Home /News /movies /

Karthika Deepam: ఆగిపోయే పెళ్లికి సిద్దమైన మోనిత.. పళ్ళు కొరుకుతూ నిప్పు రాజేస్తున్న వంటలక్క?

Karthika Deepam: ఆగిపోయే పెళ్లికి సిద్దమైన మోనిత.. పళ్ళు కొరుకుతూ నిప్పు రాజేస్తున్న వంటలక్క?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam:  ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతున్నారు. మోనిత ఇస్తున్న ట్విస్ట్ లతో ఏం జరుగుతుందో అని తెగ ఎదురుచూస్తున్నారు.

    Karthika Deepam:  ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతున్నారు. మోనిత ఇస్తున్న ట్విస్ట్ లతో ఏం జరుగుతుందో అని తెగ ఎదురుచూస్తున్నారు. ఇక దీప, కార్తీక్ లు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటారు. కార్తీక్ తన మనసులోని మాటలను, తన బాధను బయటకు పెడుతుంటాడు. కానీ దీప మాత్రం అంతే కోపంతో అర్థం కానీ సమాధానం ఇస్తుంది. ఇక దీప సమాధానాలతో కార్తీక్ మరింత కృంగిపోతుంటాడు.

    ఇక మోనిత సౌందర్య ఇంటికి వెళ్లగా అక్కడ సీన్ కాస్త ఆసక్తిగా మారింది. సౌందర్య ఏదో విషయం తెలిసినట్లుగా మోనిత తో గట్టిగా మాట్లాడింది. సౌందర్య మాటలకు మోనిత షాక్ అవుతుంది. కార్తీక్ ఏం చెప్పాడు అంటూ సౌందర్యని ప్రశ్నిస్తుంది. ఇక సౌందర్య మోనిత ను తెలిసి తెలియనట్లు నటించకు అంటూ.. కార్తీక్ చెప్పింది నిజమని నా మనసు చెబుతోంది అంటూ కార్తీక్ చెప్పిన విషయాలన్నీ చెప్పేస్తుంది సౌందర్య. ఇక మోనిత టెన్షన్ పడుతూ తన భయాన్ని బయట పెట్టకుండా కవర్ చేస్తుంది.

    తన మాటలతో గట్టిగా స్పందిస్తూ.. కార్తీక్ గురించి ఎలా నమ్ముతున్నావని ప్రశ్నిస్తుంది. గతంలో దీప విషయంలో జరిగినప్పుడు ఎందుకు నమ్మలేదని, ఇప్పుడెలా నవ్వుతున్నావని కాస్త ధైర్యం తో మాట్లాడుతుంది. ఇక అంతే ధైర్యంతో 25న కార్తిక్ తో పెళ్లి అని ఆశీర్వదించండి అత్తయ్య అనేసరికి అదే సమయంలో పిల్లలు కూడా వస్తారు. ఆ మాట విని సౌందర్య తో పాటు పిల్లలు కూడా షాక్ అవుతారు.

    ఇక పిల్లల ముందు మాట మారుస్తూ మాట్లాడుతుంది సౌందర్య. ఇక దీప పిల్లలు ఎక్కడికి వెళ్లారని టెన్షన్ పడుతూ ఉండగా అదే సమయంలో కార్తీక్ కూడా టెన్షన్ పడతాడు. దీప చివరికి సౌందర్య కి ఫోన్ చేసి పిల్లలు ఉన్నారని తెలుసుకుంటుంది. ఇక కార్తీక్ తో పిల్లలు మీ ఇంటికి వెళ్లారంట అని కోపంగా అనడంతో కార్తీక్ మీ ఇల్లు అంటుందేంటి అంటూ గతంలో తాను దీపని అవమానించిన సీన్ గుర్తుకు చేసుకుంటాడు.ఇక 25 న మోనిత పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా చెప్పగా.. మరి దీప పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. లేదంటే కార్తీక్ చెప్పిన మాటలతో దీప ఏదైనా చేసే అవకాశం ఉందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Karthika deepam, Nirupam paritala, Premi Vishwanath, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు