిన తప్పులను తలుచుకొని బాధపడతాడు.

  మోనిత ఇచ్చినా వార్నింగ్ తలుచుకుంటూ టెన్షన్ పడతాడు. దీప కార్తీక్ ను ఎంత వెతికినా కనిపించడం లేదంటూ సౌందర్యతో చెప్పేసరికి ఆనంద్ రావు వచ్చి ఎక్కడికి వెళ్ళలేదు అంటూ ఆలోచనలో ఉన్నాడు అనేసరికి అందరూ మేడపైకి వెళ్తారు.కార్తీక్ ను చూసి పలకరిస్తారు. కార్తీక్ తను చేసిన తప్పులకు జీవితాంతం బాధపడాల్సి ఉంది అంటూ..మోనిత ఒక బాంబును తీసుకెళ్ళింది అంటూ అది ఏ క్షణమైనా పేలవచ్చు అంటూ.. ఎమోషనల్ అవ్వగా సౌందర్య ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచించొద్దు అని ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి అని ధైర్యం వస్తుంది. ఇక దీపకు కూడా ధైర్యం ఇస్తుంది. పిల్లలతో సంతోషంగా ఉండండి అని సలహాలు ఇస్తుంది.

  ఇది కూడా చదవండి:రసవత్తరంగా మారిన కార్తీకదీపం.. పక్క ప్లాన్ తో మోనిత షాకింగ్ ట్విస్ట్?

  మరోవైపు శ్రావ్య ఆదిత్య దగ్గరికి వచ్చి మోనితకు ఎంత కాలం శిక్ష పడింది అనేసరికి సంవత్సరన్నర అని ఆదిత్య చెబుతాడు. దాంతో చూస్తుండగానే సంవత్సరన్నర గడుస్తుంది. ఆ తర్వాత ఎలా అని టెన్షన్ తో ప్రశ్నలు వేస్తుంది. ఆదిత్య మాట్లాడుతూ జైల్లో ఉన్న వాళ్లకి జ్ఞానోదయం కలుగుతుంది అని విన్నాను. ఒకవేళ మోనితలో మార్పు వస్తుందేమో చూద్దాం లేదు మరింత మూర్ఖంగా ప్రవర్తిస్తే అప్పుడు చూసుకుందాం అంటూ బదులిస్తాడు.ఇక కార్తీక్ తన మైండ్ లో నుంచి అన్ని డిలీట్ చేసి హాల్ లో కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తాడు. శ్రావ్య వచ్చి పలకరిస్తుంది. ఇలా మిమ్మల్ని చూసి ఎంతో కాలం అయ్యింది అంటూ సంతోషంగా ఫీల్ అవుతుంది.

  ఇది కూడా చదవండి:ఇది ఇంట్రవెల్ మాత్రమే 'క్లైమాక్స్'లో చుక్కలు చూపిస్తానంటున్నా ఖైదీ మోనిత

  ఇక కార్తీక్ దగ్గరికి పిల్లలు సంతోషంగా వచ్చి కూర్చుంటారు. దీప కూడా వారి దగ్గర కూర్చుంటుంది. పిల్లలు మళ్లీ తమ మాటలతో తూటాలు పేల్చేలా అనిపించింది. ఎక్కడికైనా వెళ్దాం అని పిల్లలు కార్తీక్ తో అంటారు. వైజాగ్ అంటూ పిల్లలు ప్లాన్ చేయగా సౌందర్య వచ్చి ఎక్కడికి వెళ్ళేది లేదు అంటూ కావాలంటే కాసేపు బయటికి వెళ్ళిరండని గట్టిగా చెబుతోంది. ఒకవేళ అమెరికాకి వెళ్తే ఎలా అని సౌర్య అనడంతో వెంటనే సౌందర్య గట్టిగా క్లాస్ తీసుకుంటుంది. సౌర్య ఎక్కడికి వెళ్ళము అంటూ ఎమోషనల్ అవుతుంది. అదే సమయానికి ఆదిత్య వచ్చి అన్నయ్య అమెరికాకు వెళ్లడమే కరెక్టు అంటూ తర్వాత ఎదుర్కునే పరిణామాల గురించి అర్థం చేసుకుంటే మంచిది అనేసరికి కార్తీక్ ఆలోచనలో పడతాడు. మొత్తానికి కార్తీక్ జీవితం ఎటు అర్థంకాని పరిస్థితిగా మారిందనే చెప్పాలి.
  Published by:Navya Reddy
  First published: