హోమ్ /వార్తలు /సినిమా /

Atharva Teaser: అథర్వ టీజర్ గ్రాండ్ రిలీజ్.. సినిమాపై అంచనాలు పెంచేసిన విజువల్స్

Atharva Teaser: అథర్వ టీజర్ గ్రాండ్ రిలీజ్.. సినిమాపై అంచనాలు పెంచేసిన విజువల్స్

Atharva Teaser Launch (Photo Twitter)

Atharva Teaser Launch (Photo Twitter)

Atharva Teaser Release: పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటీ, నటులుగా తెరకెక్కుతున్న కొత్త సినిమా "అథర్వ" (Atharva). చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యువ హీరో కార్తీక్ రాజు (Karthik Raju), సిమ్రాన్ చౌదరి (Simran Choudhary), ఐరా నటీ, నటులుగా తెరకెక్కుతున్న కొత్త సినిమా "అథర్వ" (Atharva). డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.అతి త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.

ఇప్పటికే టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచిన యూనిట్.. తాజాగా వదిలిన టీజర్ తో ఆ ఆసక్తిని రెట్టింపు చేసింది.హీరో ఆకాష్ పూరి,క్లూస్ హెడ్ వెంకన్న, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, స్పై డైరెక్టర్ & ఎడిటర్ గ్యారీ,డైరెక్టర్స్ సుశాంత్ రెడ్డి, కనక మామిడి, తదితరులు ముఖ్య అతిధులుగా హాజరై చిత్ర టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ చూస్తుంటే ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిపోతూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఒక నిమిషం 15 సెకనుల నిడివితో కట్ చేసిన వీడియోలోని క్రైం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క్యూరియాసిటీ పెంచేశాయి. వరుస హత్యలకు సంబంధించిన మిస్టరీ చేధించేందుకు సైబరాబాద్ క్లూస్ టీమ్ లో జాయిన్ అయిన హీరో.. హంతకులను పట్టుకోవడానికి ఎలాంటి పన్నాగాలు వేశారు? అనే సీన్స్ ఆసక్తికరంగా చూపిస్తూ.. యాక్షన్ సీన్స్ కలగలిపి ప్రేక్షకుల దృష్టిని లాగేశారు మేకర్స్. ఈ వీడియోలో ''ఏరా పద్మవ్యూహంలో పెట్టి పైకి పంపిద్దాం అనుకున్నార్రా.. అసలు వ్యూహం పన్నిందే నేను రా..'' అనే డైలాగ్ హైలైట్ కాగా.. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ అయింది.

టీజర్ రిలీజ్ అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గెస్ట్ గా వచ్చిన హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. టీజర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హీరో కార్తీక్ రాజు చాలా బాగా నటించాడు. దర్శకుడు ఎంచుకున్న క్రైం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ స్టోరీ చాలా బాగుంది అన్నారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. క్లూస్ టీమ్ వంటి మంచి కథతో వస్తున్న ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.' isDesktop="true" id="1675290" youtubeid="3x3Gff-COFQ" category="movies">

చిత్ర నిర్మాత సుభాష్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. మా టీజర్ లాంచ్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషన్స్ తో పాటు లవ్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని కోణాలను టచ్ చేసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాలో కార్తీక్ రాజు సరసన సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు చరణ్ పాకాల, డి. ఓ పి,చరణ్ మాధవనేని, ఎడిటర్ ఉద్దవ్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ లతో పాటు క్లూస్ డిపార్ట్మెంట్, నటీ నటులు, టెక్నీసియన్స్ అందరూ ఫుల్ సపోర్టచేయడం తో సినిమా బాగా వచ్చింది. నిర్మాత సుభాష్ కథకు ఏం కావాలో అన్నీ సమాకూర్చారు. త్వరలో వస్తున్న మా సినిమాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. గతంలో నేను చాలా థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ చేశాను. కార్తీక్ తో ఇది నా రెండవ సినిమా. క్లూస్ డిపార్ట్మెంట్ కు రిలేటెడ్ గా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇందులో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో మూడు పెప్పీ సాంగ్స్ ఉంటాయి.యంగ్ ట్యాలెంట్ ఉన్న దర్శక, నిర్మాతలతో పని చేయడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ఈ సినిమాలో కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామారాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు నటించారు.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు