Home /News /movies /

KARTHIK SHOCKED BY VANTALAKKA BEHAVIOR IN KARTHIKA DEEPAM SERIAL TODAYS EPISODE NR

Karthika Deepam: గుండెల్ని పిండేసే సీన్స్.. కానీ కార్తీక్, దీప ఈ జన్మకు ఒక్కటవ్వరు.. కారణం ఇదే?

Karthika Deepam

Karthika Deepam

Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా మారింది. దీంతో ప్రేక్షకులు సీరియల్ ను రెప్పపాటు సమయాన్ని కూడా వదలకుండా చూస్తున్నారు.

    Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా మారింది. దీంతో ప్రేక్షకులు సీరియల్ ను రెప్పపాటు సమయాన్ని కూడా వదలకుండా చూస్తున్నారు. ఇదిలా ఉంటే మొత్తానికి నిజం తెలుసుకున్న కార్తీక్ దీపను కలుసుకున్న మరుక్షణమే మోనిత వల్ల మళ్లీ దూరం చేశాడు. దీంతో దీప పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇక దీప ఏమి చేయలేక ఇంట్లో నుంచి వెళ్లి పోతుంది. ఇంట్లో వాళ్ళు ఎంత వద్దన్నా కూడా వారి మాటలు వినిపించుకోకుండా వెళ్లిపోతుంది దీప. ఇక దీప చెయ్యని తప్పుకు ఇంట్లో నుండి వెళ్లిపోయిందని, ఇప్పుడు కార్తీక్ పెద్ద తప్పు చేశాడు అయినా కూడా దీప వెళ్ళిపోయింది అని శ్రావ్య ఆదిత్య తో అంటుంది. ఇక ఆ సమయంలో కార్తీక్ ఇంట్లోకి వచ్చి దీప కోసం ఇల్లు మొత్తం వెతుకుతాడు. దీప కనిపించకపోయేసరికి కంగారు పడుతుండగా దీప ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఆదిత్య చెబుతాడు.

    ఎక్కడికి వెళ్ళింది అంటూ ఎందుకు ఆపలేదు అని వారిని ప్రశ్నించాడు. ఇక సౌందర్య నువ్వు ఇచ్చిన షాక్ కీ మేమే భరించలేకపోతున్నాము అదేలా తట్టుకుంటుందని అంటుంది. ఇక కార్తీక్ తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుని చెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో సౌందర్య తన మాటకు అడ్డు చెబుతుంది. ఏ ఆడపిల్లయినా గర్భవతి విషయంలో అబద్ధం చెప్పరని అంటుంది సౌందర్య. కార్తీక్ ను మాటలతో తెగ బాధ పెడుతుంది. ఇక ఆదిత్య కూడా కార్తీక్ ను దూషిస్తాడు. అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా మోనిత దగ్గరికి వెళ్తావు, అక్కడే తింటావ్, అక్కడ పడుకుంటావా అని పైగా ఆమె మెడలో తాళి కడతావు అని కూడా మాట కూడా ఇచ్చావని అంటూ కోపంతో రగిలిపోతాడు ఆదిత్య. ఇక శ్రావ్య కూడా తన మనసులో బాధ లను బయటకు పెడుతుంది.

    కార్తీక్ తన మనసులో అన్ని తలుచుకొని కుమిలిపోతాడు. ఇక సౌందర్య వారిద్దరికీ ఏం న్యాయం చేస్తావో అని అంటుంది. కార్తీక్ దేవుడి దగ్గరికి వెళ్లి తన వేదనను తెలుసుకుంటాడు. ఇక దీప శ్రీరామ్ నగర్ లో తన ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంటుంది. వారణాసి దీపను ప్రశ్నలు వేస్తుంటాడు. అంతలోనే కార్తీక్ వచ్చి దీప దగ్గరికి వెళ్లి ఈ తప్పు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ దీప వినిపించుకోదు. ప్రస్తుతం ఈ పరిస్థితులు చూస్తే ఇక ఈ జన్మకు దీప, కార్తీక్ లు ఒకటవ్వరని తెలుస్తుంది. ఇక తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Karthika deepam, Mounitha, Soundarya, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు