Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను అభిమానులుగా చేసుకుంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో 7:30 అయిన వెంటనే ఎంతపని ఉన్నా వదులుకొని మరీ ఈ సీరియల్ ను చూస్తుంటారు. ఇక ఈ సీరియల్ రేటింగ్ విషయంలో ముందు స్థానంలో ఉంది. ఇక ప్రతి రోజు సరికొత్త ఎపిసోడ్ లతో మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ సీరియల్ లో దీప ఆరోగ్యం రోజురోజుకు క్షీణించి పోతున్నందుకు కార్తీక్ దగ్గరవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక కార్తీక్ దీప పై ప్రేమ చూపిస్తూ మరింత దగ్గరగా అయ్యాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారు. కానీ కార్తిక్ తనకు దగ్గర కావడానికి కారణం తాను మారిపోయాడని కాదని తెలుస్తుంది. ఎందుకంటే దీప ఆరోగ్యం పాడవుతే.. పిల్లలు బ్రతకలేరని దీంతో దీప కూడా తన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నందుకు.. ఎలాగైనా తనపై ప్రేమ చూపించి తనని బతికించుకోవాలని ఆశతో కార్తీక్ దగ్గరయ్యాడు.
ఇదిలా ఉంటే కార్తీక్ కోసం మేడ పైన దీప ఇద్దరు పిల్లలు ఎదురుచూడగా.. మొత్తానికి కార్తీక్ వాళ్ల దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడ కాసేపు సరదాగా కార్తీక్ తన భార్య పిల్లలతో గడపగా దీపకు కార్తీక్ ఇంజెక్షన్ ఇస్తున్న సమయంలో జరగగా.. వెంటనే సౌర్య నాన్న ఇంజక్షన్ చేయడం రెండోసారి చూస్తున్నాను అంటూ కొన్ని మాటలు చెప్పింది. దీంతో దీప ఎమోషనల్ అవుతూ బాగా ఏడుస్తుంది. పిల్లలకు, కార్తీక్ కు ఈ విషయం అర్థం కాక కంగారు పడుతున్న సమయంలో కార్తీక్, పిల్లలు కలిసి ఓదారుస్తారు. ఇక అక్కడ తను బలబద్రపురం లో ఉన్న సమయంలో జరిగిన విషయాల గురించి సంభాషిస్తూ ఉండగా దీపా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది.
ఇక ఆ సమయంలో కింద తమ కుటుంబ సభ్యుల దగ్గరికి వారణాసి వచ్చి కార్తీక్ కార్ కీస్ ఇవ్వగా.. డాక్టర్ బాబు గారు పంచర్ అయితే చేయించి తీసుకొచ్చాను అంటూ, డాక్టర్ బాబు ని మోనితే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసింది అంటూ వారణాసి వాళ్లతో చెబుతాడు. ఇక వెంటనే మౌనిత అన్నయ్యని వదిలేలా లేదా అని ఆదిత్య అసహనంగా అంటుండగా.. వెంటనే మొన్నీమధ్య దీప మా ఇంటికి వచ్చి దీప దొరికిందా? అంకుల్ ఇంటికి వచ్చారా లేదా అనగా ఇన్ డైరెక్ట్ గా తిట్టి పంపించేశాను అంటుంది భాగ్యం. ఇక వాళ్ళల్లో దీప, కార్తీక్ కలిసిపోయాక ఎంతమంది మోనితలు వచ్చినా పర్వాలేదు అంటూ సౌందర్య ధీమాగా మాట్లాడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka